Korata siva
-
‘దేవర’ విధ్వంసం.. హోటల్ ధ్వంసం(ఫోటోలు)
-
నిడివి గురించి అడిగిన సందీప్ రెడ్డి.. దేవర టీమ్ కౌంటర్
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించడానికి దేవర సిద్ధమైంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. దేవర మొదటి పార్ట్ ఈ నెల 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.యానిమల్ డైరెక్టర్‌తో దేవర టీమ్ చిట్చాట్ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో దేవర పవర్ చూపించేందుకు టీమ్ తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలో యానిమల్ మూవీతో సెన్సేషన్‌గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వదిలారు.(చదవండి: దేవర రికార్డ్)నిడివి ఎంత?ఈ సినిమా ఎలా ఉండబోతోంది? క్యారెక్టర్లు ఏంటి? నిడివి ఎంత? అని సందీప్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించాడు. వాటన్నింటికీ తారక్, కొరటాల తెలివిగా ఆన్సర్స్ ఇచ్చారు. దేవర నిడివి గురించి వంగా అడగడంతో.. ఏంటి? ఈ ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? అని కొరటాల కౌంటర్ ఇచ్చాడు. దీంతో తారక్ మధ్యలో కలగజేసుకుంటూ యానిమల్ రన్‌టైమ్ ఎంత? అని ప్రశ్నించాడు. అందుకు సందీప్ రెడ్డి 3 గంటల 24 నిమిషాలు అని బదులిచ్చాడు.25 రోజులపాటు అండర్ వాటర్ సీన్స్..తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 25 రోజులపాటు అండర్ వాటర్ సీన్స్ షూటింగ్ చేశాం. ఈ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలిపాడు. జాన్వీ కపూర్ పాత్ర రాయడమే చాలా కష్టంగా అనిపించిందని కొరటాల పేర్కొన్నాడు. ఇక జాన్వీ మాట్లాడుతూ.. దేవర కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని జోస్యం పలికింది. ఇకపోతే దేవర రన్‌టైమ్ 2 గంటల 58 నిమిషాలు. Words as wild as the storm….Here’s the promo! 💥#Devara #DevaraOnSep27th pic.twitter.com/YHPNyCokDq— Devara (@DevaraMovie) September 14, 2024చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు -
జనతా గ్యారేజ్‌కు మరో టెన్షన్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జనతా గ్యారేజ్. భారీ అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా సక్సెస్‌పై చిత్రయూనిట్‌తో పాటు అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే ఇన్నాళ్లు సినిమా సక్సెస్ మీద ఎంతో ధైర్యంగా ఉన్న అభిమానులకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లో వేగం పెంచిన చిత్రయూనిట్ చాలా పోస్టర్లనే రిలీజ్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లను చూసిన జూనియర్ అభిమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. శుక్రవారం జనతా గ్యారేజ్ సినిమా సెన్సార్ పూర్తి అయిన సందర్భంగా చిత్రయూనిట్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లపై దర్శనమిస్తున్న ఈరోస్ లోగోనే అభిమానుల భయానికి కారణం. కొద్ది రోజుల క్రితమే తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈరోస్ సంస్ధ ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాల బాద్మతలను మాత్రమే తీసుకుంటూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్లుగా నిలిచాయి. 1 నేనొక్కడినే నుంచి తన ప్రయాణం మొదలుపెట్టిన ఈరోస్ సర్థార్ గబ్బర్‌సింగ్ వరకు భారీ డిజాస్టర్లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. కొన్ని సక్సెస్ ఫుల్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసినా.. సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ దీంతో ఇప్పుడు జనతా గ్యారేజ్‌ను ఇదే సంస్థ రిలీజ్ చేస్తుండటంతో సినిమా రిజల్ట్ ఏమవుతుందో అని భయపడుతున్నారు ఫ్యాన్స్.