
ఎన్టీఆర్ దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయింది. భారీ ఎత్తున అభిమానులు తరలి రావడంతో వేదిక ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు.

ఈ క్రమంలో కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహంతో నోవాటెల్ హోటల్ లో అద్దాలు ధ్వంసం చేశారు.

ఒక్కసారిగా గేట్లు తెలుసుకుని లోపలికి దూసుకెళ్లిన అభిమానులు


దీంతో హోటల్ ప్రాంగణంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది

దూసుకెళ్తే క్రమంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి


పోలీసులు నిలువరించినా ఫలితం లేకపోయింది. దీంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు

సుమారు 20 వేలకు మంది పైగానే అభిమానులు వచ్చినట్లు తెలుస్తోంది.
