
'దేవర'లో నటించిన శృతి మరాఠే గురించి ఈ విషయాలు తెలుసా..?

ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది

ఎన్టీఆర్ ఊరమాస్ అవతారంలో కనిపించే ఈ సినిమాలో మరాఠీ బ్యూటీ శృతి మరాఠే నటిస్తున్న విషయం తెలిసిందే

దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం రోల్‌లో కనిపిస్తారు. అందులో ఒకరికి జోడీగా శృతి మరాఠే నటిస్తుంది

37 ఏళ్ల శృతి మరాఠే మొదట మోడల్‌గా తన జర్నీని ప్రారంభించింది

గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఈ బ్యూటీ 2008లో ఒక మరాఠీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

తమిళ చిత్రాల్లో కూడా నటించిన శృతి ఆపై టీవీ సీరియల్స్‌లలో కూడా మెరిసింది

దేవర భార్య పాత్రకు ఒక ఫ్రెష్ ఫేస్ ఉండాలని అదికూడా ఎక్కువ అంచనాలు లేని నటిని తీసుకోవాలని కోరటాల శివ భావించారు

ఈ క్రమంలో శృతి మరాఠే ఫోటోలు కొరటాల శివకు చేరడం ఆపై ఆమెను వెంటనే ఓకే చేయడం జరిగిపోయింది

2016లో బాలీవుడ్ నటుడు గౌరవ్ ఘటనేకర్‌ను ఆమె వివాహం చేసుకుంది

దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శృతి మరాఠే

రెండేళ్ల క్రితం పూణేలో జరిగిన గణపతి నిమజ్జనం సమయంలో కొన్ని గంటల పాటు ఆమె డోలు వాయించింది.. ఆ వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి

ఈ ఏడాది కూడా వినాయకుడి ఉత్సవాల్లో ఆమె స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు

దేవర సినిమాలో ఆమె లుక్‌ను ఇప్పటికే రివీల్ చేశారు

‘దేవర’ మూవీ కోసం తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పిన శృతి

కోలీవుడ్ జనాలకు హాట్ బాంబ్‌గా పరిచయమైన శృతి మరాఠే ఇప్పుడు తెలుగువారికి ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతుంది
















