
అభిమానం వెర్రితలలు వేయడం అనే మాట వినే ఉంటారు. ప్రముఖ హీరోహీరోయిన్లపై ఇష్టంతో కొందరు ఫ్యాన్స్ వింత వింత పనులన్నీ చేస్తుంటారు. ఇలానే ఓ అమ్మాయి ఎవరూ ఊహించని పనిచేసింది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా ఇంట్లో ఏకంగా పనిమనిషిగా చేరిపోయింది. తాజాగా ఈ విషయాన్ని సదరు నటుడి భార్య బయటపెట్టింది.
అప్పట్లో హిందీలో తనదైన డ్యాన్సులతో గోవిందా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇతడి భార్య సునీత రీసెంట్‌గా ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ.. అప్పట్లో గోవిందా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేదోనని ఓ సంఘటన చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి ఎదురుదెబ్బ)
'ఆయనకు చాలామంది అభిమానులున్నారు. కానీ అప్పట్లో జరిగిన సంఘటనని అంత సులువుగా మర్చిపోలేను. మాకు పెళ్లయిన కొత్తలో ఓ అమ్మాయి మా ఇంటికి వచ‍్చింది. ఇంటి పనుల్లో సాయం చేస్తానని పనిమనిషిగా చేరింది. 20 రోజులు మాతోనే ఉంది. ఆమెకు ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడం అస్సలు రాదు. షూటింగ్ నుంచి ఆలస్యంగా వచ్చే మా ఆయన కోసం నిద్ర మానుకుని మరీ ఎదురుచూసేది. ఎందుకో అనుమానమొచ్చి ఆమెని కాస్త గట్టిగా అడగ్గా అసలు సంగతి బయటపెట్టింది. నా భర్తకు వీరాభిమాని అని చెప్పింది. దీంతో ఆమె ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాం. ఆమె తండ్రి నాలుగు ఖరీదైన కార్లలో మా ఇంటికి వచ్చారు. ఆయన మంత్రి అని తెలిసి షాకయ్యాం' అని చెప్పారు.
ఇక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గోవిందా.. కెరీర్ పీక్ దశలో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు. 2009 వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు.
(ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment