హీరో అల్లు అర్జున్ మరో మల్టీప్లెక్స్.. ఈసారి ఎక్కడంటే? | Allu Arjun New Multiplex In Visakhapatnam Details Revealed Soon | Sakshi
Sakshi News home page

Allu Arjun: ఆంధ్రాలో మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్న బన్నీ?

Mar 18 2024 11:38 AM | Updated on Mar 18 2024 1:42 PM

Allu Arjun New Multiplex In Visakhapatnam Details Revealed Soon - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్‌తో బిజీబిజీ. మొన్నీమధ్యే వైజాగ్ వెళ్లొచ్చాడు. దీని తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో కలిసి పనిచేస్తాడని అంటున్నారు.  దీని తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మూవీ ఉంది. ఇంత బిజీలోనూ అటు ఫ్యామిలీకి టైమ్ ఇస్తూనే మరోవైపు తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నాడు.  కొత్తగా మరో మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్)

ఒకప్పుడు తెలుగు హీరోలు.. సినిమాలు చేస్తూ మహా అయితే పలు వ్యాపారాలు చేసేవారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, మహేశ్ బాబు తదితరులు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంటరయ్యారు. హైదరాబాద్‌లో ఇప్పటికే మహేశ్‌కి ఏఎంబీ, అల్లు అర్జున్‌కి ఏఏఏ మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. త్వరలో రవితేజది ఓపెన్ అవుతుందని అంటున్నారు.

ఇప్పుడు అల్లు అర్జున్.. వైజాగ్‌లోనూ ఏఏఏ మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కడుతున్న ఇనార్బిట్ మాల్‌లో ఆసియన్ సంస్థతో కలిసి హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. నిజామా కాదా అనేది త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది. మరోవైపు ప్రస్తుతం చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్ల కంటే మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూసేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు హీరోలు ఈ బిజినెస్‌లో హవా చూపిస్తున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement