సలార్‌ VS డుంకి... వెనక్కు తగ్గేది ఎవరంటే? | Shah Rukh Khan's Dunki Postponed To Avoid Clash With Salaar | Sakshi
Sakshi News home page

సలార్‌ VS డుంకి... వచ్చేది ఒక్కరే.. రిస్క్‌ ఎందుకంటున్న స్టార్‌ హీరో!

Published Fri, Oct 13 2023 12:55 PM | Last Updated on Fri, Oct 13 2023 1:05 PM

Shah Rukh Khan Dunki Postponed No Clash With Salaar - Sakshi

డిసెంబర్‌ 22 కోసం ఇండియన్‌ సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అదే రోజు బాలీవుడ్‌ కింగ్‌ షారుక్‌ ఖాన్‌ 'డుంకి' సినిమాతో పాటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సలార్‌ విడుదల అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటనలు వచ్చేశాయి. ఇద్దరు బిగ్‌ స్టార్స్‌ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద తలపడేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో షారుక్‌ ఖాన్‌ కొంచెం వెనకడుగు వెసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పఠాన్‌,జవాన్‌ సినిమాలతో రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన కెరియర్‌లో మంచి స్వింగ్‌ మీద ఉన్నాడు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

అయినా డైనోసార్‌తో రిస్క్‌ చేయడం ఎందుకని షారుక్‌ ఒక అడుగు వెనక్కు వేశాడు. తన డుంకి సినిమాను డిసెంబర్‌ 22న విడుదల చేస్తున్నట్లు సలార్‌ కంటే ముందే వారు ప్రకటించారు. కానీ పలు వాయిదాలతో దూసుకుపోతున్న సలార్‌ చివరకు డుంకి సినిమాకు పోటీగా దిగేందుకు రెడీ అయ్యాడు. దీంతో చేసేది ఏం లేక షారుక్‌నే తన డుంకి సినిమాను 2024 జనవరి 26న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా పఠాన్‌ విడుదలైన విషయం తెలిసిందే.

దీంతో ప్రశాంత్ నీల్, షారుఖ్ ఖాన్ పై పగబట్టినట్లు ఉన్నాడని కోందరు కామెంట్లు చేస్తున్నారు. 2018లో KGF ఛాప్టర్ 1 సినిమాని షారుఖ్ ఖాన్ జీరో మూవీకి పోటీగా రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్… ఆ బిగ్గెస్ట్‌ క్లాష్‌లో గెలిచి జెండా ఎగరేశాడు. ఈ దెబ్బకి షారుఖ్ ఖాన్ అయిదేళ్ల పాటు సినిమాలు చేయలేదు. అయిదేళ్ల బ్రేక్ తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇచ్చాడు. తన కెరీర్‌ మొత్తంలో ప్రస్తుతం పీక్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ కి ఇప్పుడు మరోసారి రిష్క్‌ చేయకపోవడమే మంచిదని ఆయన నిర్ణయించుకున్నట్లు టాక్‌.

KGF టైంలో యష్ ఎవరికీ తెలియదు, ప్రశాంత్ నీల్ కూడా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడలా కాదు... సలార్‌లో డైనోసార్‌ ఉన్నాడు...  ప్రశాంత్ నీల్‌కు ప్రభాస్ కలిశాడు. ఇంకేముంది పోటీ భారీగానే ఉంటుంది. దీంతో ఓవర్‌సీస్‌ నుంచి ఇండియన్‌ బాక్సాఫీస్‌ వరకు డుంకి సినిమాకు కలెక్షన్స్‌ తగ్గే ప్రమాదం ఉందని ఆయన ముందే పసిగట్టాడు. కానీ ఇదోరకంగా సలార్‌కు మంచి అవకాశం. ఇదేరోజు డుంకి రిలీజ్‌ అయితే సలార్‌కు కూడా కొంత కలెక్షన్స్‌ తగ్గే ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడ బరిలో ఉండేది బాలీవుడ్‌ కింగ్‌. ఏదేమైనా డిసెంబర్‌ 22న సలార్‌ మాత్రమే వస్తున్నాడు. డుంకి వాయిదా విషయంపై అధికారికంగా త్వరలో ప్రకటన రావడం ఖాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement