
ఈ ఏడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇటీవల ఐఎండీబీ రిలీజ్ చేసిన జాబితాలో ఇండియాలో అత్యధిక ఆదరణ దక్కించుకున్న మూవీగా జవాన్ నిలిచింది. ఈ ఏడాది ప్రకటించిన థియేట్రికల్ సినిమాల్లో అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ నిలిచింది. ఈ సందర్భంగా అట్లీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
అట్లీ ఇన్‌స్టాలో రాస్తూ.. "జవాన్ అనేది ఓ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇది సమాజంలోని అన్యాయాలను సరిదిద్దాలని నిర్ణయించుకున్న ఒక వ్యక్తి లోతైన భావోద్వేగానికి సంబంధించినగి. ఈ సినిమా మీ అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ, ప్రేమ చాలా గొప్పది. ప్రపంచ సినిమా గురించి నాకున్న జ్ఞానానికి ఐఎండీబీ ప్రశంసలు పొందడంతో ఓ కల నిజమైంది. ఈ విజయం కోసం సహకారించిన షారూఖ్ ఖాన్ సార్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నా భార్య, నా టీమ్, ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ మీరు నంబర్ వన్ డైరెక్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు జవాన్-2 కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment