బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం పఠాన్. ఇటీవల విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కొద్దికాలంగా సక్సెస్ లేక కళ తప్పిన బాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కాగా ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న జవాన్ చిత్రంపై పఠాన్ ప్రభావం బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం, సంచలన నటి నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. దర్శకుడు అట్లీతో పాటు నయనతారకి బాలీవుడ్ ఎంట్రీ చిత్రం ఇదే. జవాన్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
షారుక్ ఖాన్ ఇటీవల ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నయనతార గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు షారుక్ ఖాన్ బదిలిస్తూ ఆమె సో స్వీట్ అని పేర్కొన్నారు. ఆమెకు అనేక భాషలు తెలుసని జవాన్ చిత్రంలో నయనతారతో కలిసి నటించడం మంచి అనుభవమని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఆమె నటన అందరికీ నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రంలో నటుడు విజయ్ సేతుపతి, నటి ప్రియమణి, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించడం విశేషం. ఇకపోతే జవాన్ నయనతార, దర్శకుడు అట్లిల బాలీవుడ్ భవిష్యత్‌ను నిర్ణయించే చిత్రం అవుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. నయనతార ప్రస్తుతం తమిళంలో మరో రెండు కొత్త చిత్రాలు నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Yes he is too sweet and Masha Allah healthy https://t.co/2Gz7aEj4Ov
— Shah Rukh Khan (@iamsrk) February 4, 2023
చదవండి: చిన్నారి పెళ్లికూతురు నటి సీమంతం
Comments
Please login to add a commentAdd a comment