Jawan Trailer Telugu Mistakes And Comparison - Sakshi
Sakshi News home page

Jawan Trailer Telugu:‍ తెలిసే చేశారా? లేదంటే ప్రేక్షకులు ఏమైనా..!

Published Mon, Jul 10 2023 6:51 PM | Last Updated on Mon, Jul 10 2023 7:05 PM

Jawan Trailer Telugu Mistakes And Comparison - Sakshi

Jawan Trailer Review: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ 'జవాన్' ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ డ్రామాగా తీస్తున్న ఈ సినిమాలో షారుక్ తోపాటు నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 'పఠాన్' లాంటి వెయ్యి కోట్ల మూవీ తర్వాత షారుక్ చేస్తున్న చిత్రమిదే. దీంతో అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ఈ క్రమంలోనే 'జవాన్' అంతకు మించి ఉండబోతుందనేలా ట్రైలర్ ఉంది.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!)

'జవాన్' కథేంటి?
ట్రైలర్‌ని చాలావరకు ఎలివేషన్స్ సీన్స్‌తో నింపేశారు. కాస్త స్టోరీని మాత్రం చెప్పి చెప్పనట్లు చూపించారు. మా అంచనా ప్రకారం.. జైల్లో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు(షారుక్ ఖాన్) గతంలో తల్లికి జరిగిన అన్యాయంపై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు. దీంతో ఆమె బాధకి కారణమైన వాళ్లని చంపాలనుకుంటాడు. ఎంతకైనా తెగిస్తుంటాడు. మరోవైపు ఇతడిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ (నయనతార), విలన్(విజయ్ సేతుపతి) వేర్వేరుగా ప్రయత్నిస్తుంటారు. చివరకు ఏమైందనేదే స్టోరీ. 

కాపీ షాట్స్!
'జవాన్' ట్రైలర్ అంతా బాగానే ఉంది. అయితే షారుక్ ముఖానికి సగం మాస్క్ పెట్టుకున్న సీన్ 'అపరిచితుడు'లో విక్రమ్‌ని.. చిన్నపిల్లాడ్ని గాల్లో ఎత్తి పట్టుకునే సీన్ 'బాహుబలి' మొదటి భాగాన్ని.. బాడీ మొత్తాన్ని క్లాత్‌తో కప‍్పేసుకున్న సీన్ 'మూన్ నైట్' వెబ్ సిరీస్‌ని గుర్తుచేసింది. ట్రైలర్ లో కనిపించి అమ్మాయిల గ్యాంగ్.. విజయ్ 'బిగిల్' చిత్రాన్ని జ్ఞాపకం తెచ్చింది. చివర్లో షారుక్ గుండుతో కనిపించే సీన్ చూడగానే 'శివాజీ'లో రజినీకాంతే గుర్తొచ్చాడు. అయితే ఇవన్నీ ప్రేక్షకుల్ని ఎంటర్‪‌టైన్ చేయడానికైతే ఓకే.. లేదంటే మొదటికే మోసపోయే అవకాశముంది.

(ఇదీ చదవండి: తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement