Shah Rukh Khan's Jawan Prevue Released - Sakshi
Sakshi News home page

Jawan Movie Trailer: ఎవరు నేను? మంచివాడ్నా? చెడ్డవాడినా?.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న ట్రైలర్‌

Published Mon, Jul 10 2023 11:12 AM | Last Updated on Mon, Jul 10 2023 12:26 PM

Shah Rukh Khan Jawan Prevue Released - Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘జవాన్’. తాజాగా జవాన్ ప్రివ్యూను రిలీజ్‌ చేశారు. ఇందులో షారుక్‌ నటన, యాక్షన్‌ చూసిన అభిమానులకు గూస్‌బంప్స్‌ రావడం ఖాయం. అనిరుధ్‌ రవించందర్‌ సంగీతం సినిమాకు అదనపు బలంగా మారనున్నట్లు కనిపిస్తోంది.

'ఎవరు నేను? ఎవర్నీ కాను.. తెలియదు.. తల్లికిచ్చిన మాట కావచ్చు, నెరవేరని లక్ష్యం కావచ్చు. నేను మంచివాడ్నా? చెడ్డవాడినా? పుణ్యాత్ముణ్ణా, పాపాత్ముణ్ణా నీకు నువ్వే తెలుసుకో.. ఎందుకంటే నేనే నువ్వు.. రెడీ' అన్న ఇంట్రస్టింగ్‌ ఇంట్రోతో ట్రైలర్‌ మొదలైంది. చీరకట్టులో విలన్‌ను చిత్తు చేస్తున్న సింగంగా దీపికా, బాస్‌ లుక్‌లో నయనతార, విలన్‌గా విజయ్‌ సేతుపతి ట్రైలర్‌లో కొద్ది సెకన్లపాటు కనిపించి పోయారు.

ఇది ఆరంభం మాత్రమే.., నేను విలనైతే ఏ హీరో నాముందు నిలబడలేడు అని హీరో నోటి నుంచి వచ్చే డైలాగులకు విజిల్స్‌ పడటం ఖాయం. వీడియో చివర్లో షారుక్‌ గుండుతో కనిపించాడు. ట్రైలర్‌ చూస్తుంటే పక్కా కమర్షియల్‌, యాక్షన్‌ కథాంశాల మేళవింపుగా ఉన్నట్లు కనిపిస్తోంది.

కోలీవుడ్‌ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 7న విడుదల కానుంది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, నయనతార, విజయ్‌ సేతుపతి తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా  ‘జవాన్’ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. 

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో కొత్త సినిమాల సందడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement