Jawan Co Star Nayanthara Goodbye to Shahrukh Khan With a Kiss in Chennai - Sakshi
Sakshi News home page

Nayanthara: షారుక్‌కు ముద్దు పెట్టిన నయనతార..!

Published Sun, Feb 12 2023 5:18 PM | Last Updated on Sun, Feb 12 2023 6:11 PM

Jawan co star Nayanthara Good Bye to Sharukh Khan with a kiss in Chennai - Sakshi

పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్న బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్. తన తదుపరి చిత్రం అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కనిపించనుంది. షూటింగ్‌ కోసం చెన్నై చేరుకున్న హీరో నయనతార ఇంటికి వెళ్లారు. అయితే షారుక్ ఖాన్ తిరిగి వెళ్తుండగా.. నయనతార అతనికి ముద్దు పెడుతూ వీడ్కోలు పలికింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గుడ్ బై చెప్పేందుకు నయనతార ఇంటివద్ద అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

జవాన్ షూటింగ్‌లో పాల్గొన్న షారుక్

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం చివరి షెడ్యూల్‌లో నయనతార కూడా పాల్గొంటోంది. పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎస్‌ఆర్కే మళ్లీ షూటింగ్‌లో బిజీ అయిపోయారు. జవాన్‌లో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన జవాన్ జూన్ 2023లో థియేటర్లలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement