Parineeti Chopra-Raghav Chadha Weddingబాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పెళ్లి సందడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్‌లో కీలకమైన మెహీందీ, హల్దీ వేడుకు ఫోటోలు నెట్‌లో సందడి చేస్తున్నాయి. ఈ జంట సెప్టెంబర్ 24న రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace) వేదికగా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి.
ఇప్పటికే వధూవరులతోపాటు బంధుమిత్ర సపరివారం ఉదయ్‌పూర్‌లో ల్యాండ్ అయ్యారు. ముఖ్యంగా బఈ వివాహ వేడుక నిమిత్తం ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ ఉదయ్‌పూర్ చేరుకున్నారు. రాఘవ్ , పరిణీతి వారి జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇవాళ రేపు(శని, ఆది) వివాహ వేడుకలు జరుగాయని వెల్లడించారు.
ఈసందర్బంగా ఉదయ్‌పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది.ఈ సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్‌లను లాక్ చేసుకున్నారు. వీరి పెళ్లికి బుక్ చేసిన హోటల్‌లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్ అద్దెఎంత అనేది ఆసక్తికరంగా మారింది. హోటల్ సూట్ ఒక రాత్రికి రూ. 10 లక్షలు వసూలు చేస్తుందట. 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ ట్రావెల్ ప్లస్ లీజర్ వరల్డ్ సర్వే అవార్డ్స్ – 2023లో ర్యాంక్ .అంతేకాదు లీలా ప్యాలెస్ ప్రపంచంలోని అత్యుత్తమ 100 మరియు భారతదేశానికి ఇష్టమైన 5 హోటళ్లలో కూడా స్థానాన్ని కూడా సంపాదించింది. శిల్పకళా సౌందర్యానికి పాపులర్ అయిన లీలా ప్యాలెస్ హోటల్అతిథులకు రుచికరమైన వంటల్ని వడ్డించనున్నారు.
VIDEO | “Raghav and Parineeti are set to step into a new chapter of their lives for which I want to extend my heartiest congratulations to them,” says AAP leader Sanjay Singh as he arrives in Udaipur to attend Raghav Chadha and Parineeti Chopra’s wedding. pic.twitter.com/vRn0MGcRmH
— Press Trust of India (@PTI_News) September 23, 2023
డిజైనర్ దుస్తుల్లో పరిణీతి, రాఘవ్ చద్దా జంట , అతిథులకు నో- ఫోన్
రాఘవ్ మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేసినట్టు వెల్లడించారు. ఇక పెళ్లి కూతురు పరిణీతి మనీష్ మల్హోత్రా సమిష్టిని ధరించనుంది. బేసిక్ సాలిడ్ పాస్టెల్ కలర్ లెహంగా, స్టేట్‌మెంట్ జ్యువెలరీ స్పెషల్ లుక్‌లో ఎట్రాక్షన్‌గా కనిపించనుందని టాక్. అంతేకాదు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాజరయ్యే అతిథులు గోప్యతను పాటించాల్సి ఉంది. అందుకే నో-ఫోన్ విధానాన్ని పాటించాలని వారికి సూచించినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment