నిహారిక పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. డెస్టినేషన్‌ వెడ్డింగ్ | Mega Daughter Niharika and Chaitanya To Tie Knot in Udaipur Rajasthan | Sakshi
Sakshi News home page

ఉదయ్ విలాస్ వేదికగా నిహారికా వివాహం

Published Wed, Nov 4 2020 7:15 PM | Last Updated on Wed, Nov 4 2020 8:00 PM

Mega Daughter Niharika and Chaitanya To Tie Knot in Udaipur Rajasthan - Sakshi

సాక్షి, తిరుపతి : ప్రముఖ నటుడు నాగబాబు కూమార్తె నిహారిక కొణెదల వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. డిసెంబర్‌ 9న వివాహం జరగనుంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు ఈ ఏడాది ఆగస్ట్‌లో నిశ్చితార్థం జరిగిన విషయం విదితమే.  పెళ్లి తేదీని వరుడి తండ్రి ప్రభాకరరావు మీడియాకు తెలిపారు. బుధవారం ప్రభాకరరావు దంపతులు తిరుమలకు విచ్చేసి, పెళ్లి శుభలేఖను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. (డిసెంబరులో మూడు ముళ్లు)

అనంతరం ప్రభాకరరావు వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారని తెలిపారు. అయితే పెళ్లి మాత్రం రాజస్థాన్‌లో జరగనుందట. ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్‌లో వివాహ వేడుకను నిర్వహించనున్నట్లు ప్రకభాకర్‌ రావు తెలిపారు. ఇక పెళ్లి పనులు కూడా మెగా వారింట ఇప్పటికే మొదలయ్యాయి. (నిహారిక ఇంట ప‌సుపు ఫంక్ష‌న్‌)

చదవండి: వైర‌ల్‌: కొత్త పెళ్లి కూతురుగా నిహారిక‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement