రాఘవ్ చద్దా, పరిణితిచోప్రా పెళ్లి సాధ్యమేనా? నటి స్టేట్‌మెంట్ వైరల్‌ | Parineeti Chopra Raghav Chadha Wedding Buzz Old Video Gone Viral | Sakshi
Sakshi News home page

రాఘవ్ చద్దా, పరిణితిచోప్రా పెళ్లి సాధ్యమేనా? వైరల్ అవుతున్న బాలీవుడ్ నటి స్టేట్‌మెంట్..

Apr 2 2023 9:21 PM | Updated on Apr 2 2023 9:29 PM

Parineeti Chopra Raghav Chadha Wedding Buzz Old Video Gone Viral - Sakshi

బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితీ చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ యువనేత రాఘవ్‌ చద్దాల వివాహంపై కొద్ది రోజులుగా రూమర్స్‌ జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి.  వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఓ కార్యక్రమానికి ఈ జోడీ కలిసివెళ్లడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. కానీ ఇప్పటివరకు వీరిద్దరు ఈ విషయంపై నోరుమెదపలేదు. ఈ వార్తలను ఖండించనూ లేదు ఖరారూ చేయలేదు.

అయితే తాజాగా పరిణితీ చోప్రా గతంలో ఇచ్చిన ఓ స్మేట్‌మెంట్‌కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన పరిణితి.. తాను రాజకీయ నాయకులను మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. స్వయంగాపైకి వచ్చినవారు అంటే తనకు ఇష్టమని, తనకు గౌరవం ఇచ్చేవారినే ఇష్టపడతానని పేర్కొంది. పొలిటిషియన్‌ను తప్ప ఏ రంగానికి చెందినవారినైనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని తెలిపింది.

ఈ అమ్మడు గతంలో ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యువ నాయకుడు రాఘవ్ చద్దాతో ఈమె సన్నితంగా మెలగడే ఇందుకు కారణం. ఈమె కొత్త సినిమాలో సహ నటుడు హార్డీ సంధు కూడా.. పరిణితి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని, ఎట్టకేలకు తనకు కావాల్సిన భాగస్వామి దొరికాడని వెల్లడించాడు. ఆమెకు అడ్వాన్స్‌గా.. ఆల్‌ది బెస్ట్ కూడా చెప్పాడు.

దీంతో రాఘవ్ చద్దాతోనే పరిణితి వివాహానికి సిద్ధం అవుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. వీరి పెళ్లి సాధ్యాసాధ్యాల గురించి జోరుగా చర్చిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడ్ని పెళ్లి చేసుకోనని చెప్పిన పరిణితి ఇప్పుడు మనసు మార్చుకుని ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రేమలో ఏదైనా సాధ్యమే అని అంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ అటు రాఘవ్‌కు ఇటు అభిమానులకు షాక్ ఇస్తుందా..? లేదంటే పెళ్లికి రెడీ అవుతుందా చూడాలి!
చదవండి: సొంత అంతరిక్ష విమానం.. కల సాకారానికి అడుగు దూరంలో భారత్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement