
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే అధికారికంగా పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయనున్నారు.
(ఇది చదవండి: చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!)
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం హాజరు కాలేదు. ఈ వేడుకకు ఆమె తల్లి, డాక్టర్ మధు చోప్రా హాజరయ్యారు. కాగా.. ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిణీతికి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment