ప్రియాంక చోప్రా సోదరి పెళ్లి.. ఆ మాత్రం రేంజ్‌ ఉండాల్సిందే! | Parineeti Chopra-Raghav Chadhas Udaipur Wedding Venue Cost | Sakshi
Sakshi News home page

Parineeti Chopra: పరిణీతి చోప్రా పెళ్లి.. ఒక్కరోజుకు రూ.9 లక్షలా!

Published Wed, Sep 6 2023 2:37 PM | Last Updated on Wed, Sep 6 2023 3:50 PM

Parineeti Chopra-Raghav Chadhas Udaipur Wedding Venue Cost - Sakshi

బాలీవుడ్ భామ, ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించిన భామ.. ఆ తర్వాత అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట ఈనెలలోనే వివాహా బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వీరిపెళ్లి వేదికపై బీటౌన్‌లో తెగ చర్చనడుస్తోంది. తారల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వేదిక ముస్తాబవుతోంది. వీరి పెళ్లి కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం. ఇద్దరు ప్రముఖ రంగాలకు చెందిన వారు కావడంతో అతిథులు సైతం అదేస్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!)

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దా ఈనెల 24న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తేదీలను ఇంకా ధృవీకరించనప్పటికీ వారి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారు.  రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికగా నిలవనుంది. మూడు రోజుల పాటు జరిగే మెహందీ, సంగీత్, హల్దీ  వేడుకల కోసం  లీలా ప్యాలెస్‌ ముస్తాబవుతోంది.  

అత్యంత ఖరీదైన హోటల్

ఈ ప్యాలెస్‌లోని హోటల్‌ గది ఒక్కరోజుకు  అత్యధికంగా రూ. 9 లక్షలకు పైగా ధర ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరు కానున్నారు. అయితే పెళ్లి తర్వాత గురుగ్రామ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ బాష్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మే 13న దిల్లీలోనిపరిణీతి, రాఘవ్‌ల నిశ్చితార్థ వేడుకకు కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ప్రియాంక చోప్రా హాజరయ్యారు. 

(ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement