షారూఖ్‌.. లుంగీ డ్యాన్స్‌ సాంగ్‌ తనకు నచ్చలేదన్నాడు | Honey Singh: Shah Rukh Khan Rejected Lungi Dance | Sakshi
Sakshi News home page

Honey Singh: లుంగీ డ్యాన్స్‌.. షారూఖ్‌ రిజెక్ట్‌ చేశాడు

Published Thu, Sep 5 2024 4:08 PM | Last Updated on Thu, Sep 5 2024 4:21 PM

Honey Singh: Shah Rukh Khan Rejected Lungi Dance

చెన్నై ఎక్స్‌ప్రెస్‌ మూవీలోని పాటలన్నీ హిట్టే! అందులోని లుంగి డ్యాన్స్‌ సాంగ్‌ అయితే మరింత స్పెషల్‌.. అయితే ఈ పాట చేయడానికి షారూఖ్‌ ఖాన్‌ నిరాకరించాడంటున్నాడు సింగర్‌ హనీ సింగ్‌. తాజా ఇంటర్వ్యూలో మరెన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. హనీ సింగ్‌ మాట్లాడుతూ.. నేను, గిప్పీ కలిసి ఆంగ్రేజీ బీట్‌ అనే మ్యూజిక్‌ వీడియోను థాయ్‌లాండ్‌లో షూట్‌ చేశాం. ఈ సాంగ్‌లో దాదాపు 400 మంది అమ్మాయిలు బికినీలో కనిపిస్తారు. 

రేపు నా ఇంటిమీదకొస్తే..
అయితే అప్పటికే పంజాబ్‌లో(అసభ్యకరమైన లిరిక్స్‌ వాడుతున్నానంటూ) నామీద కోపంతో నా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. దీంతో గిప్పి ఈ ఆంగ్రేజీ బీట్‌ను పక్కన పడేద్దామన్నాడు. నువ్వు ఢిల్లీలో ఉంటావు, కాబట్టి నీ దిష్టిబొమ్మలు తగలబెట్టినా బేఖాతరు చేస్తున్నావు. కానీ నేను పంజాబ్‌లోనే ఉంటాను. వాళ్లు మా ఇంటికి వచ్చి గొడవ చేసినా చేస్తారని భయపడ్డాడు. ఈ వీడియోను రిలీజ్‌ చేయకుండా ఆపేద్దామన్నాడు. 

నచ్చజెప్పేందుకు ప్రయత్నించా..
దానికోసం అంత ఖర్చు పెట్టింది ఇలా ఆపేయడానికా? అని చాలాసేపు వాదించాను. పంజాబ్‌లో తిరస్కరిస్తారేమో కానీ బెంగళూరు, హైదరాబాద్‌, వారణాసి.. ఇలా ఇతర నగరాల్లో కచ్చితంగా ఆదరిస్తారని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాను. కానీ అతడు మాత్రం ఆ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేస్తే నాతో మాట్లాడనని శపథం చేశాడు. దీంతో ఆ మ్యూజిక్‌ వీడియోను పక్కన పడేయక తప్పలేదు.

రెండూ సూపర్‌ హిట్‌
ఆంగ్రేజీ బీట్‌ లాంటిదే ఓ సాంగ్‌ కావాలని కాక్‌టైల్‌ సినిమాటీమ్‌ అడిగింది. అలాంటిది వద్దని పార్టీ ఆల్‌ నైట్‌ కంపోజ్‌ చేసిచ్చాను. కానీ వాళ్లు మాత్రం ఆంగ్రేజీ బీట్‌నే తీసుకున్నారు. పార్టీ ఆల్‌ నైట్‌ మరొకరు కొనుక్కున్నారు. రెండూ సూపర్‌ హిట్టయ్యాయి. దీంతో ఇలాంటిదే ఇంకోటి కావాలని చెన్నై ఎక్స్‌ప్రెస్‌ టీమ్‌ అడిగింది. సరేనని లుంగీ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశాను.

షారూఖ్‌కు నచ్చలేదు
కానీ షారూఖ్‌ ఖాన్‌ అది తనకు నచ్చలేదని రిజెక్ట్‌ చేశాడు. నేను నిరాశతో నిర్మాత భూషణ్‌ కుమార్‌ దగ్గరకు వెళ్లి సాంగ్‌ వినిపించాను. అప్పుడతడు ఇది కచ్చితంగా సూపర్‌ హిట్‌ అవుతుందన్నాడు. నిజానికి ఈ పాటను ప్రైవేట్‌గా రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ దర్శకుడు రోహిత్‌ శెట్టి సినిమా కోసం తీసుకున్నారు అని చెప్పాడు.

 

బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement