చిలిపిగా ‘లుంగీ డ్యాన్స్’ షారుక్ కు రజనీ ప్రశంస
చిలిపిగా ‘లుంగీ డ్యాన్స్’ షారుక్ కు రజనీ ప్రశంస
Published Fri, Aug 9 2013 9:44 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
రజనీకాంత్ యూనివర్సల్ అప్పీల్ ఉన్న నటుడు. అందుకే రజనీ దక్షిణాదికే పరిమితం కాలేదు. రజనీ అభిమానుల జాబితాలో సగటు ప్రేక్షకులే కాకుండా, సినీ నటులు కూడా చేరిపోయారు. తాజా రజనీ అభిమానుల జాబితాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కూడా చేరిపోయాడు.
తమిళ నేపథ్యంతో తెరకెక్కించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో ‘మూచోంఖో రౌండ్ గుమాకే, అన్నా కే జైసా చష్మా లగాకే, కోకోనట్ మే లస్సీ మిలాకే, ఆ జావో మూడ్ బనాకే.. ఆల్ ద రజనీ ఫ్యాన్స్, డోంట్ మిస్ ద చాన్స్.. లుంగీ డ్యాన్స్ లుంగీ డ్యాన్స్’ అంటూ రజనీపై అభిమానాన్ని షారుక్ చాటుకున్నాడు. రజనీపై చేసిన లుంగీ డ్యాన్స్ పాటను యూట్యూబ్‌లో కుటుంబ సభ్యులతోపాటు రజనీ చూశాడట. వెంటనే ఫోన్ చేసి ’పాట చిత్రీకరణ బాగుంది. చిలిపిగా ఉంది. చాలా స్వీట్‌గా ఉంది’ అంటూ ప్రశంసించారని షారుక్ వెల్లడించాడు.
ఈ పాట చిత్రీకరణకు ముందు రజనీ, ఆయన కూతురు సౌందర్యల అనుమతి తీసుకున్న తర్వాతే హానీ సింగ్‌తో పాడించామని షారుక్ తెలిపాడు. అయితే ‘బాలీవుడ్‌లో మీరు గొప్పస్టార్’, ’నాపై పాటను ఎందుకు చేస్తున్నారు’ అడిగిన తీరు ఆయన గొప్ప తనానికి నిదర్శనమని షారుక్ తెలిపారు. అయితే చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా రజనీ సార్ గొప్ప తనాన్ని ప్రస్తావించడానికి సరియైన సమయం లభించిందనిపించిందని, తలైవా గురించి ప్రస్తావించకపోతే ఈ సినిమాకు అర్ధం ఉండదు అని షారుక్ అన్నాడు.
Advertisement
Advertisement