Deepika Padukone: రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తదుపరి సినిమా గురించి చర్చ జరుగుతోంది. దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా ‘కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయడిత్తాల్’ (తెలుగులో ‘కనులు కనులు దోచాయంటే’) చిత్రదర్శకుడు దేసింగు పెరియసామి సూపర్ స్టార్ నెక్ట్స్ సినిమాని తెరకెక్కించనున్నారని టాక్. ఇందులో దీపికా పదుకోన్‌ని కథానాయికగా అనుకుంటున్నారట.
గతంలో ‘కోచ్చడయాన్’ (2014)లో రజనీ–దీపికా జంట కనిపించింది. అయితే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో యానిమేటెడ్ క్యారెక్టర్స్‌గా కనిపించారు. ఈసారి రెగ్యులర్ సినిమాలో ఈ జోడీ కనిపించడానికి రెడీ అవుతోందట. గతంలో ‘కోచ్చడయాన్’ చేసినప్పుడు దీపికా మాట్లాడుతూ – ‘‘సహనటీనటులు లేకుండా ఈ షూట్‌లో పాల్గొన్నాం. అందుకని రజనీ సార్‌తో ఎక్కువ సమయం స్పెండ్ చేయలేదు. ఈ సినిమాకి మూడు రోజులే పని చేశాను. అందులో రజనీ సార్ కాంబినేషన్‌లో చేసింది ఒకటిన్నర రోజే. అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ ఎంతో నిరాడంబరంగా, అందరితో స్నేహంగా ఉండేవారు రజనీ సార్’’ అని దీపికా పేర్కొన్నారు. మరి.. యానిమేషన్ జోడీగా కనిపించిన రజనీ–దీపికా రెగ్యులర్ సినిమాలో జంటగా కనబడతారా? వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment