మనోజ్తో సన్నీ లియోన్ లుంగీ డాన్స్ | Sunny Leone does the lungi dance! | Sakshi
Sakshi News home page

మనోజ్తో సన్నీ లియోన్ లుంగీ డాన్స్

Published Fri, Jul 11 2014 12:27 PM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

మనోజ్తో సన్నీ లియోన్ లుంగీ డాన్స్

మనోజ్తో సన్నీ లియోన్ లుంగీ డాన్స్

శృంగార చిత్రాల తార సన్నీ లియోన్ ఏం చేసినా సంచలనమే. ఆమె తెలుగులో ఓ సినిమా చేస్తోందనగానే అందరి కళ్లూ అటే వెళ్లాయి. 'కరెంటు తీగ' సినిమాలో మంచు మనోజ్తో పాటు సన్నీ లియోన్ కూడా నటిస్తోంది. దాంతో.. అసలు ఆ సినిమాలో సన్నీ ఏం చేయబోతోంది, ఎలాంటి పాటలు పాడుతుంది, ఏయే డాన్సులు చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశను నిరాశ చేయకుండా ఈ సినిమాలో ఆమె మొట్టమొదటిసారిగా 'లుంగీ డాన్స్' చేయబోతోందని తాజాగా వినిపిస్తోంది. ఇంతకుముందు లుంగీడాన్స్ పాటలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే అడుగులు కలిపారు.

కరెంటు తీగ సినిమాలో స్కూలు టీచర్ పాత్ర పోషిస్తున్న సన్నీ, ఆ పాత్రకు తగినట్లుగా నిండుగా చీర కట్టుకుని కనిపిస్తుందట. అయితే ప్రేక్షకులను నిరాశపరచకూడదని మంచు మనోజ్తో కలిపి ఆమెకు ఓ మాస్ సాంగ్ పెట్టారు. ఈ లుంగీ డాన్స్ పాటకు బృంద నృత్యదర్శకత్వం వహించారు. ఈ పాట షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో జరిగింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్సింగ్ కూడా నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement