current theega
-
కరెంట్ తీగ మూవీ న్యూ స్టిల్స్
-
అద్భుతాలు ఒకరితో ఆవిష్కృతం కావు
‘‘సినిమా అంటే సమష్టి కృషి. విజయానికి ఉపయోగపడే సలహా ఎవరిచ్చినా తీసుకుంటాను. అద్భుతాలు ఒక్కరితో అవిష్కృతం కావని నమ్ముతాన్నేను. దర్శకుని పనిలో మనోజ్ వేలు పెడతాడు అంటారు. సినిమాపై సర్వహక్కులూ కథానాయకునికి ఉంటాయని నా అభిప్రాయం’’ అని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో మంచు మనోజ్ కథానాయకునిగా మంచు విష్ణు నిర్మించిన ‘కరెంట్ తీగ’ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు నాగేశ్వరరెడ్డి. ‘‘కరెంట్‌తీగ లాంటి కుర్రాడి కథ ఇది. టైటిల్‌కి అతికినట్టు ఉండే పాత్రను మనోజ్ పోషించారు. ఈ సినిమాలో పోరాట సన్నివేశాలను కూడా తనే రూపొందించారు. ఎంతో రిస్కీ షాట్స్ చేశారాయన. రేపు ఆ సాహసాలను తెరపై చూస్తారు. ఇంటిల్లిపాదీ చూసి ఆనందించే సంపూర్ణ వినోదాత్మక చిత్రమిది. ఇప్పటివరకూ వచ్చిన మనోజ్ చిత్రాలన్నీ వినోదాత్మకంగానే సాగాయి. ఈ సినిమా వాటికి ఓ మెట్టు పైనే ఉంటుంది’’ అని చెప్పారు. ఇతర పాత్రల గురించి మాట్లాడుతూ-‘‘ఇందులో జగపతిబాబుది కీలక పాత్ర. ఆయన పాత్ర తీరుతెన్నులు ఆకట్టుకుంటాయి. రకుల్ ప్రీత్‌సింగ్ ఇందులో మరింత అందంగా కనిపిస్తారు. సన్నీ లియోన్ని ఇందులో చీరకట్టులో కొత్తగా కనిపిస్తారు. ఇటీవలే ఈ చిత్రాన్ని మోహన్‌బాబుగారు చూసి అభినందించారు. ఆయనే మా సినిమాకు తొలి ప్రేక్షకుడు కూడా’’ అని తెలిపారు. మరికొన్ని విషయాలు నాగేశ్వరరెడ్డి చెబుతూ- ‘‘నా సినిమాలన్నీ వినోద ప్రధానంగా సాగేవే. టికెట్ తీసుకొని థియేటర్లోకి అడుగుపెట్టే ప్రేక్షకుడు మనసారా నవ్వుకొని వెళ్లాలని కోరుకుంటాన్నేను. అందుకు తగ్గట్టే సినిమాలు తీశాను కూడా. పెద్ద హీరోలతో సినిమా చేయరేంటి? అని చాలామంది అడుగుతుంటారు. నిజానికి పెద్ద హీరోతో చేసే అవకాశం నాకు ఎప్పుడో వచ్చింది. కానీ... కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అయితే... త్వరలోనే ఓ అగ్ర హీరోతో సినిమా చేస్తా’’అని చెప్పారు. -
కరెంట్ తీగ మూవీ స్టిల్స్
-
సన్నీలియోన్ కారణంగా 'ఏ' సర్టిఫికెట్
చెన్నె: మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాకు సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. శృంగార తార సన్నీలియోన్ ప్రత్యేక గీతం కారణంగా ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ దక్కింది. 'సెన్సార్ బోర్డు సభ్యులు కరెంట్ తీగ సినిమా చూసి ఆనందించారు. సన్నిలియోన్ ప్రత్యేక గీతం లేకుంటే ఈ సినిమాకు యూ సర్టిఫికెట్ దక్కేది' అని నిర్మాణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే సన్నీలియోన్ ప్రత్యేక గీతంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయని నిర్మాత మంచు విష్ణు భావిస్తున్నారని తెలిపింది. ఈ పాటకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దీన్ని సినిమాలో పెట్టామని వెల్లడించింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన 'కరెంట్ తీగ'లో జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కరెంట్ తీగ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
సన్నీ లియోన్ పాట ఓ స్పెషల్
‘‘‘దేనికైనా రెడీ’ సినిమా సమయంలో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డికి పని పట్ల ఉన్న అంకితభావాన్ని చూశాను. ‘కరెంట్ తీగ’లో నన్ను హై రేంజ్లో చూపించాడు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు. ‘కరెంట్ తీగ’ మరో ఎత్తు’’ అని మంచు మనోజ్ అన్నారు. ఆయన కథానాయకునిగా, మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘కరెంట్ తీగ’. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రధారి. ఇందులో సన్నీలియోన్ ప్రత్యేక గీతంలో అభినయించిన విషయం తెలిసిందే. ఆమెకు బాలీవుడ్లో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ గీతం హిందీ వెర్షన్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనోజ్ మాట్లాడుతూ ‘‘సంగీత దర్శకుడు అచ్చుతో నా మూడో సినిమా ఇది. వరుసగా మూడు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన అచ్చుకు థ్యాంక్స్. జగపతిబాబుగారి పాత్ర ఈ చిత్రానికి వెన్నెముక. సన్నీలియోన్ ఎంతో రెస్పెక్ట్‌గా వచ్చి మా సినిమాలో నటించారు. ఆమె పాట చిత్రానికే హైలైట్’’అని తెలిపారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ -‘‘నా సినిమాలన్నీ మ్యూజికల్ హిట్సే. అలాగే మనోజ్ సినిమాలు కూడా. మేమిద్దరం కలిసి పనిచేసిన ఈ సినిమా పాటలు కూడా అద్భుతంగా కుదిరాయి. మోహన్‌బాబు, విష్ణు సహకారం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. కొంతమంది ప్రముఖ దర్శకులు ఈ సినిమా చూసి పెద్ద హిట్ అని జోస్యం చెప్పారు. దీపావళి కానుకగా ఈ నెల 17న మా నవ్వుల సీమటపాకాయ్ ‘కరెంట్ తీగ’ రూపంలో పేలబోతోంది’’ అని అన్నారు. ఇందులో విలన్‌గా నటించిన వీరేన్ కూడా మాట్లాడారు. -
సన్నీ లియోన్ తెలుగు పాటకు రూ. 1.5 కోట్లు
చెన్నై: శృంగార తార సన్నీ లియోన్‌కు బాలీవుడ్లోనే గాక దక్షిణాదిలోనూ డిమాండ్ పెరిగిపోతోంది. సన్నీ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్న నిర్మాతలు ఆమె పాటలను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి చిత్రీకరిస్తున్నారు. తెలుగు చిత్రంలో కరెంట్ తీగలో సన్నీ చిందేస్తున్న ఓ పాట కోసం ఏకంగా 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మంచ మనోజ్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, మరో్ హీరో జగపతి బాబు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 17న ఈ సినిమా విడుదల కానుంది. కరెంట్ తీగను హిందీలో కూడా డబ్ చేయనున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే సన్నీ పాటను నేషనల్ మ్యూజిక్, వినోదాత్మక చానెళ్ల ద్వారా విడుదల చేయనుండటం విశేషం. -
మన పక్కింటి కుర్రాడు!
యువతకు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే కథానాయకుల్లో మనోజ్ ఒకరు. జోష్‌గా ఉండే పాత్రలను రక్తి కట్టించడంలో మనోజ్ స్టయిలే వేరు. ప్రస్తుతం ఆయన ‘కరెంట్ తీగ’ చిత్రం చేస్తున్నారు. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రం పూర్తయ్యింది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇందులో మనోజ్‌ది మన పక్కింటి కుర్రాడి తరహా పాత్ర. తను చేసిన డేర్ డెవిల్ స్టంట్స్, అచ్చు స్వరపరచిన పాటలు ఈ చిత్రానికే హైలైట్. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రం ఇది’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్ కీలక పాత్ర చేస్తున్నారు. -
మనోజ్‌తో సన్నీ లియోన్ లుంగీ డాన్స్
శృంగార చిత్రాల తార సన్నీ లియోన్ ఏం చేసినా సంచలనమే. ఆమె తెలుగులో ఓ సినిమా చేస్తోందనగానే అందరి కళ్లూ అటే వెళ్లాయి. 'కరెంటు తీగ' సినిమాలో మంచు మనోజ్‌తో పాటు సన్నీ లియోన్ కూడా నటిస్తోంది. దాంతో.. అసలు ఆ సినిమాలో సన్నీ ఏం చేయబోతోంది, ఎలాంటి పాటలు పాడుతుంది, ఏయే డాన్సులు చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశను నిరాశ చేయకుండా ఈ సినిమాలో ఆమె మొట్టమొదటిసారిగా 'లుంగీ డాన్స్' చేయబోతోందని తాజాగా వినిపిస్తోంది. ఇంతకుముందు లుంగీడాన్స్ పాటలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే అడుగులు కలిపారు. కరెంటు తీగ సినిమాలో స్కూలు టీచర్ పాత్ర పోషిస్తున్న సన్నీ, ఆ పాత్రకు తగినట్లుగా నిండుగా చీర కట్టుకుని కనిపిస్తుందట. అయితే ప్రేక్షకులను నిరాశపరచకూడదని మంచు మనోజ్‌తో కలిపి ఆమెకు ఓ మాస్ సాంగ్ పెట్టారు. ఈ లుంగీ డాన్స్ పాటకు బృంద నృత్యదర్శకత్వం వహించారు. ఈ పాట షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ కూడా నటిస్తోంది.