సన్నీలియోన్ కారణంగా 'ఏ' సర్టిఫికెట్ | 'Current Theega' certified 'A', courtesy Sunny Leone's song | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్ కారణంగా 'ఏ' సర్టిఫికెట్

Published Fri, Oct 10 2014 12:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

సన్నీలియోన్ కారణంగా 'ఏ' సర్టిఫికెట్

సన్నీలియోన్ కారణంగా 'ఏ' సర్టిఫికెట్

చెన్నె: మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాకు సెన్సార్ బోర్డు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. శృంగార తార సన్నీలియోన్ ప్రత్యేక గీతం కారణంగా ఈ సినిమాకు  'ఏ' సర్టిఫికెట్ దక్కింది. 'సెన్సార్ బోర్డు సభ్యులు కరెంట్ తీగ సినిమా చూసి ఆనందించారు. సన్నిలియోన్ ప్రత్యేక గీతం లేకుంటే ఈ సినిమాకు యూ సర్టిఫికెట్ దక్కేది' అని నిర్మాణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే సన్నీలియోన్ ప్రత్యేక గీతంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయని నిర్మాత మంచు విష్ణు భావిస్తున్నారని తెలిపింది. ఈ పాటకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా దీన్ని సినిమాలో పెట్టామని వెల్లడించింది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన 'కరెంట్ తీగ'లో జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement