సన్నీ లియోన్ తెలుగు పాటకు రూ. 1.5 కోట్లు | Sunny Leone's Telugu song cost Rs.1.5 crore | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్ తెలుగు పాటకు రూ. 1.5 కోట్లు

Published Sun, Oct 5 2014 2:29 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

సన్నీ లియోన్ తెలుగు పాటకు రూ. 1.5 కోట్లు

సన్నీ లియోన్ తెలుగు పాటకు రూ. 1.5 కోట్లు

చెన్నై: శృంగార తార సన్నీ లియోన్కు బాలీవుడ్లోనే గాక దక్షిణాదిలోనూ డిమాండ్ పెరిగిపోతోంది. సన్నీ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్న నిర్మాతలు ఆమె పాటలను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి చిత్రీకరిస్తున్నారు. తెలుగు చిత్రంలో కరెంట్ తీగలో సన్నీ చిందేస్తున్న ఓ పాట కోసం ఏకంగా 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

మంచ మనోజ్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, మరో్ హీరో జగపతి బాబు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 17న ఈ సినిమా విడుదల కానుంది. కరెంట్ తీగను హిందీలో కూడా డబ్ చేయనున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే సన్నీ పాటను నేషనల్ మ్యూజిక్, వినోదాత్మక చానెళ్ల ద్వారా విడుదల చేయనుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement