పంజాబ్ తోటల్లో లుంగీ డాన్స్! | Hansika's Lungi Dance | Sakshi
Sakshi News home page

పంజాబ్ తోటల్లో లుంగీ డాన్స్!

Jan 19 2014 12:17 AM | Updated on Sep 2 2017 2:45 AM

పంజాబ్ తోటల్లో లుంగీ డాన్స్!

పంజాబ్ తోటల్లో లుంగీ డాన్స్!

‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనె చేసిన లుంగీ డాన్స్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత పలు వేదికల్లో

 ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనె చేసిన లుంగీ డాన్స్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత పలు వేదికల్లో ఈ పాటకు కాలు కదిపారు షారుక్. ఈ లుంగీ డాన్స్‌కి వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో లుంగీ డాన్స్ పాటలను పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్, హన్సిక జంటగా తమిళంలో రూపొందుతున్న ‘మాన్ కరాటే’ చిత్రంలో కూడా లుంగీ డాన్స్ ఉంది. 
 
 ‘కొలవెరి..’ పాట ఫేమ్ అనిరుథ్ స్వరపరచిన ఈ పాటకు బృందా మాస్టర్ నృత్యదర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాటను పంజాబ్‌లోని తోటల్లో చిత్రీకరిస్తున్నారు. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉందట. ఊలు దుస్తులు ధరించినా తట్టుకోలేనంత చలి అన్నమాట. కానీ, ఆ చలిని ఖాతరు చేయకుండా హీరో శివకార్తికేయన్‌లానే తను కూడా  గళ్ల లుంగీ, గళ్ల చొక్కా ధరించి, ఈ మాస్ పాటకు హుషారుగా డాన్స్ చేశారట హన్సిక. ఈ పాటలో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిందని దర్శకుడు అంటున్నారు. ఈ లుంగీ డాన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఊహించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement