తినడమే మరచిపోయా
తినడమే మరచిపోయా
Published Sun, Jan 19 2014 2:20 AM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM
అన్నం తినడమే మరచిపోయానంటున్నారు యువ నటుడు శివకార్తికేయన్. ప్రస్తుత నిర్మాతల నమ్మక నటుడీయన. కాల్‌షీట్స్ ఇస్తే బాగుండునని దర్శకులు కోరుకునే నటుడు కూడా. యువ కథానాయికలు జత కట్టాలని ఆశిస్తున్న నటుడు శివకార్తికేయన్. కారణం సక్సస్సే. మనంకొత్తి పరవై, కేడి భిల్లా కిల్లాడి రంగా, ఎదుర్‌నీశ్చల్, వరుత్త పడాద వాలిభర్ సంఘం ఇలా ఒక దాన్ని మించి ఒకటి విజయం సాధించడంతో శివకార్తికేయన్ క్రేజీ నటుడైపోయారు. ప్రస్తుతం ఈ యువ నటుడి చేతిలో అరడజను చిత్రాలున్నాయి. మరికొందరు దర్శక నిర్మాతలు ఆయన కాల్‌షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి క్రేజీ హీరోతో మినీ ఇంటర్వ్యూ.
ఈ స్థాయిని ఊహించారా?
నిజంగా ఊహించలేదు. అందరి నటుల మాదిరిగానే నేనూ కృషి చేశాను. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి స్థాయిని అందించారు.
ఈ విజయం ఏమనిపిస్తోంది?
నాకు మైకం కాదు కానీ భయం కలుగుతోంది. మరింతగా శ్రమించాలి. విజయాన్ని నిలుపుకోవాలి అనే ఉద్వేగానికి గురి చేస్తోంది. నటన యథార్థంగా ఉండాలి అదే విధంగా కొత్తగాను ఉండేలా చూసుకోవాలి అని హెచ్చరిస్తున్నట్లు ఉంది.
పోటీ పెరిగిపోయింది కదా అంటే?
వ్యక్తిగతంగా ఎవరికి ఎవరితో పోటీలేదనుకుంటున్నాను. నటనలో మ్తారమే పోటీతత్వం ఉంటుంది. అది ఆరోగ్యకరంగా ఉంటే ఎంతో మంచి సినిమాలు వస్తారుు.
మీరు ఏ ప్రాతిపదికపై కథలను ఎంపిక చేసుకుంటారు?
కథ సహజత్వానికి దగ్గరగా ఉండాలి. కుటుంబంలోని అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలు ఉండాలి. కేడి భిల్లా కిల్లాడి రంగా, వరుత్త పడాద వాలిభర్ సంఘం చిత్రాలను ఇలానే ఎంపిక చేసుకున్నాను.
నయనతార కోసం పట్టుబడుతున్నారంట...?
నిజం చెప్పాలంటే హీరోయిన్లలను నేను ఎంపిక చేయను. మాన్ కరాటే చిత్రంలో హన్సికను హీరోయిన్‌గా ఎంపిక చేసింది దర్శక నిర్మాతలే. ఇక తదుపరి చిత్రంలో నాకు జంటగా నయనతారను ఎంపిక చేయూలని చెప్పినట్లు వార్త చదివి నవ్వుకున్నాను. అది వదంతి మాత్రమే. నా తదుపరి చిత్రానికి హీరోయిన్ ఎవరన్నది దర్శక నిర్మాతల నిర్ణయమే.
యాక్షన్ హీరోలకే అధిక ప్రాముఖ్యత ఉం టుందా?
యాక్షన్ కథానాయకులకు అధిక మర్యాద అన్నది నిజమేనని అంగీకరిస్తాను. అయితే మాస్ హీరోలే సినిమాలో నిలదొక్కుకోగలరు. నేను హాస్యభరిత చిత్రాల్లోనే నటించగలనని నన్ను నేను తక్కువ చేసుకోను. నేను మెల్లగా యాక్షన్ హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాను. ఇందుకు తొలి అడుగు మాన్ కరాటే అని చెప్పవచ్చు.
నటుడు ధనుష్‌కు మీకు మధ్య స్నేహం గురించి?
స్నేహానికి మించిన మర్యాద ధనుష్‌పై నాకుంది. 3 చిత్రానికి నన్ను సిఫార్సు చేసింది ఆయనే. అందులో నా పాత్ర పరిధిని పెంచమని చెప్పారు. నా నటనను అభినందించారు. తదుపరి తన సొంత చిత్రం ఎదుర్‌నీశ్చల్ చిత్రంలో నాకు హీరో అవకాశం ఇచ్చారు. ఆయన సంస్థలో మరో చిత్రం చేయనున్నాను. ఇతర నటులు ఎదగాలనే విశాల మనసు ధనుష్‌ది.
నిరంతరం శ్రమిస్తున్నారట?
ఇటీవల జిమ్‌కు వెళుతున్నాను. డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఆహార విషయంలో నిబద్ధత పాటిస్తున్నాను. వరి అన్నం తినడం మానేశాను. శరీరానికి కావలసిన పౌష్టిక ఆహా రాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. పండ్లు, కాయగూరలు అధికంగా తింటున్నాను. శరీరం దృఢంగా ఉండటానికి ఈ ఆహార నియమాలు బాగా పని చేస్తున్నాయి.
Advertisement
Advertisement