
శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్ ప్రకటనతో పాటు అదిరిపోయే గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. మావీరన్, అయలాన్, అమరన్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన శివ కార్తికేయన్. ఇప్పుడు మరో భారీ విజయంపై కన్నేశాడు. తన కెరీర్‌లో 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రానికి మదరాసి అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ కూడా పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌లతో ఉంది.

మదరాసి చిత్రంలో శివ కార్తికేయన్ పవర్‌పుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా నటి రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై శ్రీ లక్ష్మి ప్రసాద్, సుందర్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.