Maan Karate
-
తినడమే మరచిపోయా
అన్నం తినడమే మరచిపోయానంటున్నారు యువ నటుడు శివకార్తికేయన్. ప్రస్తుత నిర్మాతల నమ్మక నటుడీయన. కాల్షీట్స్ ఇస్తే బాగుండునని దర్శకులు కోరుకునే నటుడు కూడా. యువ కథానాయికలు జత కట్టాలని ఆశిస్తున్న నటుడు శివకార్తికేయన్. కారణం సక్సస్సే. మనంకొత్తి పరవై, కేడి భిల్లా కిల్లాడి రంగా, ఎదుర్‌నీశ్చల్, వరుత్త పడాద వాలిభర్ సంఘం ఇలా ఒక దాన్ని మించి ఒకటి విజయం సాధించడంతో శివకార్తికేయన్ క్రేజీ నటుడైపోయారు. ప్రస్తుతం ఈ యువ నటుడి చేతిలో అరడజను చిత్రాలున్నాయి. మరికొందరు దర్శక నిర్మాతలు ఆయన కాల్షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి క్రేజీ హీరోతో మినీ ఇంటర్వ్యూ. ఈ స్థాయిని ఊహించారా? నిజంగా ఊహించలేదు. అందరి నటుల మాదిరిగానే నేనూ కృషి చేశాను. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి స్థాయిని అందించారు. ఈ విజయం ఏమనిపిస్తోంది? నాకు మైకం కాదు కానీ భయం కలుగుతోంది. మరింతగా శ్రమించాలి. విజయాన్ని నిలుపుకోవాలి అనే ఉద్వేగానికి గురి చేస్తోంది. నటన యథార్థంగా ఉండాలి అదే విధంగా కొత్తగాను ఉండేలా చూసుకోవాలి అని హెచ్చరిస్తున్నట్లు ఉంది. పోటీ పెరిగిపోయింది కదా అంటే? వ్యక్తిగతంగా ఎవరికి ఎవరితో పోటీలేదనుకుంటున్నాను. నటనలో మ్తారమే పోటీతత్వం ఉంటుంది. అది ఆరోగ్యకరంగా ఉంటే ఎంతో మంచి సినిమాలు వస్తారుు. మీరు ఏ ప్రాతిపదికపై కథలను ఎంపిక చేసుకుంటారు? కథ సహజత్వానికి దగ్గరగా ఉండాలి. కుటుంబంలోని అన్ని వర్గాల వారికి నచ్చే అంశాలు ఉండాలి. కేడి భిల్లా కిల్లాడి రంగా, వరుత్త పడాద వాలిభర్ సంఘం చిత్రాలను ఇలానే ఎంపిక చేసుకున్నాను. నయనతార కోసం పట్టుబడుతున్నారంట...? నిజం చెప్పాలంటే హీరోయిన్లలను నేను ఎంపిక చేయను. మాన్ కరాటే చిత్రంలో హన్సికను హీరోయిన్గా ఎంపిక చేసింది దర్శక నిర్మాతలే. ఇక తదుపరి చిత్రంలో నాకు జంటగా నయనతారను ఎంపిక చేయూలని చెప్పినట్లు వార్త చదివి నవ్వుకున్నాను. అది వదంతి మాత్రమే. నా తదుపరి చిత్రానికి హీరోయిన్ ఎవరన్నది దర్శక నిర్మాతల నిర్ణయమే. యాక్షన్ హీరోలకే అధిక ప్రాముఖ్యత ఉం టుందా? యాక్షన్ కథానాయకులకు అధిక మర్యాద అన్నది నిజమేనని అంగీకరిస్తాను. అయితే మాస్ హీరోలే సినిమాలో నిలదొక్కుకోగలరు. నేను హాస్యభరిత చిత్రాల్లోనే నటించగలనని నన్ను నేను తక్కువ చేసుకోను. నేను మెల్లగా యాక్షన్ హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాను. ఇందుకు తొలి అడుగు మాన్ కరాటే అని చెప్పవచ్చు. నటుడు ధనుష్‌కు మీకు మధ్య స్నేహం గురించి? స్నేహానికి మించిన మర్యాద ధనుష్‌పై నాకుంది. 3 చిత్రానికి నన్ను సిఫార్సు చేసింది ఆయనే. అందులో నా పాత్ర పరిధిని పెంచమని చెప్పారు. నా నటనను అభినందించారు. తదుపరి తన సొంత చిత్రం ఎదుర్‌నీశ్చల్ చిత్రంలో నాకు హీరో అవకాశం ఇచ్చారు. ఆయన సంస్థలో మరో చిత్రం చేయనున్నాను. ఇతర నటులు ఎదగాలనే విశాల మనసు ధనుష్‌ది. నిరంతరం శ్రమిస్తున్నారట? ఇటీవల జిమ్‌కు వెళుతున్నాను. డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఆహార విషయంలో నిబద్ధత పాటిస్తున్నాను. వరి అన్నం తినడం మానేశాను. శరీరానికి కావలసిన పౌష్టిక ఆహా రాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. పండ్లు, కాయగూరలు అధికంగా తింటున్నాను. శరీరం దృఢంగా ఉండటానికి ఈ ఆహార నియమాలు బాగా పని చేస్తున్నాయి. -
పంజాబ్ తోటల్లో లుంగీ డాన్స్!
‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో షారుక్ ఖాన్, దీపికా పదుకొనె చేసిన లుంగీ డాన్స్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత పలు వేదికల్లో ఈ పాటకు కాలు కదిపారు షారుక్. ఈ లుంగీ డాన్స్‌కి వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో లుంగీ డాన్స్ పాటలను పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్, హన్సిక జంటగా తమిళంలో రూపొందుతున్న ‘మాన్ కరాటే’ చిత్రంలో కూడా లుంగీ డాన్స్ ఉంది. ‘కొలవెరి..’ పాట ఫేమ్ అనిరుథ్ స్వరపరచిన ఈ పాటకు బృందా మాస్టర్ నృత్యదర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాటను పంజాబ్‌లోని తోటల్లో చిత్రీకరిస్తున్నారు. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉందట. ఊలు దుస్తులు ధరించినా తట్టుకోలేనంత చలి అన్నమాట. కానీ, ఆ చలిని ఖాతరు చేయకుండా హీరో శివకార్తికేయన్లానే తను కూడా గళ్ల లుంగీ, గళ్ల చొక్కా ధరించి, ఈ మాస్ పాటకు హుషారుగా డాన్స్ చేశారట హన్సిక. ఈ పాటలో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిందని దర్శకుడు అంటున్నారు. ఈ లుంగీ డాన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఊహించవచ్చు.