![Valentine's Day 2025: Sivakarthikeyan Opens Up About His First Love Story](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/siva-karthikeyan.jpg.webp?itok=vRLEMKIe)
ప్రతి వ్యక్తికి ఓ లవ్ స్టోరీ ఉంటుంది. కొంతమంది ప్రేమలో సక్సెస్ అయితే..మరికొంతమందికి విఫలం అవుతారు. అయితే సక్సెస్ అయినా కాకపోయినా సరే ఫస్ట్‌లవ్ అనేది ఓ మధుర జ్ఞాపకం. మొదటగా ప్రేమించిన అమ్మాయి/ అబ్బాయిని మర్చిపోలేం. అందరిలాగే తాను కూడా తన ఫస్ట్‌లవ్‌ని మర్చిపోలేనని అంటున్నాడు తమిళ హీరో శివకార్తీకేయన్(Sivakarthikeyan ). ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు శివకార్తికేయ. రీసెంట్‌గా ‘అమరన్’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీని చెప్పుకున్నాడు. తన ఫస్ట్‌లవ్ విఫలమైందని చెప్పారు. ‘కాలేజీ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. నాది వన్‌సైడ్ లవ్. ఆమెను కలిసి నా ప్రేమను వ్యక్తం చేయలేదు. కానీ దూరంగా చూస్తూనే ప్రేమించాడు. ఓ సారి ఆమె తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవడం చూశాను. అప్పటి నుంచి ఆమెను చూడలేదు. నా ప్రేమ విషయం చెప్పకుండానే విఫలం అయింది. చాలా రోజుల తర్వాత ఓ షాపింగ్ మాల్‌లో ఆమెను మళ్లీ చూశాను. అప్పటికే ఆమెకు పెళ్లి అయింది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నది ముందు ప్రేమించిన వ్యక్తి కాదు. వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది. అది చూసి ‘మనకు దొరకని అమ్మాయి అతనికి కూడా దొరకలేదు(నవ్వుతూ..)’ అని సంతోషించాను’ అని శివకార్తీకేయ తన ఫెల్యూర్ లవ్‌స్టోరీని చెప్పుకొచ్చాడు.
కాగా శివ కార్తికేయన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. 2010లో ఆర్తిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి 2013లో కూతురు ఆరాధన, 2021లో కుమారుడు గుగన్ దాస్ జన్మించారు.
సినిమాల విషయానికొస్తే.. శివ చేతిలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒక సినిమాకు ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా టైటిల్ ఫిబ్రవరి 17న నటుడు శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల కానుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన రుక్మిణి వసంత నటిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు సుధా కొంగర దర్శకత్వంలో ‘పరాశక్తి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శివకార్తీకేయన్ తో పాటు శ్రీలీల, అథర్వ, రవి మోహన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment