వాలెంటైన్స్ డే.. ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజిది. ఎప్పటినుంచో ప్రేమలో మునిగి తేలుతున్నా ఎందుకో ప్రేమికులకు ఈరోజు మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పొచ్చు. లవ్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాలెంటైన్స్ డేకి మించిన రోజు ఉండదని భావిస్తారు. అందుకే ప్రేమికుల రోజును మరింత స్పెషల్‌గా డిజైన్ చేసుకుంటారు. రెండు మనసుల్ని దగ్గర చేసే ప్రేమ మత్తు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి దేవదాసు దగ్గర్నుంచి లేటెస్ట్ సీతారామం వరకు ఎన్నో ప్రేమకథా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తనదైన మ్యాజిక్ చేశాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్‌గా నిలిచిన సినిమాలేంటో చూసేద్దాం.
ప్రేమికుల రోజు
సోనాలి బింద్రే, కునాల్ జంటగా నటించిన ప్రేమికుల రోజు సినిమా వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో ఉంటుందనడంలో సందేహం లేదు. కాథిర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫేస్‌బుక్ ద్వారా ప్రేమలో పడటం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోవడం, క్లైమాక్స్‌లో మళ్లీ కలవడం ఇలా ప్రతీ సీన్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. కథకు తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది.
జయం
దేశ డైరెక్షన్‌లో వచ్చిన జయం సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. నితిన్, సదా జంటగా నటించిన ఈ సినిమా హీరో,హీరోయిన్లకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగులో విజయం సాధించడంతో తమిళంలోనూ రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ సక్సెస్ అయ్యిందీ చిత్రం.
గీతాంజలి
నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఎవర్‌గ్రీన్ సినిమా గీతాంజలి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ సూపర్ హిట్టే. ఇళయరాజ సంగీతం సినిమాకు మరో ఆణిముత్యంలా నిలిచింది. ఇప్పటికీ ఇందులోని సాంగ్స్, సన్నివేశాలు ఎవర్‌గ్రీన్.
ఏ మాయ చేసావే
నాగార్జున, సమంత జంటగా నటించిన సినిమా ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ డైరక్షన్‌లో వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సమంతకు ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ మూవీ షూటింగ్ టైంలోనే సమంత, నాగ చైతన్య మధ్య స్నేహం కుదిరింది. పెళ్లికి దారితీసింది. కానీ ఏమైందో ఏమో మనస్పర్థల కారణంగా వాళ్లు విడాకులు తీసుకున్నారు.
ఆర్య
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ ఆర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బన్నీకి స్టార్‌డమ్‌కు తెచ్చిపెట్టింది. అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ‘ఫీల్ మై లవ్’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ఈ పాట ప్రపోజ్ డేకు బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. లవ్ ఎట్ సైట్, ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సూపర్ సక్సెస్ అయ్యారు.
లవ్‌స్టోరీ
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం లవ్ యాంగిల్‌లోనే కాకుండా కుల వివక్ష, చిన్నతనంలోనే లైంగిక వేధింపులు వంటి సెన్సిటివ్ అంశాలను టచ్ చేశారు. నిజానికి శేఖర్ కమ్ముల గత సినిమాల కంటే ఇది కాస్త భిన్నమైనదనే చెప్పాలి. కథలో ఇంటెన్స్ స్టోరీతో పాటు టైటిల్‌కు తగ్గట్లుగా మంచి ఫీల్‌గుడ్ పాటలతో సాగిన ఈ చిత్రం వాలైంటైన్స్ డే స్పెషల్ మూవీస్‌లో ఒకటి. వీటితో పాటు సఖి, దేవదాసు, ప్రేమనగర్, ప్రేమదేశం, వర్షం, సీతారామం సహా ఎన్నో ప్రేమకథలు వెండితెరపై మరుపురాని చిత్రాలుగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment