బైక్ రైడింగ్ బాగుంది | Hansika's five super bikes | Sakshi
Sakshi News home page

బైక్ రైడింగ్ బాగుంది

Published Wed, Dec 4 2013 1:18 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

బైక్ రైడింగ్ బాగుంది - Sakshi

బైక్ రైడింగ్ బాగుంది

 బైక్ రైడింగ్ చాలా బాగుందంటోంది నటి హన్సిక. ఈ సంచలన నటి ఐదు రకాల బైక్‌లపై రైడింగ్ చేస్తూ ఆడి పాడిందట. ఈ పాట చిత్రంలో హైలెట్ అయిందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు. ఇంతకీ హన్సిక అంతగా ఎంజాయ్ చేస్తూ నటించిన పాట ఏ చిత్రంలోనిదనగా మీ ప్రశ్న. యువ నటుడు శివకార్తికేయన్‌తో హన్సిక రొమాన్స్ చేస్తున్న చిత్రం మాన్ కరాటే. తిరుకుమరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ఒక పాటను ఇటీవల పొల్లాచ్చిలో హన్సికపై చిత్రీకరించారట.
 
  పూర్తి మద్రాసు కల్చర్‌తో కూడిన ఈ పాటలో హన్సిక బీచ్ రెస్క్యూ బైక్, అమెరికన్ చాపర్ బైక్, సైడ్‌కార్‌బైక్, ఎ లా షోలేలతో పాటు మరో 500 సిసి బుల్లెట్, బైక్‌లలో రైడింగ్ చేస్తూ నటించడం విశేషం అని దర్శకుడు తెలిపారు. ఆసక్తికరమైన నేపథ్యంలో సాగే ఈ పాట కుర్రకారును అమితంగా ఆకర్షిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హన్సిక మాట్లాడుతూ ఈ బైక్ రైడింగ్  సాంగ్‌లో నటించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఒక్కో బైక్‌పై రైడింగ్ చేయడానికి ముందుగా శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement