
Brad Hogg Favorites to win the T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి ఏ జట్టు గెలుస్తుందో అని క్రికెట్ నిపుణులు, మాజీలు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ తన ఫేవరేట్ జట్లును ప్రకటించాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ జట్లు.. టైటిల్ గెలుచుకునే రేసులో ఈ రెండు జట్లే ముందుంటాయని హాగ్ జోస్యం చెప్పాడు. అయితే, ఆ రెండు జట్లకు గట్టి సవాల్ విసరగలిగేది టీమిండియా అని పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లండ్ 2010 లో టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అదే విధంగా.. ఇటీవల శ్రీలంక ,పాకిస్తాన్‌లతో జరిగిన టీ20 సీరీస్‌లో విజయం సాధించి ఇంగ్గండ్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. మరో వైపు శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో ఇటీవల జరిగిన టీ 20 సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ ఓటమి చెందాయి. కానీ ఈ సిరీస్‌లో ఇరు జట్లు తమ సీనియర్ ఆటగాళ్లతో బరిలోకి దిగలేదు. టీ20 ప్రపంచకప్ గ్రూప్ 2 లో భారత్, న్యూజిలాండ్ ఉన్నాయి. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్‌గా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టాడ్ ఆస్లే, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మెన్, దేవాన్ కాన్వె, లూకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, కైల్ జెమీషన్, డార్లీ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సైపర్ట్ (వికెట్ కీపర్), ఇస్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే
ఇంగ్లండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోనాథన్ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, టైమల్ మిల్స్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
స్టాండ్ బై ప్లేయర్లు: టామ్ కరన్, లియామ్ డాసన్, జేమ్స్ విన్స్.
చదవండి: T20 World Cup 2021: ‘ఇండియా, పాకిస్తాన్.. ఇంకా సెమీస్ చేరే జట్లు ఇవే’
Comments
Please login to add a commentAdd a comment