
మెల్‌బోర్న్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ప్రస్తుతం కోహ్లి ఫిట్‌నెస్ లెవెల్స్ చూస్తుంటే సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డును ఈజీగా సాధిస్తాడని కొనియాడాడు. కోహ్లికి ఉన్న ఫిట్‌నెస్ లెవల్స్‌తో ఎన్నో రికార్డును బ్రేక్ చేయడం ఖాయమన్నాడు. ఈతరం క్రికెటర్లకు ఎక్కువ క్రికెట్ ఆడే అవకాశం ఉంటుందన్నాడు. అలానే కోహ్లి కూడా సాధ్యమైనంత ఎక్కువ క్రికెట్‌నే ఆడతాడన్నాడు. ఈ క్రమంలోనే సెంచరీల రికార్డు మార్కును సులభంగానే అధిగమిస్తాడని హాగ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం క్రికెటర్లకు చాలా మంది ఫిజియోలు, డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఒక ఆటగాడికి ఏమైనా సమస్య వచ్చినా అది ఏమిటి అనేది వెంటనే పరిష్కరిస్తున్నారు. ఒకవేళ గాయపడితే స్వల్ప మ్యాచ్‌లే మిస్సవుతున్నారు. అందుచేత వారికి ఎక్కువ క్రికెట్ ఆడే అవకాశం దొరుకుతుంది. అది ఇప్పటి క్రికెటర్లకు వరం. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’)
కోహ్లి ఫిట్‌నెస్ పరంగా బాగున్నాడు కాబట్టి అతని ముందు చాలా క్రికెట్ ఉంది. దాంతో సచిన్ రికార్డు ఏమీ కష్టం కాదు. సచిన్ రికార్డును కోహ్లి తిరగరాస్తాడు’ అని హాగ్ తన యూట్యూబ్ చానల్ ద్వారా తెలిపాడు. ఈ మేరకు ఒక వీడియోను హాగ్ పోస్ట్ చేశాడు. ఇప్పటివరకూ కోహ్లి 70 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 43 సెంచరీలు సాధించిన కోహ్లి.. టెస్టుల్లో 27 శతకాలు నమోదు చేశాడు. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కోహ్లి.. టెస్టుల్లో రెండో స్థానంలో ఉన్నాడు. 86 టెస్టుల్లో 7, 240 పరుగులు సాధించిన కోహ్లి.. 53.62 యావరేజ్‌ను కల్గి ఉన్నాడు. కోహ్లి టెస్టు అత్యధిక వ్యక్తిగత స్కోరు 254(నాటౌట్) కాగా వన్డేల్లో 248 మ్యాచ్‌లు ఆడి 11,867 పరుగులు నమోదు చేశాడు. వన్డేల్లో 59. 33 యావరేజ్ కల్గి ఉన్న కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరు 183. అంతర్జాతీయ టీ20ల్లో 82 మ్యాచ్‌లు ఆడి 2,794 పరుగులు చేశాడు. టీ20ల్లో 50కి పైగా యావరేజ్ కల్గిన కోహ్లి అత్యధిక స్కోరు 94(నాటౌట్).(నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?)
Comments
Please login to add a commentAdd a comment