పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన బాబర్.. ఇప్పుడు ఇంగ్లండ్‌పై అదే తీరును కనబరుస్తున్నాడు. ముల్తాన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో కేవలం 35 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
ఈ క్రమంలో పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీ బాబర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు జట్టు నుంచి ఆజంను సెలక్టర్లు తప్పించారు. దీంతో పీసీబీ తీరుపై పలువరు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తారని సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరికొంతమంది అయితే ఆజంను విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. కోహ్లి ఫామ్ కోల్పోయినప్పుడు బీసీసీఐ అండగా ఉందని, పీసీబీ మాత్రం అలా చేయలేదని పాక్ స్టార్ క్రికెటర్ ఫఖార్ జమాన్ సైతం విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజంను విరాట్ కోహ్లితో పోల్చవద్దని హాగ్ అన్నాడు.
"ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టెస్టులకు పాక్ జట్టులో స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం చోటు కోల్పోయాడు. గత కొన్ని రోజులగా అందరూ ఊహించిందే జరిగింది. అయితే చాలా మంది బాబర్ ఆజం ఫామ్‌ను విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. దయచేసి ఆజంను కోహ్లితో పోల్చవద్దు.
కోహ్లి ఫామ్ కోల్పోయినప్పుడు భారత్ ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ జట్టుగా ఉంది. మరి బాబర్ ఫామ్ కోల్పోయినప్పుడు పాకిస్తాన్ ప్రపంచంలోనే రెండువ అత్యంత చెత్త జట్టుగా ఉంది. కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు" అని హాగ్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా బాబర్ గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు.
చదవండి: ‘అతడినే తప్పిస్తారా?.. ఇంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదు’
Comments
Please login to add a commentAdd a comment