
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న పుజారా ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని వదల్లేదు. అంతేకాదు టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన పుజారా తన శైలికి భిన్నంగా ఆడుతూ ఫాస్టెస్ట్ సెంచరీ అందుకోవడం విశేషం. 130 బంతుల్లో వంద పరుగుల మార్క్‌ను అందుకున్న పుజారాకు ఇది టెస్టుల్లో 19వ సెంచరీ. పుజారా ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి.
ఇక పుజారా 52 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ మార్క్ అందుకొని సెంచరీల కరువును తీర్చుకున్నాడు. మధ్యలో చాలాసార్లు మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన పుజారా శతకం మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా డెబ్యూ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేసి ఔటైనప్పటికి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 152 బంతుల్లో 110 పరుగులు చేసి ఔటయ్యాడు. పుజారా శతకం బాదగానే టీమిండియా 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ముందు 512 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్‌గా ఉంచింది. ఆటకు రెండురోజుల సమయం ఉండడంతో టీమిండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
cheteshwar pujara Test fastest century#INDvBAN #pujara #TestCricket pic.twitter.com/U6PhVACKxO
— sportsliveresults (@Ashishs92230255) December 16, 2022