
టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన గిల్.. ఈ ఏడాది టీమిండియా తరపున సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా నిలిచాడు. ఈ ఏడాది టీమిండియా ఓపెనర్లలో ఎవరు శతకాలు చేయలేదు. రెండుసార్లు అర్థసెంచరీలు మాత్రమే చేయగలిగారు.
ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో పుజారా 66 పరుగులు చేయగా.. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో కేఎల్ రాహుల్ 50 పరుగులు చేశాడు. అయితే తాజాగా మాత్రం బంగ్లాతో టెస్టులో సెంచరీ చేసిన గిల్.. డెబ్యూ టెస్టు సెంచరీ సాధించడంతో పాటు ఈ ఏడాది సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
ఇక తొలి టెస్టులో టీమిండియా పట్టు భిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్లర్లు సత్తా చాటడంటో బంగ్లా ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. మూడోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. అంతకముందు శుబ్‌మన్ గిల్, పుజారాలు సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకు కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలిఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఫలితం వచ్చే అవకాశముంది.
చదవండి: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు
రోహిత్ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా?
Love you @ShubmanGill 😘 pic.twitter.com/XjfBSnmAEZ
— depressed gill fan (@ShubmanGillFan) December 16, 2022