India vs Bangladesh, 1st Test Chennai Day 3 Updates: వెలుతురులేమి కారణంగా శనివారం అరగంట ముందుగానే ఆటను ముగించారు. అప్పటికి 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. విజయానికి 357 పరుగుల దూరంలో ఉంది.
బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రాకు ఒకటి, రవిచంద్రన్ అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకు ముందు 287/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. బంగ్లాకు 515 పరుగుల టార్గెట్ విధించింది. శుబ్‌మన్ గిల్(119 నాటౌట్), రిషభ్ పంత్(109) శతకాలతో అదరగొట్టారు.
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149
టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులు
33.4:నాలుగో వికెట్ డౌన్
ముష్ఫికర్ రహీం రూపంలో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముష్ఫికర్ పెవిలియన్‌చేరాడు. బంగ్లా స్కోరు: 146/4 (33.4) . లక్ష్యానికి ఇంకా 369 పరుగుల దూరంలో ఉంది.
29.6: మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
అశ్విన్ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా మొమినుల్ హక్(13) వెనుదిరిగాడు. క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. ముష్ఫికర్ హీం క్రీజులోకి వచ్చాడు. షాంటో 36 పరుగులతో ఆడుతున్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
అశ్విన్ బౌలింగ్‌లో షాద్మన్ ఇస్లాం(35) గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొమినుల్ హక్ క్రీజులోకి వచ్చాడు. నజ్ముల్ షాంటో 14 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 86-2.
16.2: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
బుమ్రా బౌలింగ్‌లో జకీర్ హసన్ 33 పరుగుల వద్ద నిష్క్రమించాడు. షాద్మన్ ఇస్లాం 26 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ స్కోరు: 62/1 (16.2)
బంగ్లా స్కోరు @ టీ బ్రేక్ 56/0(13)
భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ టీ బ్రేక్ సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం 21, జకీర్ హసన్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.
బంగ్లాదేశ్ లక్ష్యం 515
భారీ ఆధిక్యంలో ఉన్న టీమిండియా 287/4 స్కోరు వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొత్తంగా 514 పరుగుల లీడ్‌లో ఉన్న భారత్.. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది.
భారత్‌కు 502 పరుగుల ఆధిక్యం
గిల్, పంత్ సెంచరీల కారణంగా 63 ఓవర్లు ముగిసే సరికి భారత్ 506 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
గిల్ శతకం
59.4: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న గిల్. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన గిల్.. ఇప్పుడిలా శతక్కొట్టడం విశేషం. రాహుల్ 10, గిల్ 100 పరుగులతో క్రీజులో ఉన్నారు.
సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. వికెట్ డౌన్
54.4: గిల్‌తో కలిసి బజ్‌బాల్ తరహాలో దూకుడు పెంచిన రిషభ్‌పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత.. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండు రన్స్ తీసి వంద పరుగుల మార్కు అందుకున్నాడు.
అయితే ఆమరుసటి ఓవర్ మూడో బంతికే మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో పంత్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 234-4(56). 461 పరుగుల ఆధిక్యం.
లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 205/3 (51)
శుబ్‌మన్ గిల్ 86, రిషభ్ పంత్ 82 పరుగులతో ఆడుతున్నారు. బంగ్లాదేశ్ కంటే టీమిండియా 432 పరుగుల ఆధిక్యం(తొలి ఇన్నింగ్స్ కలుపుకొని)లో ఉంది.
సెంచరీకి చేరువైన గిల్
శుబ్‌మన్ గిల్ శతకానికి చేరువయ్యాడు. 50 ఓవర్లు ముగిసే సరికి 136 బంతులు ఎదుర్కొన్న అతడు 85 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరోవైపు పంత్ 73 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా 422 పరుగుల ఆధిక్యంలో ఉంది.
దంచి కొడుతున్న గిల్, పంత్
గిల్ 75, పంత్ 72 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 48 ఓవర్లలో టీమిండియా స్కోరు: 184/3.
పంత్ హాఫ్ సెంచరీ
43.3: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి పంత్ యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. గిల్, పంత్ నిలకడగా ఆడుతుండటంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. 44 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 151-3. బంగ్లాదేశ్‌పై 378 పరుగుల ఆధిక్యం.
గిల్ హాఫ్ సెంచరీ
29.5వ ఓవర్: మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది శుబ్‌మన్ గిల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్‌లో రెండో బంతికి సైతం గిల్ సిక్స్ కొట్టడం విశేషం. టీమిండియా స్కోరు: 114-3(30).
సెంచరీ పూర్తి చేసుకున్న టీమిండియా
28.5వ ఓవర్: బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లో పంత్ ఫోర్ బాదడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వంద పరుగుల మార్కు అందుకుంది. 29 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 100-3. పంత్ 25, గిల్ 39 పరుగులతో ఆడుతున్నారు.
టీమిండియా రెండో ఇన్నింగ్స్- ఓవర్ నైట్ స్కోరు
శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు 23.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. 308 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కాగా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 10, రోహిత్ శర్మ 5 పరుగులతో నిరాశపరచగా.. విరాట్ కోహ్లి సైతం 17 పరుగులకే నిష్క్రమించాడు. శుబ్‌మన్ గిల్ 34, రిషభ్ పంత్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు సెప్టెంబరు 19- 23
వేదిక: చెపాక్ స్టేడియం, చెన్నై
టాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149
తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్
షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.
Comments
Please login to add a commentAdd a comment