సిరాజ్- పంత్(PC: Jio Cinema)
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు వికెట్ దక్కకపోవడానికి పరోక్ష కారణమైనందుకు ఫైర్ అయ్యాడు. అయితే, పొరపాటును తెలుసుకున్న పంత్ తనకు సారీ చెప్పడంతో సిరాజ్ శాంతించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
టీమిండియా 376 ఆలౌట్
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో చెన్నైలో ఇరు జట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 376 పరుగుల వద్ద ఆలౌట్ అయిన భారత్... తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 149 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ రెండేసి వికెట్లు కూల్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
పాపం సిరాజ్
నిజానికి ఈ మ్యాచ్‌లో సిరాజ్‌కు మూడో వికెట్ కూడా దక్కేది. కానీ పంత్ కారణంగా మిస్ అయ్యింది. అసలేం జరిగిందంటే.. బంగ్లా ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ను సిరాజ్ వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న జకీర్ హసన్.. ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ అయినట్లు సిరాజ్ భావించాడు. దీంతో వికెట్ కోసం బిగ్గరగా అప్పీలు చేశాడు.
రివ్యూ వద్దని చెప్పాడు
ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ .. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను సంప్రదించగా... ‘‘బాల్ మరీ అంత హైట్‌కి రాలేదు. కానీ లెగ్ స్టంప్ మాత్రం మిస్సవుతోంది’’ అని బదులిచ్చాడు. దీంతో రివ్యూ తీసుకోవాలన్న సిరాజ్ అభ్యర్థనను రోహిత్ తిరస్కరించాడు. కానీ.. రీప్లేలో జకీర్ అవుటైనట్లు స్పష్టంగా కనిపించింది.
దీంతో సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. పంత్ చేయి పైకెత్తుతూ సారీ అన్నట్లుగా సైగ చేశాడు. అలా పంత్ చెప్పింది రోహిత్ విన్న కారణంగా సిరాజ్ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
చదవండి: హెడ్ ఊచకోత.. పరుగుల విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు
— Nihari Korma (@NihariVsKorma) September 20, 2024
Comments
Please login to add a commentAdd a comment