Ind vs Ban: ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌ | Ind vs Ban 1st Test Chennai: Toss Playing XI Updates And Highlights | Sakshi
Sakshi News home page

Ind vs Ban: ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌

Published Thu, Sep 19 2024 9:08 AM | Last Updated on Thu, Sep 19 2024 5:29 PM

Ind vs Ban 1st Test Chennai: Toss Playing XI Updates And Highlights

India vs Bangladesh, 1st Test Chennai Day 1 Updates: టీమిండియాతో తొలి టెస్టులో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. రోహిత్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ముగిసిన తొలి రోజు ఆట..
చెపాక్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.

క్రీజులో అశ్విన్‌(102), జడేజా(86) ఆజేయంగా ఉన్నారు. తొలి రోజు ఆటలో భారత టాపార్డర్‌ ప్లేయర్‌లు విఫలమైనప్పటకి వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్బుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. బంగ్లా బౌలర్లలో హసన్‌ మహమూద్‌ 4 వికెట్లు పడగొట్టగా.. నహిద్‌ రానా, మెహదీ హసన్‌ మీరజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

సెంచరీతో చెలరేగిన అశ్విన్‌.. 
చెపాక్‌ టెస్టులో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో అశ్విన్‌ 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అశ్విన్‌కు ఇది ఆరో టెస్టు సెంచరీ. 80 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్‌తో పాటు జడేజా 86 పరుగులతో ఉన్నాడు.

రవీంద్ర జడేజా హాఫ్‌ సెంచరీ.. 
టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆర్ధశతకం సాధించాడు. జట్టు కష్టా‍ల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజా.. అశ్విన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

 అశ్విన్‌ దూకుడుగా ఆడితే, జడేజా కాస్త ఆచిచూచి తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 69 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. క్రీజులో జడేజాతో పాటు(51), అశ్విన్‌(78) పరుగులతో ఉన్నాడు.

అశ్విన్‌ హాఫ్‌ సెంచరీ..
సొంత‌మైదానంలో టీమిండియా వెట‌రన్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ హాఫ్‌ సెంచ‌రీతో మెరిశాడు. జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన అశ్విన్ త‌న అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 

54 పరుగులతో అశ్విన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా(35) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

52 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 197/6
52 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ దూకుడుగా ఆడుతున్నాడు. 34 బంతుల్లో సరిగ్గా 34 పరుగులతో అశ్విన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా(15) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

టీ బ్రేక్‌కు భారత్‌ స్కోర్‌: 176/6
టీ విరామానికి భారత్‌ 6 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. క్రీజులో రవిచంద్రన్‌ అశ్విన్‌(21), రవీంద్ర జడేజా(7) పరుగులతో ఉన్నారు.

కేఎల్‌ రాహుల్‌ అవుట్‌
42.2:  మెహదీ హసన్‌ మిరాజ్‌బౌలింగ్‌లో జకీర్‌కు క్యాచ్‌ ఇచ్చి కేఎల్‌ రాహుల్‌(16) అవుటయ్యాడు. దీంతో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 145/6 (42.4) 

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
41.4: హాఫ్‌ సెంచరీ వీరుడు జైస్వాల్‌ రూపంలో టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. నహీద్‌ రాణా బౌలింగ్‌లో షాద్మాన్‌ ఇస్లాంనకు క్యాచ్‌ ఇచ్చి జైస్వాల్‌ 56 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 144/5 (42). రాహుల్‌ 16 పరుగులతో ఆడుతున్నాడు.

యశస్వి జైస్వాల్‌ హాఫ్‌ సెంచరీ
34.2: మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి జైస్వాల్‌ 50 పరుగుల మార్కు అందుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ విలువైన అర్ధ శతకం బాది సత్తా చాటాడు. టీమిండియా స్కోరు: 132-4(35). రాహుల్‌ 10, జైస్వాల్‌ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.

28వ ఓవర్‌: సెంచరీ కొట్టిన టీమిండియా.. స్కోరు 103-4.
జైస్వాల్‌ 43, రాహుల్‌ ఒక పరుగుతో ఆడుతున్నారు.

96 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
25.3: రిషభ్‌పంత్‌ (39) రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. బంగ్లా పేసర్‌ హసన్‌ మహమూద్‌ ఖాతాలో నాలుగో వికెట్‌ జమైంది. కేఎల్‌ రాహుల్‌ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్‌ 37 పరుగులతో ఆడుతున్నాడు. 

భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు:  88/3 (23)
34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను జైస్వాల్‌, పంత్‌ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి యశస్వి జైస్వాల్‌ 37, రిషభ్‌ పంత్‌ 33 పరుగులతో ఆడుతున్నారు. 

15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 57-3
జైస్వాల్‌ 26, పంత్‌ 13 పరుగులతో ఆడుతున్నారు.

హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్న టీమిండియా
ఓపెనర్‌ జైస్వాల్‌ నిలకడగా ఆడుతూ.. రిషభ్‌ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. 14వ ఓవర్‌ ముగిసే సరికి జైస్వాల్‌ 41 బంతుల్లో 24, పంత్‌ 11 బంతుల్లో 8 పరుగులు చేశారు. టీమిండియా స్కోరు: 50-3.

9.2: కోహ్లి అవుట్‌
బంగ్లా పేసర్‌ హసన్‌ మహ్మూద్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే రోహిత్‌, గిల్‌ వికెట్లు పడగొట్టిన అతడు.. కోహ్లి రూపంలో మరో కీలక బ్యాటర్‌ను అవుట్‌ చేశాడు.

కాగా మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా స్కోరు: 34/3 (9.3). రిషభ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. జైస్వాల్‌ 17 పరుగులతో ఆడుతున్నాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
7.3: హసన్‌ మహ్మూద్‌ మరోసారి టీమిండియాను దెబ్బకొట్టాడు. తొలుత రోహిత్‌ శర్మ రూపంలో కీలక వికెట్‌ దక్కించుకున్న అతడు.. గిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా ఎనిమిది బంతులు ఎదుర్కొన్న ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ డకౌట్‌గా వెనుదిరగగా.. భారత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. విరాట్‌ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. టీమిండియా స్కోరు: 29/2 (8). జైస్వాల్‌ 17 పరుగులతో ఆడుతున్నాడు.
 

ఆరంభంలోనే బిగ్‌ వికెట్‌ డౌన్‌
5.1: తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(6) రూపంలో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. బంగ్లా యువ పేసర్‌ హసన్‌ మహ్మూద్‌ బౌలింగ్‌లో షాంటోకు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ వెనుదిరిగాడు. 

శుబ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 14/1. యశస్వి జైస్వాల్‌ 7, గిల్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత స్టార్‌ స్పిన్నర్‌కు నో చాన్స్‌
 కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్‌లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగనుంది. భారత్‌ వేదికగా జరుగనున్న ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

టాస్‌ సందర్భంగా భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. తాము టాస్‌ గెలిస్తే కూడా మొదట బౌలింగ్‌ చేసే వాళ్లమని పేర్కొన్నాడు. ప్రతి టెస్టు మ్యాచ్‌ కీలకమేనని.. సవాళ్లను అధిగమించి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపాడు. ఇక తాము ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు.

బంగ్లాదేశ్‌ సైతం
కాగా స్పిన్‌ విభాగంలో సీనియర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాకు చోటు దక్కగా.. చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు మొండిచేయి ఎదురైంది. ఇక సీమర్లలో పేస్‌ దళ నాయకుడు జస్ప్రీత్‌ బుమ్రాతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ స్థానం సంపాదించారు. మరోవైపు.. బంగ్లాదేశ్‌ సైతం ముగ్గురు సీమర్లు.. ఇద్దరు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లకు తుదిజట్టులో చోటిచ్చింది. చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై ఈ మ్యాచ్‌ జరుగనుండటంతో ఇరుజట్లు ఇలా ఫాస్ట్‌బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.

తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్‌
షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీం, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహీద్ రాణా.

చదవండి: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement