
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ శతక్కొట్టాడు. 631 రోజుల తర్వాత టెస్టు బరిలో దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 109 పరుగులు సాధించాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం విధించడంలో సహాయపడ్డాడు.
88 బంతుల్లోనే
కాగా తొలి ఇన్నింగ్స్‌లో పంత్ 39 పరుగులకే పరిమితమయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 88 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్‌తో కలిసి స్కోరు బోర్డు పరిగెత్తించడమే పనిగా పెట్టుకున్నాడు.
13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో
మొత్తంగా 128 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. ఈ లెఫ్టాండర్ 13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో ఈ మేర స్కోరు సాధించాడు. అయితే, సెంచరీ కొట్టిన కాసేపటికే పంత్ బౌల్డ్ కావడం గమనార్హం. మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో పంత్ వెనుదిరిగాడు.
బంగ్లాదేశ్ ముందు కొండంత లక్ష్యం
మరోవైపు శుబ్‌మన్ గిల్ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, అతడు 119 పరుగుల వద్ద ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. పంత్, గిల్ సెంచరీల కారణంగా టీమిండియాకు 514 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌కు 515 పరుగుల రూపంలో కొండంత లక్ష్యం ముందుంది.
చదవండి: DT 2024: ఆవేశ్‌ఖాన్ టీ20 తరహా బ్యాటింగ్.. రుతు, ఇషాన్ విఫలం
WELCOME BACK TO TEST CRICKET, RISHABH PANT! 🙌🏻💯#RishabhPant #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/C4gJuv29Y1
— JioCinema (@JioCinema) September 21, 2024
Comments
Please login to add a commentAdd a comment