ప్రస్తుతం ఒక ఆటగాడు సంప్రదాయ క్రికెట్(టెస్టు)లో వంద టెస్టుల మైలురాయిని అందుకున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. టి20 క్రికెట్ లాంటి వేగవంతమైన ఆట వచ్చాకా ఎన్నో మార్పులు వచ్చాయి. ఫాస్ట్ క్రికెట్ ఆడేందుకు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు కొందరు క్రికెటర్లు.
ఇలాంటి టైంలో కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమై స్పెషలిస్ట్‌గా ముద్రించుకున్న చతేశ్వర్ పుజారా టీమిండియా తరపున ఇవాళ వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. భారత్ క్రికెట్‌లో టెస్టుల్లో వంద మ్యాచ్‌ల రికార్డును ఇంతకముందు 12 మంది మాత్రమే అందుకున్నాడు. తాజాగా పుజారా వంద టెస్టులాడిన 13వ క్రికెటర్‌గా అరుదైన జాబితాలో నిలిచాడు. బీసీసీఐతో పాటు టీమిండియా కూడా అతనికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించుకుంది.
ఇక పుజారా వందో టెస్టు నేపథ్యంలో అతని ఆటను చూసేందుకు ఫ్యామిలీ మొత్తం ఢిల్లీలో వాలిపోయింది. దాదాపు 30 మంది కుటుంబసభ్యులు పుజారా వందో టెస్టు చూడడానికి వచ్చారు. కుటుంబం అంతా సౌత్ ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా హోటల్ రిసెప్షన్‌లో పుజారా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక పుజారా వందో టెస్టు చూడడానికి 30 స్పెషల్ టీ-షర్ట్ తయారు చేసుకున్న ఫ్యామిలీ.. షర్ట్ వెనకాల చతేశ్వర్ పుజారా షార్ట్‌ఫామ్ (C, T) అక్షరాలు వచ్చేలా ప్రింట్ వేసుకున్నారు.
మ్యాచ్ జరుగుతున్న ఫిరోజ్ షా కోట్లా మైదానానికి కుటుంబం మొత్తం టీ-షర్ట్స్ వేసుకొని సందడి చేశారు. మా చింటు(పుజారా) వందో టెస్టు ఆడడం కళ్లారా చూడడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వందో టెస్టులో పుజారా కచ్చితంగా సెంచరీ చేస్తాడని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
'A journey full of hard-work, persistence & grit' 🙌 🙌
— BCCI (@BCCI) February 16, 2023
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦: Wishes & tributes pour in as #TeamIndia congratulate the ever-so-gutsy @cheteshwar1 ahead of his 💯th Test 👏 👏
Watch the SPECIAL FEATURE 🎥 🔽 #INDvAUS https://t.co/d0a2LjFyGh pic.twitter.com/lAFpNcI7SF
Comments
Please login to add a commentAdd a comment