Hundred Test
-
వందో టెస్ట్.. చెత్త రికార్డు మూటగట్టుకున్న అశ్విన్
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు వందో టెస్ట్ అన్న విషయం తెలిసిందే. ఈ చిరస్మరణీయ మ్యాచ్‌లో అశ్విన్ ఓ అనవసరపు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి బంతితో రాణించిన యాష్.. బ్యాటింగ్‌లో నిరాశపరిచి డకౌటయ్యాడు. తద్వారా వందో టెస్ట్‌లో డకౌటైన మూడో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో ఆటగాడిగా ఘోర అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. వందో టెస్ట్‌లో డకౌటైన తొలి ఆటగాడిగా భారత క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ (1988) రికార్డుల్లోకెక్కాడు. ఆతర్వాత అలెన్ బోర్డర్ (1991), కోట్నీ వాల్ష్, మార్క్ టేలర్ (1998), స్టీఫెన్ ఫ్లెమింగ్ (2006), బ్రెండన్ మెక్కల్లమ్ (2016), అలిస్టర్ కుక్ (2019), చతేశ్వర్ పుజారా (2023) తమతమ వందో టెస్ట్‌లో ఖాతా తెరవకుండా ఔటయ్యారు. ఇదిలా ఉంటే, ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసి, 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) క్రీజ్‌లో ఉన్నారు. 135/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) శతకాలతో రెచ్చిపోవడంతో భారీ స్కోర్ చేసింది. వీరిద్దరికి యువ మిడిలార్డర్ బ్యాటర్లు దేవ్‌దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) తోడవ్వడంతో పరుగుల వరద పారింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (57) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి రోజు ఆటలో కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
పుజారా వందో టెస్టు.. కుటుంబం మొత్తం స్టేడియంలో
ప్రస్తుతం ఒక ఆటగాడు సంప్రదాయ క్రికెట్(టెస్టు)లో వంద టెస్టుల మైలురాయిని అందుకున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. టి20 క్రికెట్ లాంటి వేగవంతమైన ఆట వచ్చాకా ఎన్నో మార్పులు వచ్చాయి. ఫాస్ట్ క్రికెట్ ఆడేందుకు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటూ పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నారు కొందరు క్రికెటర్లు. ఇలాంటి టైంలో కేవలం టెస్టులకు మాత్రమే పరిమితమై స్పెషలిస్ట్‌గా ముద్రించుకున్న చతేశ్వర్ పుజారా టీమిండియా తరపున ఇవాళ వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. భారత్ క్రికెట్లో టెస్టుల్లో వంద మ్యాచ్‌ల రికార్డును ఇంతకముందు 12 మంది మాత్రమే అందుకున్నాడు. తాజాగా పుజారా వంద టెస్టులాడిన 13వ క్రికెటర్‌గా అరుదైన జాబితాలో నిలిచాడు. బీసీసీఐతో పాటు టీమిండియా కూడా అతనికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గౌరవించుకుంది. ఇక పుజారా వందో టెస్టు నేపథ్యంలో అతని ఆటను చూసేందుకు ఫ్యామిలీ మొత్తం ఢిల్లీలో వాలిపోయింది. దాదాపు 30 మంది కుటుంబసభ్యులు పుజారా వందో టెస్టు చూడడానికి వచ్చారు. కుటుంబం అంతా సౌత్ ఢిల్లీలోని ఒక హోటల్లో బస చేశారు. ఈ సందర్భంగా హోటల్ రిసెప్షన్లో పుజారా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక పుజారా వందో టెస్టు చూడడానికి 30 స్పెషల్ టీ-షర్ట్ తయారు చేసుకున్న ఫ్యామిలీ.. షర్ట్ వెనకాల చతేశ్వర్ పుజారా షార్ట్‌ఫామ్ (C, T) అక్షరాలు వచ్చేలా ప్రింట్ వేసుకున్నారు. మ్యాచ్ జరుగుతున్న ఫిరోజ్ షా కోట్లా మైదానానికి కుటుంబం మొత్తం టీ-షర్ట్స్ వేసుకొని సందడి చేశారు. మా చింటు(పుజారా) వందో టెస్టు ఆడడం కళ్లారా చూడడం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వందో టెస్టులో పుజారా కచ్చితంగా సెంచరీ చేస్తాడని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 'A journey full of hard-work, persistence & grit' 🙌 🙌 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦: Wishes & tributes pour in as #TeamIndia congratulate the ever-so-gutsy @cheteshwar1 ahead of his 💯th Test 👏 👏 Watch the SPECIAL FEATURE 🎥 🔽 #INDvAUS https://t.co/d0a2LjFyGh pic.twitter.com/lAFpNcI7SF — BCCI (@BCCI) February 16, 2023 -
'వాడి తల్లిని క్యాన్సర్ బలి తీసుకుంది'
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయిని అందుకోనున్నాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు పుజారాకు వందోది కానుంది. భారత టెస్టు క్రికెట్లో అప్పటికే రెండు దశాబ్దాల పాటు ఎన్నో మ్యాచ్‌ల్లో అడ్డుగోడలా నిలబడి 'ది వాల్(The Wall)' అన్న పేరు లిఖించుకున్న రాహుల్ ద్రవిడ్ కెరీర్ చరమాంకంలో ఉంది. అతను రిటైరైతే టీమిండియాకు మరో వాల్ ఎవరవుతారనేది ఆసక్తికరంగా మారింది. అప్పుడు వచ్చాడు చతేశ్వర్ పుజారా. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడి ద్రవిడ్ తర్వాత 'ది వాల్' అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. అయితే 13 ఏళ్ల కెరీర్లో పుజారా చాలా ఎత్తుపల్లాలు చూసినప్పటికి వంద టెస్టుల ఆడిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో చేరడం అభినందించాల్సిన విషయం. టెస్టుల్లో టీమిండియా తరపున వంద టెస్టులు పూర్తి చేసుకున్న 13వ ఆటగాడిగా పుజారా నిలవనున్నాడు. పుజారా వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో అతని తండ్రి అర్వింద్ పుజారా సంతోషం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేసిన పుజారా ఇవాళ వందో టెస్టు ఆడనుండడం తనకెంతో గర్వంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అర్వింద్ పుజారా మాట్లాడాడు. ''పుజారా వందో టెస్టు ఆడుతుండడం నా భార్య రీనా(పుజారా తల్లి) చూడలేకపోతుంది. ఎందుకంటే పుజారా 17 ఏళ్ల వయసులోనే రీనా క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసింది. ఒకవేళ తను బతికిఉంటే మాత్రం కొడుకు ఘనతను చూసి కచ్చితంగా గర్వపడేది. చిన్నప్పటి నుంచి పుజారాకు కష్టపడే తత్వం అలవాటైంది. స్కూల్ ముగిశాక తన సోదరులతో కలిసి పొలానికి వచ్చి నాకు సాయపడేవాడు. పుజారా ఎప్పుడు కష్టమైన మార్గాన్ని ఏంచుకున్నప్పటికి చివరకు తాను వెళ్లేది రైట్ చాయిస్లోనేనని చాలాసార్లు నిరూపించాడు. పార్టీలకు దూరంగా ఉంటూ ఇప్పటికి మద్యం ముట్టని పుజారా ఈ స్థాయికి రావడానికి ముగ్గురు ముఖ్య కారణమయ్యారు. మొదటి వ్యక్తి నా భార్య రీనా అయితే.. రెండో వ్యక్తి పుజారా మేనత్త(నా చెల్లెలు) పుజా.. ఇక మూడో వ్యక్తి పుజారా గురువు. మంచి క్రికెటర్‌గా పుజారా ఎదగడానికి ఈ ముగ్గురు చాలా కష్టపడ్డారు. ఇక వాడి(పుజారా) చిన్ననాటి కోచ్‌గా, తండ్రిగా నా పాత్ర కూడా ఉంది. చింటూ(పుజారా ముద్దుపేరు)తో ఎన్ని గంటలు గడిపానో లెక్కలేదు. ప్రైమరీ స్కూల్ సమయంలో రాత్రి డిన్నర్ అయిన తర్వాత నేను, భార్య రీనా, పుజారా కలిసి వాకింగ్‌కు వెళ్లేవాళ్లం. మేం ముందు నడుస్తుంటే వాడు సైకిల్‌పై మా వెనుక ఫాలో అయ్యేవాడు. అక్కడికి దగ్గర్లో ఒక పార్క్ ఉండేది. పార్క్‌లో ఉన్న ఊయలను చూడగానే పుజారా మొహం సంతోషంతో వెలిగిపోవడం నాకు ఇంకా గుర్తుంది. చిన్నప్పటి నుంచే టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడడం నేర్చుకున్న పుజారా బ్యాటింగ్‌తో ఆకట్టుకునేవాడు. వాడిలో మంచి టెక్నిక్ ఉందని గ్రహించిన నేను క్రికెట్ ఫౌండేషన్‌లో చేర్చాను. అలా అండర్-13లో సౌరాష్ట్ర తరపున ఒక మ్యాచ్‌లో 300 పరుగులు కొట్టి తొలిసారి టీమిండియా అండర్-15 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్సీఏ క్యాంప్‌కు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పుజారా పరుగుల ప్రవాహం ఎక్కడా ఆగలేదు. అలా అండర్-15, అండర్-19 క్రికెట్లో తనదైన ముద్ర చూపించి ఇవాళ టీమిండియా సీనియర్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకున్నాడు. పుజారా నా కొడుకుగా పుట్టడం అదృష్టం'' అంటూ అర్వింద్ ఎమోషనల్ అయ్యాడు. ఇక పుజారా 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కెరీర్ ఆరంభంలో టెస్టులతో పాటు వన్డేలకు ఎంపికైనప్పటికి.. తర్వాత పూర్తిగా టెస్టులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్ర వేయించుకున్న పుజారాతన విలువైన ఇన్నింగ్స్‌లతో టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు.. మరెన్నోసార్లు ఓటముల బారి నుంచి రక్షించాడు. మొత్తంగా 99 టెస్టులాడిన పుజారా 7021 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 34 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక ఐదు వన్డేలు మాత్రమే ఆడిన పుజారా 51 పరుగులు చేశాడు. మరి ఫిబ్రవరి 17 నుంచి ఆసీస్‌తో ప్రారంభం కానున్న తన వందో టెస్టులో పుజారా శతకంతో రాణిస్తాడా లేదా అనేది చూడాలి. చదవండి: 'నా కూతురికి డబ్బు విలువ తెలియదు' -
వారిద్దరి రాకతో సంతోషం: డివిలియర్స్
కెరీర్లో వంద టెస్టులు ఆడగలనని కలలో కూడా ఊహించలేదని, ఇలాంటి వ్యక్తిగత మైలురాళ్లను తాను ఏనాడూ పట్టించుకోనని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. అన్ని రకాల క్రీడల్లో ప్రావీణ్యం ఉండటం వల్లే క్రికెట్లో రాణిస్తున్నానని అన్నాడు. తనకు నచ్చిన విధంగా కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులు వందో టెస్టు మ్యాచ్‌ను చూడటానికి రావడంతో సంతోషం రెట్టింపయిందని చెప్పాడు.