లండన్: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో పుజారా, ఓవర్టన్ మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఓవర్టన్ 48వ ఓవర్ వేశాడు. కాగా ఆ ఓవర్ రెండో బంతిని ఓవర్టన్ షార్ట్ బాల్ వేయగా.. పుజారా దానిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓవర్టన్ బంతిని అందుకొని కోపంతో పుజారావైపు విసిరినంత పని చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇక భారత అభిమానులు వీరిద్దరి మధ్య జరిగిన అంశంపై ఓవర్టన్ చర్యను తప్పుబడుతూ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు.'' మా పుజారాతో పెట్టుకోకు.. నీచేత రెండు రోజులు బౌలింగ్ చేయిస్తాడు.. పుజారాతో అనవసరంగా గెలుక్కున్నావు.. ఇక నీకు చుక్కలే'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: Pujara Vs Rohit: 'సింగిల్ చాలు అన్నానుగా'.. పుజారాపై రోహిత్ అసహనం
ఇక టీమిండియా నాలుగో టెస్టులో ప్రస్తుతం టీమిండియా 65 ఓవర్లలో వికెట్ నష్టానికి 195 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 100, పుజారా 47 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత శతకంతో మెరిశాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన రోహిత్ టెస్టు కెరీర్‌లో 8వ సెంచరీని అందుకున్నాడు. 205 బంతులాడిన రోహిత్ 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. కాగా రోహిత్‌కు విదేశంలో ఇదే తొలి టెస్టు సెంచరీ. ఇంతకముందు వచ్చిన ఏడు సెంచరీలు స్వదేశంలో వచ్చినవే.
చదవండి: Rohit Sharma: ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డు..
#IndvsEng Overton do not mess with him.. he will make you to ball for 2 days !! 🤤 Agressive pujara pic.twitter.com/GcY07rxT0o
— shivam shrivastav (@shivams70901101) September 4, 2021
Comments
Please login to add a commentAdd a comment