ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత సెలక్టర్లకు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా తన బ్యాట్‌తోనే స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు. రంజీట్రోఫీ-2024 సీజన్‌లో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 302 బంతుల్లో పుజారా తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
అతడికి ఇది 17వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ కావడం విశేషం. పుజారా ప్రస్తుతం 236 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టాడు. అతడి వికెట్ పడగొట్టడానికి బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 37 డబుల్ సెంచరీలతో అగ్రస్దానంలో ఉన్నాడు. అదే విధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా (19730) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్(19729)ను పుజారా అధిగమించాడు. ఇక మూడో రోజు లంచ్ విరమానికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 566 పరుగుల భారీ స్కోరు సాధించింది.
టీమిండియాలోకి రీఎంట్రీ..
కాగా పుజారా చివరగా గతేడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (2021-23) ఫైనల్లో భారత జట్టు తరపున ఆడాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. వెస్టిండీస్‌తో టెస్టులకు, ఇటీవల సౌతాఫ్రికాతో ముగిసిన టెస్టులకూ ఎంపిక చేయలేదు.
అయితే జనవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలడనుంది. ఈ సిరీస్‌కు ముందు పుజారా అద్భుత ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడి రీ ఎంట్రీ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment