టెస్టు క్రికెట్‌లో వందో మ్యాచ్ అనేది ఏ ఆటగాడికైనా చాలా ప్రత్యేకం. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కూడా తాజాగా టెస్టుల్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. అయితే వందో టెస్టులో సెంచరీ చేస్తాడని భావించినప్పటికి పుజారా దానిని అందుకోలేకపోయాడు. తన వందో టెస్టులో టీమిండియా విజయం సాధించడం మాత్రం పుజారాకు ఆనందాన్ని కలిగించే విషయం. 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను పుజారా గెలిపించాడు. విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో బౌండరీ కొట్టి టీమిండియాకు విక్టరీ అందించాడు.
ఈ సంగతి పక్కనబెడితే.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నుంచి పుజారా ఎప్పటికి గుర్తుండిపోయే గిఫ్ట్‌ను అందుకున్నాడు.ఢిల్లీ టెస్టులో ఓటమి అనంతరం కమిన్స్ ఆసీస్ ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీని పూజారాకు బహూకరించాడు. కమిన్స్, పూజారాకు జెర్సీ అందజేస్తున్న ఫొటోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోకు 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్' అని క్యాప్షన్ రాసింది.
అయితే వందో టెస్టు ఆడుతున్న ప్లేయర్‌కు జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చే ఆనవాయితీ ఎప్పటినుంచో ఉంది. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే కూడా ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్‌కు జెర్సీని కానుకగా అందించాడు. గబ్బాలో వందో టెస్టు ఆడుతున్న లియోన్‌కు భారత ఆటగాళ్ల బృందం సంతకం చేసిన జెర్సీని కానుకగా ఇచ్చాడు.
Spirit of Cricket 👏🏻👏🏻
— BCCI (@BCCI) February 19, 2023
Pat Cummins 🤝 Cheteshwar Pujara
What a special gesture that was! 🇮🇳🇦🇺#TeamIndia | #INDvAUS pic.twitter.com/3MNcxfhoIQ
Comments
Please login to add a commentAdd a comment