Test Career
-
కెరీర్ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం
టెస్టుల్లో టీమిండియాకు మూడోస్థానం చాలా కీలకం. 1990ల చివరి నుంచి రిటైర్ అయ్యేవరకు ద్రవిడ్ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎన్నోసార్లు టీమిండియా పాలిట ఆపద్భాందవుడయ్యాడు.చాలా మ్యాచ్‌ల్లో తన ఇన్నింగ్స్‌లతో ఓటమి కోరల్లో నుంచి భారత్‌ను కాపాడి ది వాల్ అనే పేరును సుస్థిరం చేసుకున్నాడు. ఇక ద్రవిడ్ రిటైర్ అయిన తర్వాత మూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ దశలో వచ్చాడు చతేశ్వర్ పుజారా. 2010లో టెస్టు మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పుజారా అతతి కాలంలోనే మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. 2012లో తొలిసారి తన మార్క్ ఆటతీరును ప్రదర్శించిన పుజరా ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసేలా కెరీర్ ఆరంభంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలా టీమిండియా నయావాల్‌గా పుజారా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు ప్రత్యర్థుల పాలిట అడ్డుగోడలా నిలిచిన పుజారా ఇప్పుడు మాత్రం జట్టుకు గుదిబండలా తయారయ్యాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నా పుజారా కెరీర్ దాదాపు ముగిసినట్లే. ఇక మరో కొత్త గోడ(The Wall) కోసం వెతకాడాకి సమయం ఆసన్నమైంది. -సాక్షి, వెబ్‌డెస్క్ పుజారాను భారత జట్టు నుంచి తప్పించడం కొత్త కాదు. కొన్నాళ్ల క్రితమే స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. అయితే కౌంటీల్లో భారీ స్కోర్లు సాధించి మళ్లీ జట్టులోకి వచ్చిన అతను ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడటంతో పాటు కెరీర్లో 100 టెస్టుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇటీవల ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై విఫలమైనా, అతని అనుభవాన్ని నమ్మి డబ్ల్యూటీసీ ఫైనల్లో మరో అవకాశం ఇచ్చారు. రెండు ఇన్నింగ్స్‌లలో అతను 14, 27 పరుగులే చేశాడు. గత మూడేళ్లుగా అతను పేలవ ఫామ్‌లో ఉన్నా సీనియర్‌గా, ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన గౌరవంతో పుజారాను కొనసాగించారు. బంగ్లాదేశ్‌పై ఆడిన రెండు కీలక ఇన్నింగ్స్ (90, 102)లను పక్కన పెడితే మూడేళ్లలో అతని సగటు 26 మాత్రమే. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న సెలక్టర్లు మళ్లీ వెనక్కి వెళ్లి పుజారాను ఎంపిక చేసే అవకాశాలు కనిపించడం లేదు. 103 టెస్టుల్లో 43.60 సగటు, 19 సెంచరీలతో పుజారా 7195 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతని కెరీర్లో అత్యుత్తమ క్షణాలు. Thankyou for the memories @cheteshwar1 🫶,Being a part of two series Wins in Australia is always special,You gave your best in those two series and many more..Still not writing you off🙅♂️.#cheteshwarpujara #Pujara pic.twitter.com/CNJkDDTIjF — Rishi (@risshitweetS) June 23, 2023 చదవండి: కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు! అసలు పోరులో తుస్సు! అందుకే.. -
‘టెస్టుల గురించి అతిగా ఆలోచించేవాడిని’
న్యూఢిల్లీ: వన్డేలు, టి20ల్లో విధ్వంసక ఆటతీరు కనబర్చినా మొదటి నుంచి టెస్టుల్లో రోహిత్ శర్మ ఆటతీరు అంతంత మాత్రమే. అతడికి ప్రధాన బ్యాట్స్‌మన్‌గా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగే ముందు వరకు కూడా రోహిత్ టెస్టు కెరీర్ డోలాయమానంలోనే ఉంది. టెస్టులకు తగినట్లుగా అతని టెక్నిక్ లేకపోవడం కూడా అందుకు కారణం. దీనిపై మాట్లాడుతూ రోహిత్... టెస్టుల్లో ప్రదర్శన గురించి గతంలో అతిగా ఆలోచించేవాడినని, ఇప్పుడు దానిని వదిలేసి ఆటను ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు. ‘టెస్టుల్లో విజయవంతం కావడం గురించి చాలా తీవ్రంగా ఆలోచించేవాడిని. ఇలాంటి షాట్ ఎందుకు ఆడానా అని తలబద్దలు కొట్టుకునేవాడిని. ప్రతీ ఇన్నింగ్స్ తర్వాత వీడియో అనలిస్ట్ వద్దకు వెళ్లి విశ్లేషణ చేసి నా బుర్రను మరింత గందరగోళంలో పడేసేవాడిని. టెక్నిక్ గురించి అతిగా ఆలోచించేవాడిని. గత ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు నా ఆలోచన మారిపోయింది. ఫలితం ఎలా ఉన్నా సరే సాంకేతిక అంశాలను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నా. మైదానంలో వెళ్లి నాదైన శైలిలో స్వేచ్ఛగా ఆడటమే ముఖ్యమని భావించా’ అని వ్యాఖ్యానించాడు. ఎవరో చేసే వ్యాఖ్యలను పట్టించుకునే దశను కూడా దాటిపోయానన్న రోహిత్... తన కుటుంబమే అన్నింటికంటే ముఖ్యమని చెప్పాడు. వరల్డ్ కప్ సమయంలో ఆటగాళ్లు అనుమతించిన రోజులను మించి నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సభ్యులను తమతోనే ఉంచుకోవడంపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ... తమకు అండగా నిలిచేందుకు వారు అక్కడ ఉండటంలో తప్పేమీ లేదని, అయినా అనవసరంగా వారిని వివాదాల్లోకి లాగవద్దని కోరాడు. -
రోహిత్ ‘టెస్టు’ ముగిసినట్లే!
సాక్షి క్రీడా విభాగం: విరాట్ కోహ్లి కూడా ఇక అండగా నిలవడం కష్టమని భావించాడా? మళ్లీ మళ్లీ మద్దతు పలకడం ఇబ్బందని రవిశాస్త్రికి కూడా తెలిసొచ్చిందా? ఎందుకంటే తాజా ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సెంచరీ, టి20 సెంచరీ, ఐర్లాండ్‌పై 97 పరుగులు కూడా రోహిత్ శర్మకు టెస్టు జట్టులో స్థానం కల్పించడానికి సరిపోలేదు. టెస్టుల్లో రోహిత్ ఆటపై విమర్శలు వచ్చిన ప్రతీసారి భారత కెప్టెన్ అతడిని వెనకేసుకొచ్చాడు. మిడిలార్డర్లో దూకుడైన ఆటగాడు కావాలని, ఒక్క సెషన్లో వేగంగా మ్యాచ్‌ను మార్చేయగలడని చెబుతూ రోహిత్‌కు అవకాశాలు కల్పించాడు. అతని కోసం టెస్టు స్పెషలిస్ట్ పుజారా, నమ్మకమైన బ్యాట్స్‌మెన్ రహానేలపై వేటు వేయడానికి కోహ్లి వెనుకాడలేదు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో కూడా తొలి రెండు టెస్టుల్లో రోహిత్‌కే అవకాశం కల్పించాడు. సొంతగడ్డపై, శ్రీలంకపై ప్రదర్శనను చూపించి ‘తాజా ఫామ్’ వల్ల ఎంపిక చేశామని సమర్థించుకున్నాడు. 4 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 78 పరుగులు మాత్రమే చేయగా... మూడో టెస్టులో రహానే కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గెలుపు బాట వేశాడు. అఫ్గానిస్తాన్‌తో టెస్టుకే పక్కన పెట్టినా, ఆ మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో రోహిత్ వేటుపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ బంతి సుడులు తిరిగే ఇంగ్లండ్ స్వింగ్ పరిస్థితుల్లో అతని ఆట పనికిరాదని మాత్రం ఖాయమైపోయింది. సెలక్టర్లు కూడా ‘తెల్ల బంతి’ ఫామ్ మాయలో పడకుండా సంయమనం పాటించారు. గత నెలలో అఫ్గాన్‌తో టెస్టులో చోటు కోల్పోయిన తర్వాత ‘నా కెరీర్ ఇప్పటికే సగం ముగిసింది. మిగిలిన సమయంలో నేను ఎంపిక అవుతానా, కాదా అని ఆందోళన చెందుతూ కూర్చోలేను. ఇప్పుడు ఆ దశ దాటిపోయాను. నేను చేయగలిగిందే ఇప్పుడు చేస్తాను’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించడం అతని టెస్టు భవిష్యత్తు గురించి చెప్పేసింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచినా... రంజీ ట్రోఫీ ఫైనల్లో సచిన్ తర్వాత రెండు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందినా బలహీనమైన బ్యాటింగ్ టెక్నిక్ కారణంగా రోహిత్ టెస్టు కెరీర్ ఎప్పుడూ సాఫీగా సాగలేదు. వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆరేళ్లకు తొలి టెస్టు ఆడిన రోహిత్, 22వ టెస్టులో గానీ మూడో సెంచరీ చేయలేకపోయాడు. కెరీర్లో 9 హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. టెస్టుల్లో గుర్తుంచుకునే, విలువైన ఇన్నింగ్స్ ఏదీ అతను ఆడలేదు. 25 టెస్టుల్లో 39.97 సగటుతో 1479 పరుగులు మెరుగ్గానే కనిపిస్తున్నా... 16 విదేశీ టెస్టుల్లో 25.35 సగటుతో 710 పరుగులు మాత్రమే చేయగలగడం అతని వైఫల్యానికి సూచిక. ఇదే ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు జట్టులో స్థానం చేజార్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యద్భుత బ్యాటింగ్ ప్రదర్శనలు, టీమిండియా చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించినా... టెస్టులకు వచ్చేసరికి సాధారణ ఆటగాడిగానే పరిమితం కావడంలో మరో స్టార్ యువరాజ్ సింగ్‌తో రోహిత్‌ను పోల్చవచ్చు. యాదృచ్ఛికమే అయినా వీరిద్దరి టెస్టు రికార్డు చాలా వరకు ఒకే తరహాలో ఉంది. ‘టెస్టుల్లో స్థానం కోసం నేను చేయగలిగినదంతా చేశాను’ అంటూ ఒకనాడు రోహిత్‌లాగే వ్యాఖ్యానించిన యువీ 40 టెస్టుల్లో 33.92 సగటుతో 3 సెంచరీలు, 11 అర్ధసెంచరీలతో 1900 పరుగులు చేశాడు. ‘రేపు మళ్లీ సూర్యోదయం అవుతుంది’ – టెస్టు జట్టును ప్రకటించాక రోహిత్ ట్వీట్ -
‘నా టార్గెట్ 100 టెస్ట్‌లు 500 వికెట్లు’
కేప్‌టౌన్ : వరుస గాయాలతో సతమతమవుతూ, కెరీర్ చరమాంకంలో ఉందనుకుంటున్న తరుణంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ తిరిగి జట్టులో స్థానం సాధించాడు. శ్రీలంకతో జులైలో జరగబోయే రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం క్రికెట్ దక్షిణాఫ్రికా(సీఎస్ఏ) స్టెయిన్ గన్ను ఎంపిక చేసింది. న్యూలాండ్స్‌లో టీమిండియాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఈ స్పీడ్‌స్టర్ గాయపడటంతో మిగిలిన టెస్ట్‌లకు, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. దీంతో ఆ గాయం నుంచి కోలుకుని, కఠోర శ్రమతో ఫిట్నెస్ సాధించి సీఎస్ఏ దృష్టిలో పడ్డాడు. మోర్నీ మోర్కెల్ రిటైర్మెంట్ ప్రకటించడంతో బౌలింగ్‌లో అనుభవలేమి సమస్యగా మారకూడదనే ఉద్దేశంతో సీఎస్ఏ 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్టెయిన్‌కు స్థానం కల్పించారు. దీంతో పాటు గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన కగిసో రబడా కోలుకోవడంతో జట్టులో స్థానం కల్పించారు. స్టెయిన్ ఆనందం శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేయడం పట్ల స్టెయిన్ అనందం వ్యక్తం చేశారు. జట్టులో స్థానం లభించిన తర్వాత స్టెయిన్ ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ క్రికెట్లో అత్యున్నతమైన ఆట ఆడటానికి వయసు అడ్డంకి కాదని, పూర్తి ఫిట్నెస్ ఉన్నంతకాలం ఆడతానని ఈ ప్రొటీస్ బౌలర్ పునరుద్ఘాటించారు. దక్షిణాఫ్రికా తరుఫున అత్యధిక టెస్ట్ వికెట్లు(86 టెస్టుల్లో 422 వికెట్లు) సాధించిన స్పీడ్‌గన్ తాను ఇంకా సాధించాల్సిన లక్ష్యాన్ని తెలిపారు. ‘నా వయసు 35 సంవత్సరాలు, నేను కెరీర్లో సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం నా టార్గెట్ 100 టెస్టులు ఆడాలి, 500 టెస్టు వికెట్లు సాధించాలి. అలాగే 2019 ప్రపంచకప్‌లో ఆడాలి. అవి సాధించడానికి వయసుతో సంబంధం లేకుండా కష్టపడతాను’అంటూ స్టెయిన్ తెలిపారు. -
నేడే ‘ఆఖరు’
ఓటమి అంచున పాక్ లంక విజయం లాంఛనమే కొలంబో: 17 ఏళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్న శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేళ జయవర్ధనేకు జట్టు ఆటగాళ్లు చిరస్మరణీయ కానుక ఇవ్వబోతున్నారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టును ఆతిథ్య జట్టు గెలుచుకోవడం ఇక లాంఛనమే. ఇప్పటికే ఈ సిరీస్‌లో లంక 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే. 271 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆదివారం తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్‌ను స్పిన్నర్ రంగన హెరాత్ (4/46) మరోసారి చావుదెబ్బ తీశాడు. ఫలితంగా 40 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. చివరి రోజు సోమవారం విజయానికి మరో 144 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. క్రీజులో సర్ఫరాజ్ (63 బంతుల్లో 38 బ్యాటింగ్; 1 ఫోర్), రియాజ్ (2 బ్యాటింగ్) ఉన్నారు. 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును షఫీఖ్ (62 బంతుల్లో 32; 5 ఫోర్లు)తో కలసి సర్ఫరాజ్ ఆదుకున్నాడు. ఆరో వికెట్‌కు వీరు 55 పరుగులు జోడించారు. హెరాత్ మిడిలార్డర్ పనిబట్టడంతో పాక్ కోలుకోలేకపోయింది. స్లిప్‌లో జయవర్ధనే రెండు క్యాచ్‌లు తీసుకున్నాడు. జయవర్ధనే అర్ధ సెంచరీ అంతకుముందు శ్రీలంక 177/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించి 109 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటయ్యింది. తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌ను జయవర్ధనే (137 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో ముగించి అభిమానులను అలరించాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఓవరాల్‌గా 149 టెస్టుల్లో 11,814 పరుగులు సాధించినట్టయ్యింది. అజ్మల్ వరుస ఓవర్లలో సంగక్కర (130 బంతుల్లో 59; 4 ఫోర్లు), జయవర్ధనే అవుట్ కావడంతో లంక ఇబ్బంది పడింది. కెప్టెన్ మాథ్యూస్ (119 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు) రాణించాడు. రియాజ్, అజ్మల్లకు మూడేసి వికెట్లు దక్కాయి. -
క్రికెట్ లేని జీవితం ఊహించుకోవడం కష్టం : సచిన్
నా జీవితం అంతా భారత్‌కు క్రికెట్ ఆడాలనే కలగన్నాను. గత 24 సంవత్సరాలుగా ప్రతిరోజూ ఇదే కలతో జీవిస్తున్నాను. క్రికెట్ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే నాకు 11 ఏళ్ల వయసు నుంచి ఆటే జీవితంగా బతుకుతున్నాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే అవకాశం రావడం గొప్ప గౌరవం. సొంత గడ్డపై 200 టెస్టు కోసం ఎదురుచూస్తున్నాను. అదే నా ఆఖరి మ్యాచ్. వైదొలగడానికి ఇదే సరైన సమయం అని నా మనసు చెప్పినప్పుడు... దానికి అంగీకరించిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కుటుంబం ఎంతో సహనంతో, నన్ను అర్థం చేసుకుని ఇంతకాలం అండగా నిలిచింది. మైదానంలో నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వీళ్లందరికీ కృతజ్ఞతలు. - సచిన్ టెండూల్కర్