నా జీవితం అంతా భారత్‌కు క్రికెట్ ఆడాలనే కలగన్నాను. గత 24 సంవత్సరాలుగా ప్రతిరోజూ ఇదే కలతో జీవిస్తున్నాను. క్రికెట్ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే నాకు 11 ఏళ్ల వయసు నుంచి ఆటే జీవితంగా బతుకుతున్నాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే అవకాశం రావడం గొప్ప గౌరవం.
సొంత గడ్డపై 200 టెస్టు కోసం ఎదురుచూస్తున్నాను. అదే నా ఆఖరి మ్యాచ్. వైదొలగడానికి ఇదే సరైన సమయం అని నా మనసు చెప్పినప్పుడు... దానికి అంగీకరించిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కుటుంబం ఎంతో సహనంతో, నన్ను అర్థం చేసుకుని ఇంతకాలం అండగా నిలిచింది. మైదానంలో నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వీళ్లందరికీ కృతజ్ఞతలు. - సచిన్ టెండూల్కర్