ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్‌ ఏమిటి? | What Was The Real Reason Behind Why America Dropped Atomic Bomb On Nagasaki, Explained In Telugu - Sakshi
Sakshi News home page

Atomic Bomb in Nagasaki: ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు?

Published Tue, Sep 26 2023 9:17 AM | Last Updated on Tue, Sep 26 2023 11:40 AM

Why America Dropped Atomic Bomb in Nagasaki - Sakshi

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసింది. ఈ ఘటన జరిగి 78 ఏళ్లు దాటింది. అయినప్పటికీ విధ్వంసానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. అమెరికా తొలిసారిగా 1945, ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని అణుబాంబు వేసింది. ఈ బాంబు పేలుడు నగరంలోని 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ విధ్వంసం సృష్టించింది. 

ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అంటే ఆగష్టు 9న జపాన్‌లోని నాగసాకి నగరంపై మరో అణుబాంబు వేసి జపాన్‌కు అమెరికా తన సత్తా ఏమిటో చూపించింది. దీంతో జపాన్ అగ్రరాజ్యానికి లొంగిపోవాల్సి వచ్చింది. నిజానికి నాగసాకిపై అమెరికా దాడి చేయాలని నిర్ణయించుకోలేదు. నాగసాకిపై అణుబాంబు వేయడం అత్యంత విచిత్ర పరిస్థితిలో జరిగింది. 

బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ పేరు
1945, ఆగష్టు 8 రాత్రి గడిచిపోయింది. అమెరికన్ బీ-29 సూపర్‌ఫోర్రెస్‌(విమానం)లోని బాంబర్ బాక్స్‌లో బాంబు లోడ్ చేశారు. ఈ బాంబు పెద్ద పుచ్చకాయ మాదిరిగా ఉంది. దీని బరువు 4050 కిలోలు. విన్‌స్టన్ చర్చిల్‌ను ఉద్దేశించి ఈ బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ అని పేరు పెట్టారు. ఈ బాంబు లక్ష్యం పారిశ్రామిక నగరం కోకురా. ఈ జపాన్‌లోని ఈ నగరంలోనే పలు మందుగుండు సామగ్రి తయారీ కర్మాగారాలు ఉన్నాయి. 1945, ఆగస్టు 9, ఉదయం 9.50.. ఈ సమయంలో కోకురా నగరంపైన 31,000 అడుగుల ఎత్తులో బీ-29 విమానం  ఎగురుతోంది. ‘ఫ్యాట్ మ్యాన్’ ను ఈ ఎత్తు నుంచి కిందకు వదలాలని నిర్ణయించారు. అయితే ఇంతలో కోకురా మీద మబ్బులు కమ్ముకున్నాయి. దీనికితోడు కింద యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లతో కాల్పులు జరుగుతున్నాయి.
 
దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో..
ఇంతలో బీ-29లోని ఇంధనం క్షీణిస్తోంది. వెనక్కి వెళ్లేందుకు సరిపడా ఇంధనం మాత్రమే విమానంలో మిగిలివుంది. ఈ ఆపరేషన్‌ను నిర్వహించే బాధ్యత గ్రూప్ కెప్టెన్ లియోనార్డ్ చెషైర్‌ చేపట్టారు. ఈ సంఘటన తరువాత అతను మాట్లాడుతూ ‘మేము ఉదయం తొమ్మిది గంటలకు విమానం టేక్‌ ఆఫ్‌ చేశాం. మేము ప్రధాన లక్ష్యమైన కోకురా చేరుకున్న సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇంతలో ఆ బాంబును విడిచిపెట్టాలంటూ మాకు సమాచారం వచ్చింది. అయితే కోకురాపై మేఘాలు ఉండటంతో నాగసాకి నగరం మీది గగనతలానికి చేరుకున్నాం. ఆ తర్వాత సిబ్బంది ఆటోమేటిక్‌ బాంబు డ్రాపింగ్‌ ఎక్విప్‌మెంట్‌ని యాక్టివేట్‌ చేయడంతో కొద్ది క్షణాల్లోనే ఆ భారీ బాంబు భూమిపైకి వేగంగా దూసుకువెళ్లింది.

ఆలోచనకు అవకాశం లేకుండా..
కేవలం 52 సెకన్లలో ఈ బాంబు భూమి ఉపరితలం నుంచి 500 అడుగుల ఎత్తులో పేలింది. 11:02 కాగానే బాంబు పేలింది. బాంబు పేలిన వెంటనే భగభగ మండుతున్న ఒక భారీ నిప్పు బంతి పైకి ఉబికిలేచింది. ఆ బంతి పరిమాణం పెరుగుతూ నగరం మొత్తాన్ని ఆక్రమించింది. నగరంలోని ప్రజలకు ఏం జరుగుతున్నదనే ఆలోచనకు అవకాశం లేకుండానే వారంతా మృత్యువాత పడ్డారు. నాగసాకి చుట్టూ పర్వతాలు ఉన్నాయి. దీని కారణంగా కేవలం 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విధ్వంసం జరిగింది. నాగసాకిలో జరిగిన ఈ దాడిలో 74 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హిరోషిమాలో జరిగిన దాడిలో  లక్షా 40 వేల మందికి పైగా ప్రజలు మరణించారు.
ఇది కూడా చదవండి: తాలిబాన్‌తో చెలిమి వెనుక చైనా ఎత్తుగడ ఏమిటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement