atomic bomb
-
ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి?
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసింది. ఈ ఘటన జరిగి 78 ఏళ్లు దాటింది. అయినప్పటికీ విధ్వంసానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. అమెరికా తొలిసారిగా 1945, ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని అణుబాంబు వేసింది. ఈ బాంబు పేలుడు నగరంలోని 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ విధ్వంసం సృష్టించింది. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అంటే ఆగష్టు 9న జపాన్‌లోని నాగసాకి నగరంపై మరో అణుబాంబు వేసి జపాన్‌కు అమెరికా తన సత్తా ఏమిటో చూపించింది. దీంతో జపాన్ అగ్రరాజ్యానికి లొంగిపోవాల్సి వచ్చింది. నిజానికి నాగసాకిపై అమెరికా దాడి చేయాలని నిర్ణయించుకోలేదు. నాగసాకిపై అణుబాంబు వేయడం అత్యంత విచిత్ర పరిస్థితిలో జరిగింది. బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ పేరు 1945, ఆగష్టు 8 రాత్రి గడిచిపోయింది. అమెరికన్ బీ-29 సూపర్‌ఫోర్రెస్(విమానం)లోని బాంబర్ బాక్స్‌లో బాంబు లోడ్ చేశారు. ఈ బాంబు పెద్ద పుచ్చకాయ మాదిరిగా ఉంది. దీని బరువు 4050 కిలోలు. విన్స్టన్ చర్చిల్‌ను ఉద్దేశించి ఈ బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ అని పేరు పెట్టారు. ఈ బాంబు లక్ష్యం పారిశ్రామిక నగరం కోకురా. ఈ జపాన్‌లోని ఈ నగరంలోనే పలు మందుగుండు సామగ్రి తయారీ కర్మాగారాలు ఉన్నాయి. 1945, ఆగస్టు 9, ఉదయం 9.50.. ఈ సమయంలో కోకురా నగరంపైన 31,000 అడుగుల ఎత్తులో బీ-29 విమానం ఎగురుతోంది. ‘ఫ్యాట్ మ్యాన్’ ను ఈ ఎత్తు నుంచి కిందకు వదలాలని నిర్ణయించారు. అయితే ఇంతలో కోకురా మీద మబ్బులు కమ్ముకున్నాయి. దీనికితోడు కింద యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్లతో కాల్పులు జరుగుతున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో.. ఇంతలో బీ-29లోని ఇంధనం క్షీణిస్తోంది. వెనక్కి వెళ్లేందుకు సరిపడా ఇంధనం మాత్రమే విమానంలో మిగిలివుంది. ఈ ఆపరేషన్‌ను నిర్వహించే బాధ్యత గ్రూప్ కెప్టెన్ లియోనార్డ్ చెషైర్ చేపట్టారు. ఈ సంఘటన తరువాత అతను మాట్లాడుతూ ‘మేము ఉదయం తొమ్మిది గంటలకు విమానం టేక్ ఆఫ్ చేశాం. మేము ప్రధాన లక్ష్యమైన కోకురా చేరుకున్న సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇంతలో ఆ బాంబును విడిచిపెట్టాలంటూ మాకు సమాచారం వచ్చింది. అయితే కోకురాపై మేఘాలు ఉండటంతో నాగసాకి నగరం మీది గగనతలానికి చేరుకున్నాం. ఆ తర్వాత సిబ్బంది ఆటోమేటిక్ బాంబు డ్రాపింగ్ ఎక్విప్మెంట్ని యాక్టివేట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే ఆ భారీ బాంబు భూమిపైకి వేగంగా దూసుకువెళ్లింది. ఆలోచనకు అవకాశం లేకుండా.. కేవలం 52 సెకన్లలో ఈ బాంబు భూమి ఉపరితలం నుంచి 500 అడుగుల ఎత్తులో పేలింది. 11:02 కాగానే బాంబు పేలింది. బాంబు పేలిన వెంటనే భగభగ మండుతున్న ఒక భారీ నిప్పు బంతి పైకి ఉబికిలేచింది. ఆ బంతి పరిమాణం పెరుగుతూ నగరం మొత్తాన్ని ఆక్రమించింది. నగరంలోని ప్రజలకు ఏం జరుగుతున్నదనే ఆలోచనకు అవకాశం లేకుండానే వారంతా మృత్యువాత పడ్డారు. నాగసాకి చుట్టూ పర్వతాలు ఉన్నాయి. దీని కారణంగా కేవలం 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విధ్వంసం జరిగింది. నాగసాకిలో జరిగిన ఈ దాడిలో 74 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హిరోషిమాలో జరిగిన దాడిలో లక్షా 40 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది కూడా చదవండి: తాలిబాన్‌తో చెలిమి వెనుక చైనా ఎత్తుగడ ఏమిటి? -
ఒపెన్హైమర్తో మన అనుబంధం
జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు జారవిడిచి 78 ఏళ్లు అవుతోంది. ఆధునిక యుగంలో ఇంతటి విధ్వంసకరమైన ఘటన మరోటి చోటుచేసుకోలేదంటే అతిశయోక్తి కాదు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఘటనపై లెక్కలేనన్ని పుస్తకాలు, డాక్యుమెంటరీలు, సినిమాలు వచ్చాయి. తాజాగా ప్రదర్శితమవుతున్న ‘ఒపెన్ హైమర్’ చిత్రం కూడా ఈ కోవకు చెందినదే. మన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా తయారైన అణుబాంబులు, వాటి సృష్టికర్త జె.రాబర్ట్ ఒపెన్ హైమర్ ఇతివృత్తంతో సాగుతుంది ఈ సినిమా. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. జర్మనీలో పుట్టి అమెరికాలో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగిన ఒపెన్ హైమర్‌ను అణుబాంబు పితామహుడని కూడా అంటారు. ఒపెన్‌హైమర్‌కు ఉన్న భగవద్గీత, సంస్కృత జ్ఞానం ఆయనపై భారతదేశంలో ఆసక్తి పెరిగేందుకు కారణమయ్యాయి. భారతదేశ ఆధ్యాత్మికత పట్ల ఆయనకు ఉందని చెబుతున్న ఆరాధన కంటే కూడా ఈ దేశంతో ఆయనకున్న సంబంధం మరింత లోతైనది. దీన్ని 20వ శతాబ్దంలో ఆధునిక భౌతిక శాస్త్రం అభివృద్ధి నేపథ్యంలో చూడాలి. విశ్వం మొత్తానికి ఆధారమైన, మౌలికమైన కణాలపై అధ్య యనం సాగిన కాలం అది. అణు కేంద్రకం దాంట్లోని భాగాలను అర్థం చేసుకునే అణు భౌతికశాస్త్ర అభివృద్ధి కూడా ఈ కాలంలోనే వేగం పుంజుకుంది. అణుశక్తితోపాటు అణుబాంబుల తయారీకి దారితీసిన పరిశోధనలివి. ఈ కాలపు భారతీయ శాస్త్రవేత్తలు కూడా చాలామంది ఈ అణు భౌతిక శాస్త్ర రంగంలో కృషి చేశారు. దేబేంద్ర మోహన్ బోస్ (ఇతడి విద్యార్థిని బిభా చౌధురి), మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్, హోమీ జహంగీర్భాభా, దౌలత్సింగ్ కొఠారీ, పియారా సింగ్ గిల్ వంటి మహామహులు వారిలో కొందరు మాత్రమే. వీరు ఆధునిక భౌతికశాస్త్రంలో పేరెన్నికగన్న వూల్ఫ్‌గాంగ్ పౌలీ, నీల్స్ బోర్, లార్డ్ రూథర్‌ఫర్డ్, పాల్ డైరాక్, ఎన్రికో ఫెర్మీ, ఎర్నెస్ట్ ష్రోడింగర్, జేమ్స్ చాద్విక్, జాన్ కాక్‌క్రాఫ్ట్, హిడెకీ యుకవాలతో కలిసి పని చేయడం లేదా వారితో సంబంధబాంధవ్యాలను కలిగి ఉండటం కద్దు. భాభాతో సంబంధం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఖగోళ వికిరణాలపై పరిశోధనలు చేస్తున్న సమయంలోనే హోమీ భాభాకు ఒపెన్ హైమర్ (కేంబ్రిడ్జ్‌లో సీనియర్. తరువాతి కాలంలో బెర్క్లీలో పనిచేశారు) గురించి ఒక అవగాహన ఉండింది. 1936లో భాభా, వాల్టర్ హైట్లర్ ఉమ్మడిగా ఖగోళ వికిరణ జల్లు (కాస్మిక్ రే షవర్స్) సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా, ఒపెన్ హైమర్ ఓ ఏడాది తరువాత దాదాపుగా అలాంటిదే స్వతంత్రంగా ప్రతిపాదించారు. అప్పట్లో భాభాకు పాశ్చాత్యదేశాల్లోని గొప్ప భౌతిక శాస్త్రవేత్తలతో సంబంధాలు ఉండేవి. ఒకానొక దశలో 1940లో తనను ఒపెన్ హైమర్‌కు పరిచయం చేయాల్సిందిగా భాభా తన మిత్రుడు పౌలీని కోరారు. ఇద్దరూ కలిసి బెర్క్లీలో పరిశోధనలు చేయాలన్నది ఉద్దేశం. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో భాభా భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. భౌతికశాస్త్ర మౌలికాంశాలపై పరిశోధనలు చేసేందుకు ఓ సంస్థను స్థాపించే అవకాశమూ అప్పుడే లభించింది. తరువాతి కాలంలో భాభాకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కలిసి భారతీయ అణుశక్తి కార్యక్రమాన్ని సిద్ధం చేసి అమలు చేసే అవకాశమూ దక్కింది. అణు రియాక్టర్ నిర్మాణానికి, యురేనియం శుద్ధికి అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని భాభా తనకు పాశ్చాత్య దేశాల్లో ఉన్నసంబంధాల ద్వారానే సంపాదించగలిగారు. ప్రిన్స్టన్ , కావెండిష్ వంటి ప్రసిద్ధ సంస్థల తరహాలో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) స్థాపనకూ బాబా అంతర్జాతీయ సహ కారం అందేలా రూఢి చేసుకున్నారు. అయితే 1945లో హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులు పడిన తరువాత రాబర్ట్ ఒపెన్ హైమర్ వివాదాస్పద వ్యక్తి అయ్యారు. అయినా టీఐఎఫ్ఆర్లో పరిశోధకుల బృందాన్ని తయారు చేసే విషయంలో భాభా ఆయన సాయం తీసుకున్నారు. ఒపెన్ హైమర్ విద్యార్థి, ఆయనతో కలిసి మన్హాటన్ ప్రాజెక్టులో పనిచేసిన బెర్నార్డ్ పీటర్స్‌కు ఉద్యోగమిచ్చారు. అప్పట్లో ప్రిన్స్టన్లో పనిచేస్తున్న ఒపెన్ హైమర్ సోదరుడు ఫ్రాంక్ ఒపెన్ హైమర్కూ ఉద్యోగం ఆఫర్ చేశారు భాభా. రాబర్ట్‌ను సంప్రదించిన తరువాతే ఫ్రాంక్‌కు ఉద్యోగం ఇవ్వజూపినట్లు చరిత్రకారులు చెబు తారు. ఈ అణుశక్తి కార్యక్రమ ఏర్పాటుకు ఫ్రెంచ్ నోబెల్ గ్రహీత ఫ్రెడెరిక్ జోలియోట్ క్యూరీ సలహాలు కూడా నెహ్రూ స్వీకరించారు. పరోక్ష ప్రేరణ ఒపెన్ హైమర్‌పై విమర్శలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో భాభా చేసిన కొన్ని నియామకాలపై నిరసన వ్యక్తమైంది. ఒపెన్ హైమర్‌కు కమ్యూనిస్టులతో ఉన్న గత సంబంధాలపై కూడా వివాదాలు తలె త్తాయి. ఒపెన్ హైమర్ కూడా తన మాజీ విద్యార్థి పీటర్స్‌ను కమ్యూ నిస్టు సానుభూతిపరుడిగా అభివర్ణించారు. దీంతో పీటర్స్ భారత్‌కు రావడం కష్టమైంది. ఎలాగోలా వచ్చిన తరువాత టీఐఎఫ్ ఆర్‌లో అతడిపై ఇంకోసారి దుమారం రేకెత్తింది. ఇంకోవైపు ఫ్రాంక్ ఒపెన్ హైమర్ కూడా అమెరికా ప్రభుత్వం పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరిం చడంతో భారత్‌కు రాలేకపోయారు. అయితే అమెరికాలో రాబర్ట్ ఒపెన్ హైమర్ మాత్రం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సుడ్ స్టడీస్ (ఐఏఎస్) డైరెక్టర్‌గా కొనసాగుతూ భారతీయ శాస్త్రవేత్తలు చాలామందికి మార్గదర్శకుడిగా వ్యవహరించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో యువ భౌతిక శాస్త్రవేత్తగా ఉన్న అల్లాడి రామకృష్ణన్ కు ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఏడాది స్కాలర్షిప్ మంజూరు చేయడం మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే.అల్లాడి భారత్‌కు తిరిగి వచ్చాక ఐఏఎస్ లాంటి సంస్థను స్థాపించాలని ఆశించారు. ఈ ఆలోచనే తరువాతి కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్‌గా 1962లో మద్రాస్‌లో ఆవిష్కృతమైంది. భారత్‌కు తరచూ... ఆ కాలంలో స్వల్పకాలిక పర్యటనపై భారత్‌కు విచ్చేసే విదేశీ శాస్త్రవేత్తల్లో ఒపెన్ హైమర్ పేరు తరచూ వినిపించేది. పీసీ మహాల నోబిస్ ఆలోచనల రూపమైన ‘షార్ట్ విజిట్స్ ఆఫ్ సైంటిస్ట్ ఫ్రమ్ అబ్రాడ్’లో భాగంగా ఒపెన్ హైమర్‌తో పాటు నీల్స్ బోర్, నార్బెర్ట్ వీనర్, పీఎంఎస్ బ్లాకెట్, జోసెఫ్ నీధమ్, జేబీఎస్ హాల్డేన్ లాంటి మహామహులు భారత్‌కు వచ్చిపోయేవారు. వీరికి పంపే ఆహ్వాన పత్రికలపై నెహ్రూ స్వయంగా సంతకాలు చేసేవారు. ఇందులో చాలామంది నెహ్రూకు తెలుసు. 1945 అనంతర ఒపెన్ హైమర్ నైతిక దృక్కోణాన్ని నెహ్రూ బహిరంగంగా ప్రశంసించారు. 1959లో భారత జాతీయ సైన్్స కాంగ్రెస్ సమావేశాల ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, ఒపెన్ హైమర్ భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందారని ఉల్లేఖించారు. పరి శోధనలు, ఆవిష్కరణలకు కూడా సామాజిక విపరిణామాలు ఉంటా యన్న విషయాన్ని పెద్ద శాస్త్రవేత్తలు గుర్తించేందుకు ఇది ఉపయోగ పడాలన్నారు. హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు ప్రయోగంతో రెండో ప్రపంచ యుద్ధం నాటకీయంగా ముగిసింది. ఈ ఘటన అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య అణ్వాయుధ పోటీకి దారితీసింది. అదే సమయంలో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. వలసవాద శకం ముగిసిన తరువాత అణుశక్తిని శాంతియుత, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వాడుకోవడమన్న అంశం భారత్ లాంటి దేశాలకు ప్రధాన పరిశోధన ఇతివృత్తమైంది. ఈ నవతరం సైన్స్ ను అభివృద్ధి చేయడం భారత్‌కు ప్రథమ కర్తవ్యమైంది. అణుశక్తిని విద్యుదుత్పత్తికి ఉపయోగించుకుంటామని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే 1964లో చైనా అణుబాంబును పరీక్షించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పదేళ్ల తరువాత భారత్ కూడా పోఖ్రాన్–1తో అణ్వస్త్ర దేశాల జాబితాలో చేరిపోయింది. కానీ భగవద్గీతకు నెలవైన భారత్ అణు మార్గం పట్టడాన్ని ఒపెన్ హైమర్ మాత్రం చూడలేకపోయారు! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది.. వెలుగులు అణువంతే!
అణు బాంబు సృష్టికర్త ఒప్పెన్హీమర్ జీవిత గాథ హాలీవుడ్ తెరపైకెక్కడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి అణు శక్తిపై చర్చ మొదలైంది. అణు పరిజ్ఞానం ఇప్పటిదాకా ఎన్నోసార్లు చర్చల్లో నానుతూనే ఉంది. ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని పరిరక్షించే పునరుద్పాతక ఇంధన శక్తుల వినియోగంపై అవగాహన పెరగడంతో అణుశక్తి ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాని స్థానాన్ని సౌర విద్యుత్ ఆక్రమిస్తోంది... అణు శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఒప్పెన్హీమర్ 1940లో తొలిసారి అణు బాంబును సృష్టించారు. తర్వాత పదేళ్లకు 1950లో తొలి అణు విద్యుత్కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో దాన్ని ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా భావించారు. కానీ అణు విద్యుత్కేంద్రాలు ఎంత ప్రమాదకరమో అనుభవపూర్వకంగా తెలిసొచ్చాక వాటికి ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాల్లో అణు ఇంధనానికి ప్రాధాన్యమూ తగ్గుతూ వస్తోంది. జర్మనీ ప్రభుత్వం 3 అణు విద్యుత్ కేంద్రాలను మూసివేయడం గమనార్హం. అణు వర్సెస్ సౌర విద్యుత్ 1970 దశకంలో అణు విద్యుత్ ఒక వెలుగు వెలిగింది. అణు శక్తికి అది స్వర్ణయుగమని చెప్పొచ్చు. చాలా దేశాల్లో భారీగా అణు ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలా ప్రపంచ విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్ వాటా 1985 కల్లా ఏకంగా 15.1% దాకా పెరిగింది. కానీ 2022 నాటికి అది 9.1 శాతానికి పడిపోయింది. సౌరవిద్యుత్ వినియోగంలోకి రావడమే దీనికి ప్రధాన కారణం. ‘‘2021లో ప్రపంచ దేశాల్లో సౌర విద్యుత్ 1.04 టెరావాట్స్ కాగా, ప్రపంచ అణు విద్యుత్ సామర్థ్యం 463 గిగావాట్లు. అంటే అణు విద్యుత్ కంటే సౌర విద్యుత్ రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది’’ అని ఇస్రోలో సోలార్ ప్యానెల్ డివిజన్ మాజీ శాస్త్రవేత్త మనీశ్ పురోహిత్ చెప్పారు. సౌర విద్యుత్‌తో లాభాలు... ► సౌర విద్యుత్‌కు ముడి సరుకు సూర్యుడే గనుక దానికి కొరత ఉంటుందన్న భయం లేదు. ► సోలార్ ప్యానెల్స్, యూనిట్ల ధర బాగా తగ్గింది. సోలార్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 10 లక్షల డాలర్లే. సౌర విద్యుత్ వ్యర్థాలను నిర్మూలించే క్రమంలో ఎలాంటి ప్రమాదానికీ ఆస్కారం లేదు. ► అణు విద్యుత్కేంద్రం ఏర్పాటే అత్యంత ఖరీదైన వ్యవహారం. కొత్తగా అణు ప్లాంట్ నిర్మాణానికయ్యే వ్యయం కనీసం 1,000 కోట్ల డాలర్లు. ► అణు విద్యుదుత్పత్తి వల్ల వెలువడే అణు ధారి్మక వ్యర్థాల నిర్మూలన అత్యంత ప్రమాదంతో కూడిన వ్యవహారం. ► ఒక్కో అణు విద్యుత్కేంద్రం నుంచి ఏటా కనీసం 20 మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలు వెలువడతాయి. ► ప్రస్తుతం అన్ని దేశాల వద్దా కలిపి 90 వేల మెట్రిక్ టన్నుల అణు ధారి్మక వ్యర్థాలున్నాయి. వీటిని అత్యంత సురక్షిత పద్ధతిలో నిర్మూలించకపోతే ఎన్నో రకాలుగా తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ► పైగా అణు విద్యుత్కేంద్రాలతో ప్రమాదాలు కూడా ఎక్కువే. అందుకే కొత్త ప్లాంట్ల ఏర్పాటును అడ్డుకుంటూ ఎన్నో పోరాటాలు జరిగాయి, జరుగుతున్నాయి. ► దాంతో చాలా ఏళ్లుగా కొత్త అణు విద్యుత్కేంద్రాలేవీ రాలేదు. ► అమెరికా, జపాన్, ఫ్రాన్స్ మినహా మరే దేశాలు అణు విద్యుత్‌పై మొగ్గు చూపించకపోవడంతో అంతర్జాతీయంగా ఒప్పందాలు, పరస్పర సాంకేతిక సహకారం తగ్గిపోయాయి. ఫలితంగా అణు విద్యుత్ చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. అణ్వాయుధాలు తగ్గిపోతున్నాయ్! ► అమెరికా, రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో కొన్నేళ్లు పాటు అణ్వాయుధాల పోటీయే ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దగ్గర 1986 నాటికి ఏకంగా 64,452 అణ్వాయుధాలు పోగుపడ్డాయి. ► ఇప్పుడు వాటి సంఖ్య 12,510కి తగ్గింది. వీటిలో 89% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ► అణు వినాశనం ఎంత భయానకంగా ఉంటుందో హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణు బాంబు దాడులతో అందరికీ తెలిసొచి్చంది. ► ఏళ్లు గడిచే కొద్దీ అణ్వాయుధాల తయారీని తగ్గించడంపై దేశాలన్నీ దృష్టి సారించాయి. అణు విద్యుత్ రియాక్టర్ల సగటు జీవిత కాలం 60 ఏళ్లు. ఇప్పుడున్న వాటిలో చాలావరకు ఇక పనికి రాని స్థితికి వచ్చేశాయి. కొత్తవి ఏర్పాటు కావడం లేదు. దాంతో అణు విద్యుదుత్పత్తి తగ్గుతూ వస్తోంది – డాక్టర్ నితేంద్ర సింగ్, ఇండియన్ యూత్ న్యూక్లియర్ సొసైటీ వ్యవస్థాపకుడు -1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం కుదిరిన తర్వాత అణు శక్తిని ప్రజాప్రయోజనాలకే తప్ప, వినాశనానికి వాడొద్దని దేశాలన్నీ నెమ్మదిగా గ్రహించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Russia War: పుతిన్ కొత్త ప్లాన్..?
ఉక్రెయిన్‌పై రెండు నెలలుగా భీకరమైన దాడులకు పాల్పడుతున్నా ఆ చిన్న దేశాన్ని స్వాధీనం చేసుకోలేక అసహనంతో ఊగిపోతున్న రష్యా బహిరంగంగానే మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతోంది. అణు దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. అణు దాడులకు పాల్పడే సాహసం రష్యా చేస్తుందా? అలాంటి దాడులు జరిగితే ప్రపంచం సర్వనాశనమైపోతుందని తెలిసినా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఎందుకీ హెచ్చరికలు చేస్తున్నారన్న చర్చ మొదలైంది. ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహార శైలి, దూకుడు మనస్తత్వంతో ఎంతకైనా తెగిస్తారన్న అనుమానాలున్నాయి. టాక్టికల్ అణ్వాయుధాలు ప్రయోగిస్తారా ? రష్యా అధ్యక్షుడు పుతిన్ టాక్టికల్ అణ్వాయుధాలు (తక్కువ ప్రాంతంలో విధ్వంసం సృష్టించే అణు బాంబులు) ప్రయోగించడానికి ఆదేశాలిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యా దగ్గరున్న క్షిపణి వ్యవస్థల్లో రెండు స్వల్ప దూరంలో లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను మోసుకుపోగలవు. 1. కల్బీర్ క్షిపణి (ఎస్ఎస్–ఎన్–30) దీనిని ఉపరితలం నుంచి, సముద్రం నుంచి ప్రయోగించవచ్చు. 1500 నుంచి 2500 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది. 2. ఇస్కందర్ ఎం క్షిపణి లాంఛర్ ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి 400 నుంచి 500 కి.మీ.దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది. చిన్న అణుబాంబునైనా ప్రయోగిస్తే ఉక్రెయిన్‌పై యుద్ధంలో గేమ్ ఛేంజర్‌గా మారి ఓడిపోయే దుస్థితి రాదని పుతిన్ భావిస్తున్నట్టుగా వాషింగ్టన్‌లోని కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పేస్‌లో అణు నిపుణుడు జేమ్స్ యాక్టన్ అభిప్రాయపడ్డారు. ఇవి ఎంత శక్తిమంతమైనవి ? ఈ టాక్టికల్ అణుబాంబుల్లో అతి చిన్నది ఒక కిలో టన్ను పేలుడు పదార్థంతో సమానం. అదే పెద్దదైతే 100 కిలోటన్నుల పేలుడు పదార్థంతో సమానమైన శక్తి కలిగి ఉంటుంది. దీని వల్ల జరిగే విధ్వంసం అణువార్ హెడ్, అది వేసే ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు 15 కిలోటన్నుల శక్తి కలిగినది. ఈ బాంబు లక్ష 46 వేల మంది ప్రాణాలను తీసింది. ప్రస్తుతం రష్యా దగ్గరున్న అతి పెద్ద అణుబాంబు 800 కిలోటన్నుల శక్తి కలిగి ఉంది. అణుదాడి స్వీయ ఓటమా ? ఒకవైపు ఉక్రెయిన్ రష్యాలో భాగమని చెబుతున్న పుతిన్ ఆ భూభాగంపైనే అణు దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ సాగుతోంది. ఎప్పటికైనా ఉక్రెయిన్‌ని రష్యాలో కలిపేయాలనుకుంటూ ఆ భూభాగాన్ని నాశనం చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని చైనా మద్దతు లేని రష్యా ఒక్క అడుగు కూడా ముందుకు వేసే అవకాశం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అణుబాంబుల విషయంలో చైనా ‘‘నో ఫస్ట్ యూజ్’’ విధానానికి కట్టుబడి ఉంది. రష్యా అణుదాడులకు మొదట దిగితే చైనా స్నేహం కూడా కోల్పోవచ్చునని, అందుకే రష్యా అంత సాహసం చేయదని కింగ్స్ కాలేజీ లండన్‌లోని అణు నిపుణుడు డాక్టర్ హెదర్ విలియమ్స్ అభిప్రాయపడ్డారు. ఓ రకంగా అణు బాంబుని ప్రయోగిస్తే రష్యా స్వయంగా ఓటమిని అంగీకరించినట్టేనన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
వామ్మో.. వందల అణు బాంబుల ఎఫెక్ట్‌తో బద్ధలైందా?
హుంగా టోంగా-హుంగా హాపై.. పదిరోజుల క్రితం దాకా పసిఫిక్ మహాసముద్రంలోని జనావాసరహిత దీవిగా ఉండేది. మరి ఇప్పుడో?.. ఏకంగా మ్యాప్ నుంచే కనుమరుగు అయిపోయింది. కారణం.. ఆ దీవిలోని అగ్నిపర్వతం భారీ శబ్ధాలతో బద్ధలైపోవడమే!. జనవరి 15వ తేదీన చిన్న దీవి దేశం టోంగాకు దగ్గర్లో ఉన్న ‘హుంగా టోంగా-హుంగా హాపై’ అగ్నిపర్వత దీవి.. మహాసముద్రం అడుగులోని అగ్నిపర్వతం బద్ధలుకావడంతో పూర్తిగా నాశనమైంది. ఆ ప్రభావం ఎంతగా ఉందంటే.. సముద్రం ముందుకు వచ్చి పెద్ద పెద్ద అలలతో సునామీ విరుచుకుపడింది. టోంగా రాజధాని నుకువాలోఫాపై దట్టమైన మందంతో విషపూరితమైన బూడిద అలుముకుంది. తాగే నీరు కలుషితం అయ్యింది. పంటలు దెబ్బతిన్నాయి. రెండు గ్రామాలు ఏకంగా జాడ లేకుండా సముద్ర గర్భంలో కలిసిపోయాయి!. ఈ ప్రకృతి విలయంపై నాసా సైంటిస్టులు ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. టోంగా అగ్నిపర్వతం బద్ధలైన ఘటన.. వంద హిరోషిమా అణు బాంబు ఘటనలకు సమానమని నాసా పేర్కొంది. ఐదు నుంచి ముప్ఫై మెగాటన్నుల టీఎన్టీ(ఐదు నుంచి 30 మిలియన్ టన్నుల) పేలితే ఎలా ఉంటుందో.. అంత శక్తితో ఆ అగ్నిపర్వతం పేలింది. అందుకే అగ్ని పర్వత శకలాలు 40 కిలోమీటర్ల ఎత్తులో ఎగసిపడ్డాయి అని నాసా సైంటిస్టుల జిమ్ గార్విన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే 1945, ఆగష్టులో హిరోషిమా(జపాన్) పడిన ఆటం బాంబు 15 కిలోటన్నుల(15 వేల టన్నుల) టీఎన్టీ డ్యామేజ్ చేసింది. కేవలం ఒక్క నగరాన్ని మాత్రమే నామరూపాలు లేకుండా చేసింది. ఇప్పుడు అగ్నిపర్వతం ధాటికి సముద్రం కదిలి.. ఎక్కడో వేల కిలోమీరట్ల దూరంలోని తీరాల దగ్గర ప్రభావం చూపెట్టింది. ఇక టోంగాలో సునామీ ధాటికి ప్రాణ నష్టం పెద్దగా సంభవించకపోయినా!(స్పష్టత రావాల్సి ఉంది).. ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. జపాన్, న్యూజిలాండ్‌తోపాటు పసిఫిక్ తీరంలోని చాలా దేశాలు సునామీ అలర్ట్ జారీ చేసి.. 48 గంటల పరిశీలన తర్వాత విరమించుకున్నాయి. సంబంధిత వార్త: సునామీకి ఎదురీగిన తాత.. అందుకే ప్రపంచం జేజేలు -
దాని వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరం
జూబ్లీహిల్స్: విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం అణుబాంబు కంటే ప్రమాదకరమని ప్రముఖ నటి, మాజీ మిస్ ఇండియా జూహీచావ్లా అన్నారు. ఫిక్కీ యంగ్‌లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్‌ఎల్‌వో ) ఆద్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగడం కేన్సర్‌కు దారితీస్తుందని గుర్తు చేసారు. వైఎఫ్‌ఎల్‌వో చైర్పర్సన్ సంద్యారాజు, మోడల్ శిల్పారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
నాటి హిరోషిమా... నేటి హీరో సీమ
చరిత్ర అది 1945, ఆగస్టు 6వతేదీ. ఉదయం ఎనిమిదిన్నర. ఇది ఇండియా టైమ్ కాదు, జపాన్ టైమ్. యుద్ధమేఘాలు గగనతలాన్ని కమ్ముకుని ఉన్నాయి. ఎక్కడ రేడియో విన్నా, ఏ వార్తాపత్రిక చూసినా రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలే. యుద్ధం ఎవరికి మేలు చేస్తుందో తెలియదు, కానీ కీడు మాత్రం చాలా మందికి చేస్తుంది. ఆ కీడంతా అమాయకులకే. ఏ పాపం పుణ్యం ఎరగని జీవులకే. ఒక దేశం మరో దేశంతో ఎందుకు యుద్ధం చేస్తుందో తెలియదు వాళ్లకు. ప్రపంచం మొత్తం ఎందుకు రెండుగా చీలి పోయిందో తెలియదు. తమ దేశం ఏ పక్షాన ఉందనే ప్రాథమిక వివరం కూడా ఏ కొద్దిమందికో తప్ప అందరికీ తెలియదు. వారికి తెలిసిందల్లా ఎప్పుడు ఏ విమానం గగనతలాన చక్కర్లు కొడుతుందోనని కళ్లు తల మీద పెట్టుకుని చూస్తూ ఉండడమే. జపాన్‌లో ఆ రోజు విమానం ప్రొఫెల్లర్ల చప్పుడు ఆ దేశ పౌరులకు జానపద కథల్లోని గుర్రపు డెక్కల చప్పుడును తలపించజేస్తోంది. గుండె గుభిల్లుమంటుంటే పిల్లలు ఎక్కడ ఉన్నారో వెతికిపట్టుకుని తలదాచుకోవడానికి పరుగులు తీస్తున్నారు. సూర్యోదయమైందంటే ఏ శకలం ఎటు నుంచి వచ్చి తాకుతుందోనని ఒళ్లంతా చెవులు చేసుకుని చిటుక్కుమనే శబ్దం కోసం ఎదురు చూడడమే అయింది. ఆ క్రమంలో పెద్ద దేశాల అధినేతలంతా సమావేశమయ్యారనే వార్త వారి చెవుల్లో పన్నీటిని చల్లింది. ఇక యుద్ధం ముగిసినట్లేనట ఆశ నిండిన మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. ఇంతలో పెద్ద పెట్టున శబ్దం. పిశాచి రెక్కలు విచ్చినట్లు జపాన్ గగనతలం మీద చక్కర్లు కొట్టింది అమెరికన్ బాంబర్ బి–29. మరో నిమిషంలో వంద పిడుగులు ఒక్కసారిగా నేలకు తాకినట్లు ‘లిటిల్ బాయ్’ అనే ఆ బాంబు జపాన్ భూతలాన్ని తాకింది. షిరోషిమా నగరంలో 90 వేల భవనాలున్నాయి, 1900 అడుగుల ఎత్తు నుంచి శరాఘాతంలా దూసుకొచ్చిన లిటిల్‌బాయ్ తాకిడికి నగరం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఎనభై వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 35 వేల మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తీవ్రమైన రేడియేషన్‌కు గురై రకరకాల అనారోగ్యాలతో ఏడాదిలోపు సంభవించిన మరో అరవై వేల మరణాలు కూడా లిటిల్‌బాయ్ పొట్టనపెట్టుకున్నవే. ప్రపంచం ముందు ఒకే ఒక్క ప్రశ్న. ఇంతకీ పెద్ద దేశాల అధిపతులు కూర్చుని చర్చించి సాధించిందేమిటి? సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమన్, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ (చర్చిల్ తర్వాత క్లెమెంట్ అట్లీ)... జర్మనీలో సమావేశమయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధానికి తెర దించడానికే సమావేశమయ్యారు. ఆ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్. అనధికారికంగా వారంతా జపాన్‌లో రాజరికాన్ని కొనసాగించడానికి ఆమోదం తెలిపిన వారే. కానీ చేసిందేమిటి? బేషరతుగా లొంగిపోవడానికి జపాన్ అంగీకారం తెలిపే లోపే అమెరికా అతి తెలివిగా ఆలోచించింది. యుద్ధంలో అవసరమవుతుందని సిద్ధం చేసుకున్న అణుబాంబులను వాడకపోతే ఎలా? ప్రయత్నం అంతా వృథా అయిపోదూ? ఇప్పుడు వాడకపోతే ఇక వాడే అవసరం రాదేమో! అణుబాంబును ప్రయోగించి చూడడానికి ఇంతకు మించిన మంచి తరుణం రాకపోవచ్చు. ఇప్పుడే ప్రయోగించాలి అనుకుంది. అంతే... హిరోషిమా మీద తొలి అణుబాంబును ప్రయోగించింది. ఆ భయోత్పాతం నుంచి బయటపడేలోపు నాగసాకి పట్టణం మీద ఫ్యాట్‌మ్యాన్ పేరుతో మరో అణుబాంబును ప్రయోగించింది. నిజానికి జపాన్ అప్పటికి అగ్రదేశాధినేతల డిమాండ్‌ను ధిక్కరించే పరిస్థితిలో ఏ మాత్రం లేదు. యుద్ధానికి చరమగీతం పాడడానికి సిద్ధంగానే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా చేసిన అణుదాడిని ఆ దేశపు ఆధిక్యభావన ప్రకటనలో భాగంగానే గుర్తించింది ప్రపంచం. ఇకపై ఇలాంటివి జరగడానికి వీల్లేదని శాంతికాముకులు చేసిన అనేక నిరసనల తర్వాత ఆగస్టు ఆరవ తేదీని ప్రపంచదేశాలన్నీ యాంటీ న్యూక్లియర్డేగా గుర్తు చేసుకుంటున్నాయి. జపాన్ ప్రజలు యుద్ధం మిగిల్చిన చేదు అనుభవాలను దీటుగా ఎదుర్కొంటూ నేలమట్టమైన నగరాలను పునర్నిర్మించుకున్నారు. బాంబు ప్రయోగం బాంబు తాకిడికి ధ్వంసమైన హిరోషిమా హిరోషిమా ఫొటో ప్రదర్శనను తిలకిస్తున్న స్టూడెంట్స్ -
అమెరికాపై అణు బాంబు వేస్తాం
ఉత్తర కొరియా హెచ్చరిక ప్యాంగ్యాంగ్: అగ్రరాజ్యం అమెరికాపై ఏ క్షణమైనా అణు బాంబులతో దాడి చేస్తామని ఉత్తర కొరియా గురువారం హెచ్చరించింది. అమెరికా చర్యల వల్ల తలెత్తే ఎలాంటి విపత్కర ఫలితాలకైనా ఆ దేశమే బాధ్యత తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఉత్తర కొరియా అణు పరీక్షలకు సన్నద్ధమవుతోందని వార్తల నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు కలవరం సృష్టిస్తున్నాయి. మరోవైపు, చైనా సహకరించినా, లేకున్నా ఉత్తర కొరియాను దారికి తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు. నిలువ నీడా దొరకదు.. యుద్ధానికి సంబంధించిన డ్రిల్‌ను ఇటీవలే పూర్తిచేశామని, తాము దాడికి పాల్పడితే అమెరికా స్వరూపమే మారిపోతుందని ఉత్తర కొరియా ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు ‘రోడాంగ్ సిన్మన్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ప్రాణాలతో బయట పడే ప్రజలకు కనీసం ఉండటానికి వసతులు కూడా దొరకవని పేర్కొన్నారు. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే అణ్వాయుధ, క్షిపణి పరీక్షల ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా కేంద్ర నిఘా ఏజెన్సీ(సీఐఏ) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ కొత్త వ్యవస్థకు ‘కొరియా మిషన్ సెంటర్’గా నామకరణం చేశారు. -
ఒబామాను నిలదీసి క్షమాపణలు డిమాండ్!
టోక్యో: అమెరికా అణుబాంబు దాడికి గురై బాధితులుగా మిగిలిన పలువురు జపానీయుల ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలవాలనుకుంటున్నారు. ఆయనను కలిసే సందర్భంగా వారి దీనగాధను చెప్పడమే కాకుండా తమ ప్రజలకు క్షమాపణలు డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. టోక్యోలోని ఓ జాతీయ సంఘానికి చెందిన ఇద్దరు నాయకులు ప్రధానంగా ఈ డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగాసాకిపై అమెరికా అణుబాంబులు వేసిన విషయం తెలిసిందే. దీంతో వేలమంది ప్రాణాలుకోల్పోవడమే కాకుండా ఎంతోమంది వికలాంగులుగా మారారు. ఇప్పటికీ ఆ బాంబు ప్రభావం అక్కడ ఉంది. తన పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఒబామా సెంట్రల్ జపాన్ లో జరగనున్న జీ-7 సమావేశానికి ఈ నెల 27న హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే హిరోషిమా పట్టణంలో పర్యటించనున్నారు. తద్వారా హిరోషిమాను సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలవబోతున్నారు. కాగా, ఒక వేళ హిరోషిమా బాధితుల తరుపున వచ్చేవారితో ఒబామా సమావేశం అయినా క్షమాపణలు మాత్రం చెప్పబోరని వాషింగ్టన్ అధికారులు చెప్పారు. -
భారత్‌పై ఉగ్రవాదులు 'డర్టీ బాంబు' వేస్తే..!
జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు కంటే శక్తిమంతమైన 'డర్టీ బాంబు' ఉగ్రవాదుల చేతిల్లోకి వెళితే.. దానిని ఉగ్రవాదులు మన దేశంపై ప్రయోగిస్తే.. ఇది సామాన్య ప్రజల్నే కాదు భద్రతా సంస్థలను తొలుస్తున్న ప్రశ్న. పోఖ్రాన్ అణుపరీక్షల వార్షిక దినోత్సవం సందర్భంగా ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) లాబోరేటరీ చీఫ్ కేఎస్ ప్రదీప్ కుమార్ 'డర్టీ బాంబు' చుట్టూ ఉన్న అపోహాలను, అపనమ్మకాలను క్లియర్ చేశారు. అలాంటి బాంబులను ముందే పసిగట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఇందుకు దేశవ్యాప్తంగా తగినంత నెట్వర్క్ ఉందని ఆయన వివరించారు. భారత అణు అత్యవసర సన్నద్ధత విభాగంగా బార్క్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డర్టీ బాంబు గురించి ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని వివరాలివి. 'డర్టీ బాంబు' గురించి ఇటీవల చాలా భయాలు వినిపిస్తున్నాయి. అసలు డర్టీ బాంబు అంటే ఏమిటి? జవాబు: డర్టీ అంటే మురికి. మీరు వేసుకున్న దుస్తులు మురికిగా అయ్యావనుకోండి. మీరు అసౌకర్యానికి గురవుతారు. బట్టలు మురికి కావడం వల్ల మీరు చనిపోరు కానీ మీ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడే చాన్స్ ఉంది. కాబట్టి మీరు బట్టలు మార్చుకుంటారు. అదేవిధంగా 'డర్టీబాంబు' మీ ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశముంది. ఇతర బాంబుల్లాంటి పేలుడు ప్రభావాలు దీనిలోనూ ఉంటాయి. దీనికితోడు 'రేడియోయాక్టివ్ మెటిరియల్'ను ఇందులో నింపడం వల్ల ఇది పేలినప్పుడు రేడియో తరంగాలు వ్యాప్తి చెందుతాయి. దీంతో మీ శరీరం, మీరు వేసుకున్న దుస్తులూ విషపూరితమయ్యే అవకాశముంటుంది. దీనివల్ల నేరుగా గాయాలు కావడం, చనిపోవడం లాంటివి జరుగకపోయినా.. రేడియో తరంగాల ప్రభావమనేది ఆందోళన కలిగించే విషయమే. దీని ప్రభావానికి లోనుకాకపోయినా దీనిబారిన పడినట్టు ప్రజలు భీతిల్లే అవకాశముంది. ఇది సమాజంలో గందరగోళాన్ని రేపుతుంది. ఇక, డర్టీ బాంబును ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించలేదు. రేడియోయాక్టివ్ సిసీయం-137, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్ వినియోగించి దీనిని తయారుచేయాలని కొందరు ప్రయత్నించినట్టు ప్రస్తావనలు వచ్చాయి. అంతేకానీ, భారత్‌లో దీనిని ఎప్పుడూ వినియోగించలేదు. ప్రస్తుతం ఈ రేడియోయాక్టివ్ సోర్సెస్కు ప్రపంచవ్యాప్తంగా రానురాను ప్రాధాన్యం పెరుగుతోంది. శాస్త్రవేత్తలతోపాటు, భద్రతా సంస్థలు వీటిని వినియోగించి ప్రయోగాలు చేస్తుండటంతో ఇవి చెడ్డవారి చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగమయ్యే అవకాశముందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. డర్టీబాంబులను పసిగట్టగలిగే సామర్థ్యం భారత్‌కు ఉందా? జవాబు: బార్క్ ఇందుకోసం ఎన్నో వ్యవస్థలను రూపొందించింది. ఎరియల్ గమ్మా స్పెక్టోమెట్రీ సిస్టమ్స్ లాంటి ఎన్నో వ్యవస్థలను మేం అభివృద్ధి చేశాం. అలాంటి తరహా రేడియో తరంగాలను అన్వేషించేందుకు ఇవి ఉపయోగపడతాయి. 'డర్టీబాంబు'ల్లాంటివాటిని బార్క్ పరికరాలు సులువుగా పసిగడతాయి. ఇలాంటి వాటిని భవనాల్లో దాచిపెట్టినా.. రక్షణగా ఏవైనా అడ్డుపెట్టినా.. వాటిని దాటి మా పరికరాలు గుర్తిస్తాయి. -
'హీరో' షిమా.. నాడు.. నేడు
సరిగ్గా 70 ఏళ్ల క్రితం.. 1945 ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్దినం.. ఆ రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు ప్రయోగించింది. ఈ దాడిలో లక్షా 40 వేలమంది ప్రజలు మరణించగా 90 శాతం నగరం పూర్తిగా ధ్వంసమైంది. భయంకరమైన ఆ విస్ఫోటనాన్ని తట్టుకొని జన్‌బకూ డోమ్ అనే ఒకేఒక్క భవనం మాత్రం నిలిచింది. 70 ఏళ్ల క్రితం అలా నిలిచిన భవనమే ప్రస్తుతం హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందింది. సమాధి నుంచి పునరుజ్జీవనం పొంది ప్రస్తుతం 12 లక్షల జనాభాతో, ఆకాశ హర్మ్యాలతో అలరారుతూ జపాన్‌లోనే అత్యంత ప్రత్యేక నగరంగా గుర్తింపు పొందిన హిరోషిమా..ప్రస్తుతం అభివృద్ధిలో తనకు తానే సాటి అంటూ దూసుకుపోతోంది. 70 ఏళ్లనాటి ఆ శిథిల జ్ఞాపకాల నుంచి ప్రస్తుతం అభివృద్ధివైపు ఎలా రూపాంతరం చెందిందో చూపే ఫొటోలివి..