భారత్‌పై ఉగ్రవాదులు 'డర్టీ బాంబు' వేస్తే..! | What happens when terrorists drop dirty bomb on India | Sakshi
Sakshi News home page

భారత్‌పై ఉగ్రవాదులు 'డర్టీ బాంబు' వేస్తే..!

Published Tue, May 10 2016 5:56 PM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

భారత్‌పై ఉగ్రవాదులు 'డర్టీ బాంబు' వేస్తే..!

భారత్‌పై ఉగ్రవాదులు 'డర్టీ బాంబు' వేస్తే..!

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు కంటే శక్తిమంతమైన 'డర్టీ బాంబు' ఉగ్రవాదుల చేతిల్లోకి వెళితే.. దానిని ఉగ్రవాదులు మన దేశంపై ప్రయోగిస్తే.. ఇది సామాన్య ప్రజల్నే కాదు భద్రతా సంస్థలను తొలుస్తున్న ప్రశ్న. పోఖ్రాన్ అణుపరీక్షల వార్షిక దినోత్సవం సందర్భంగా ముంబైలోని బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్ (బార్క్‌) లాబోరేటరీ చీఫ్ కేఎస్ ప్రదీప్‌ కుమార్ 'డర్టీ బాంబు' చుట్టూ ఉన్న అపోహాలను, అపనమ్మకాలను క్లియర్‌ చేశారు. అలాంటి బాంబులను ముందే పసిగట్టేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని, ఇందుకు దేశవ్యాప్తంగా తగినంత నెట్‌వర్క్‌ ఉందని ఆయన వివరించారు. భారత అణు అత్యవసర సన్నద్ధత విభాగంగా బార్క్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డర్టీ బాంబు గురించి ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని వివరాలివి.

'డర్టీ బాంబు' గురించి ఇటీవల చాలా భయాలు వినిపిస్తున్నాయి. అసలు డర్టీ బాంబు అంటే ఏమిటి?

జవాబు: డర్టీ అంటే మురికి. మీరు వేసుకున్న దుస్తులు మురికిగా అయ్యావనుకోండి. మీరు అసౌకర్యానికి గురవుతారు. బట్టలు మురికి కావడం వల్ల మీరు చనిపోరు కానీ మీ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడే చాన్స్ ఉంది. కాబట్టి మీరు బట్టలు మార్చుకుంటారు. అదేవిధంగా 'డర్టీబాంబు' మీ ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశముంది. ఇతర బాంబుల్లాంటి పేలుడు ప్రభావాలు దీనిలోనూ ఉంటాయి. దీనికితోడు 'రేడియోయాక్టివ్‌ మెటిరియల్‌'ను ఇందులో నింపడం వల్ల ఇది పేలినప్పుడు రేడియో తరంగాలు వ్యాప్తి చెందుతాయి. దీంతో మీ శరీరం, మీరు వేసుకున్న దుస్తులూ విషపూరితమయ్యే అవకాశముంటుంది. దీనివల్ల నేరుగా గాయాలు కావడం, చనిపోవడం లాంటివి జరుగకపోయినా.. రేడియో తరంగాల ప్రభావమనేది ఆందోళన కలిగించే విషయమే. దీని ప్రభావానికి లోనుకాకపోయినా దీనిబారిన పడినట్టు ప్రజలు భీతిల్లే అవకాశముంది. ఇది సమాజంలో గందరగోళాన్ని రేపుతుంది.

ఇక, డర్టీ బాంబును ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించలేదు. రేడియోయాక్టివ్ సిసీయం-137, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్‌ వినియోగించి దీనిని తయారుచేయాలని కొందరు ప్రయత్నించినట్టు ప్రస్తావనలు వచ్చాయి. అంతేకానీ, భారత్‌లో దీనిని ఎప్పుడూ వినియోగించలేదు. ప్రస్తుతం ఈ రేడియోయాక్టివ్ సోర్సెస్‌కు ప్రపంచవ్యాప్తంగా రానురాను ప్రాధాన్యం పెరుగుతోంది. శాస్త్రవేత్తలతోపాటు, భద్రతా సంస్థలు వీటిని వినియోగించి ప్రయోగాలు చేస్తుండటంతో ఇవి చెడ్డవారి చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగమయ్యే అవకాశముందనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

డర్టీబాంబులను పసిగట్టగలిగే సామర్థ్యం భారత్‌కు ఉందా?
జవాబు: బార్క్‌ ఇందుకోసం ఎన్నో వ్యవస్థలను రూపొందించింది. ఎరియల్‌ గమ్మా స్పెక్టోమెట్రీ సిస్టమ్స్‌ లాంటి ఎన్నో వ్యవస్థలను మేం అభివృద్ధి చేశాం. అలాంటి తరహా రేడియో తరంగాలను అన్వేషించేందుకు ఇవి ఉపయోగపడతాయి. 'డర్టీబాంబు'ల్లాంటివాటిని బార్క్ పరికరాలు సులువుగా పసిగడతాయి. ఇలాంటి వాటిని భవనాల్లో దాచిపెట్టినా.. రక్షణగా ఏవైనా అడ్డుపెట్టినా.. వాటిని దాటి మా పరికరాలు గుర్తిస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement