dirty bomb
-
డేంజర్స్ డర్టీ గేమ్‌కి ప్లాన్... పుతిన్ షాకింగ్ వ్యాఖ్యలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ డర్టీ బాంబును ప్రయోగించనుందంటూ పదేపదే గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదులు సైతం చేశారు. అందులో భాగంగా ఇప్పుడూ పుతిన్ పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్‌పై పెద్ద ఎత్తున షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పుతిన్ వాల్డాయ్ డిస్కషన్ క్లబ్‌తో మాట్లాడుతూ...ఉక్రెయిన్ అత్యంత ప్రమాదకరమైన డర్టీ గేమ్ ఆడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు వలసవాదంతో కళ్లుమూసుకుపోయి ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ చేత ప్రమాదకరమైన రక్తపాతంతో కూడిన గేమ్‌కి ప్లాన్ చేస్తున్నాయి. ప్రపంచాన్ని నియంత్రించడంలో భాగంగానే పశ్చిమ దేశాలు ఇలా ప్రవర్తిస్తున్నాయంటూ మండిపడ్డారు. అంతేగాదు చివరికి ఈ విషయమై అమెరికా, దాని మిత్రదేశాలతో రష్యాతో మాట్లాడాల్సి పరిస్థితి ఏర్పడుతుందంటూ హెచ్చరించారు. (చదవండి: డ్రోన్లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు) -
డర్టీ బాంబు అంటూ రష్యా గగ్గోలు...భారత రక్షణ మంత్రితో మొర
మాస్కో: ఉక్రెయిన్ డర్టీ బాంబు ప్రయోగించనుందంటూ ఒకటే గగ్గోలు పెడుతోంది రష్యా. ఉక్రెయిన్‌తో సహా పాశ్చాత్య దేశాలు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. కానీ రష్యా మాత్రం డర్టీ బాండు ఉపయోగిస్తోదంటూ ఉక్రెయిన్‌పై ఆరోపణలు చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు వీడియో కాల్లో చైనీస్ రక్షణ మంత్రి వీ ఫెంఘేతో ఈ విషయమై సంభాషించారు. ఆ తర్వాత బుధవారం భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా ఫోన్లో మాట్లాడుతూ. ...ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేసినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. వాస్తవానికి ఈ డర్టీ బాంబు అనేది రేడియోధార్మిక, జీవ సంబంధమైన రసాయన పదార్థాలతో కూడిన బాంబు. ఇది మానవాళికి అత్యంత ప్రమాదకరమైన బాంబు దాడి. రష్యా మాత్రం పదేపదే నాటో ప్రత్యర్థులతో కలిసి ఉక్రెయిన్ డర్టీ బాంబు ఉపయోగించాలని చూస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఒకవైపు అవన్నీ అబద్ధాలు అని ఉక్రెయిన్ కొట్టిపారేస్తోంది. ఈ మేరకు మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ....ఉక్రెయిన్ డర్టీ బాంబు ఉపయోగించనుందన్న పక్కా సమాచారం మా వద్ద ఉంది. అటువంటి విధ్వంసకర చర్యలను నియంత్రించేలా ప్రంపంచ దృష్టికి తీసుకు రావడమే గాక అందుకు తగు చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు. (చదవండి: వీడియో: ఉక్రెయిన్‌పై అణుదాడికి అంతా రెడీ?.. పుతిన్ పర్యవేక్షణలోనే!) -
డర్టీ బాంబ్‌పై బైడెన్ కీలక వ్యాఖ్యలు.. రష్యాకు హెచ్చరికలు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఆ దేశం ఉక్రెయిన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే క్షమించరాని తప్పిదం చేసినట్లే అని స్ఫష్టం చేశారు. శ్వేతసౌధంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డర్టీ బాంబ్(అణు బాంబ్)పై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బైడెన్ ఈమేరకు స్పందించారు. అణుబాంబుల గురించి వస్తున్న వార్తలు నిజమో కాదో తనకు తెలియదని, ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా డర్టీ బాంబ్‌ను ప్రయోగిస్తే మాత్రం తీవ్ర తప్పిదం చేసినట్లేనని పేర్కొన్నారు. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ న్యూక్లియన్ ఎనర్జీ ఆపరేటర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే రష్యా మాత్రం ఉక్రెయినే డర్టీ బాంబ్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని ఆరోపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంలో దాడి చేయబోతుందని చెప్పింది. సొంతప్రజలపైనే అణుబాంబు ప్రయోగించి దాన్ని తమపై తోసేందుకు కుట్ర చేస్తోందని పేర్కొంది. ఖేర్సన్ నుంచి తమ బలగాలను ఖాళీ చేయిస్తోంది. డర్టీ బాంబ్ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనే తేల్చుకుంటామంది. మరోవైపు రష్యా ఆరోపణలను నాటో దేశాలు ఇప్పటికే ఖండించాయి. యుద్ధంలో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే రష్యా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నాయి. చదవండి: డర్టీ బాంబ్ పంచాయితీ భద్రతా మండలికి! -
రష్యా ఆరోపణ.. డర్టీ బాంబ్ పంచాయితీ భద్రతా మండలికి!
ఉక్రెయిన్ దురాక్రమణ నేపథ్యంలో.. రష్యా సంచలన ఆరోపణలకు దిగింది. రష్యా ఆక్రమిత ‘ఖేర్సన్’లో ఉక్రెయిన్ సైన్యం డర్టీ బాంబు ప్రయోగించబోతోందని ఆరోపించింది. ఈ మేరకు ఇప్పటికే ఖేర్సన్ను ఖాళీ చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. అయితే పాశ్చాత్య దేశాలు రష్యా ఆరోపణలను ఖండించగా.. కౌంటర్‌కు మాస్కో సిద్ధమైంది. ఈ పంచాయితీని ఏకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తేల్చుకుంటామని తేల్చేసింది. ఈ మేరకు.. ఐరాసలో రష్యా రాయబారి వస్సెయిలీ నెబెంజియా.. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌కు ఓ లేఖ రాశారు. కీవ్(ఉక్రెయిన్ రాజధాని) బలగాలు డర్టీ బాంబు ప్రయోగానికి సిద్ధమయ్యాయని, డర్టీ బాంబు ప్రయోగం అనేది అణు ఉగ్రవాదం కిందకు వస్తుందని, బలప్రయోగాన్ని నిలువరించాల్సిన బాధ్యత ఐరాస మీద ఉందని పేర్కొంటూ లేఖలో నెబెంజియా ఆరోపించారు. సోమవారం రాత్రి ఈ లేఖ సెక్రటరీ జనరల్‌కు అందినట్లు తెలుస్తంఓది. ఇక మంగళవారం ఈ వ్యవహారంపై భద్రతా మండలిలో తేల్చుకుంటామని రష్యా అంటోంది. ఇక ఉక్రెయిన్ దళాలు.. రష్యా ఆక్రమిత ఖేర్సన్ వైపు వేగంగా కదులుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని రష్యా ఖాళీ చేయిస్తోంది. ఆదివారం ఖేర్సన్కు 35 కిలోమీటర్ల దూరంలోని మైకోలాయివ్(ఉక్రెయిన్ పరిధిలోనే ఇంకా ఉంది)పై రష్యా మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ దాడిలో ఓ అపార్ట్‌మెంట్‌ను సర్వనాశనం అయ్యింది. అదే సమయంలో ఖేర్సన్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని, స్థానికులపై దోపిడీలు జరుగుతున్నాయని ఉక్రెయిన్ సైన్యం ఆరోపిస్తోంది. ఒకవైపు ఉక్రెయిన్ దళాలు వేగంగా రష్యా ఆక్రమిత ప్రాంతాల వైపు దూసుకొస్తుంటే.. మరోవైపు సుమారు ఆరు లక్షల మందిని సైన్యం కోసం రష్యా సిద్ధం చేస్తోంది. ఈ పరిణామాలతో యుద్ధ వాతావరణం మరోసారి వేడెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 67 ఏళ్ల తర్వాత స్నానం చేశాడు.. ప్రాణం పోయింది!!! -
భారత్‌పై ఉగ్రవాదులు 'డర్టీ బాంబు' వేస్తే..!
జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబు కంటే శక్తిమంతమైన 'డర్టీ బాంబు' ఉగ్రవాదుల చేతిల్లోకి వెళితే.. దానిని ఉగ్రవాదులు మన దేశంపై ప్రయోగిస్తే.. ఇది సామాన్య ప్రజల్నే కాదు భద్రతా సంస్థలను తొలుస్తున్న ప్రశ్న. పోఖ్రాన్ అణుపరీక్షల వార్షిక దినోత్సవం సందర్భంగా ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) లాబోరేటరీ చీఫ్ కేఎస్ ప్రదీప్ కుమార్ 'డర్టీ బాంబు' చుట్టూ ఉన్న అపోహాలను, అపనమ్మకాలను క్లియర్ చేశారు. అలాంటి బాంబులను ముందే పసిగట్టేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఇందుకు దేశవ్యాప్తంగా తగినంత నెట్వర్క్ ఉందని ఆయన వివరించారు. భారత అణు అత్యవసర సన్నద్ధత విభాగంగా బార్క్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డర్టీ బాంబు గురించి ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని వివరాలివి. 'డర్టీ బాంబు' గురించి ఇటీవల చాలా భయాలు వినిపిస్తున్నాయి. అసలు డర్టీ బాంబు అంటే ఏమిటి? జవాబు: డర్టీ అంటే మురికి. మీరు వేసుకున్న దుస్తులు మురికిగా అయ్యావనుకోండి. మీరు అసౌకర్యానికి గురవుతారు. బట్టలు మురికి కావడం వల్ల మీరు చనిపోరు కానీ మీ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడే చాన్స్ ఉంది. కాబట్టి మీరు బట్టలు మార్చుకుంటారు. అదేవిధంగా 'డర్టీబాంబు' మీ ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశముంది. ఇతర బాంబుల్లాంటి పేలుడు ప్రభావాలు దీనిలోనూ ఉంటాయి. దీనికితోడు 'రేడియోయాక్టివ్ మెటిరియల్'ను ఇందులో నింపడం వల్ల ఇది పేలినప్పుడు రేడియో తరంగాలు వ్యాప్తి చెందుతాయి. దీంతో మీ శరీరం, మీరు వేసుకున్న దుస్తులూ విషపూరితమయ్యే అవకాశముంటుంది. దీనివల్ల నేరుగా గాయాలు కావడం, చనిపోవడం లాంటివి జరుగకపోయినా.. రేడియో తరంగాల ప్రభావమనేది ఆందోళన కలిగించే విషయమే. దీని ప్రభావానికి లోనుకాకపోయినా దీనిబారిన పడినట్టు ప్రజలు భీతిల్లే అవకాశముంది. ఇది సమాజంలో గందరగోళాన్ని రేపుతుంది. ఇక, డర్టీ బాంబును ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించలేదు. రేడియోయాక్టివ్ సిసీయం-137, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్ వినియోగించి దీనిని తయారుచేయాలని కొందరు ప్రయత్నించినట్టు ప్రస్తావనలు వచ్చాయి. అంతేకానీ, భారత్‌లో దీనిని ఎప్పుడూ వినియోగించలేదు. ప్రస్తుతం ఈ రేడియోయాక్టివ్ సోర్సెస్కు ప్రపంచవ్యాప్తంగా రానురాను ప్రాధాన్యం పెరుగుతోంది. శాస్త్రవేత్తలతోపాటు, భద్రతా సంస్థలు వీటిని వినియోగించి ప్రయోగాలు చేస్తుండటంతో ఇవి చెడ్డవారి చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగమయ్యే అవకాశముందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. డర్టీబాంబులను పసిగట్టగలిగే సామర్థ్యం భారత్‌కు ఉందా? జవాబు: బార్క్ ఇందుకోసం ఎన్నో వ్యవస్థలను రూపొందించింది. ఎరియల్ గమ్మా స్పెక్టోమెట్రీ సిస్టమ్స్ లాంటి ఎన్నో వ్యవస్థలను మేం అభివృద్ధి చేశాం. అలాంటి తరహా రేడియో తరంగాలను అన్వేషించేందుకు ఇవి ఉపయోగపడతాయి. 'డర్టీబాంబు'ల్లాంటివాటిని బార్క్ పరికరాలు సులువుగా పసిగడతాయి. ఇలాంటి వాటిని భవనాల్లో దాచిపెట్టినా.. రక్షణగా ఏవైనా అడ్డుపెట్టినా.. వాటిని దాటి మా పరికరాలు గుర్తిస్తాయి.